యాంకర్‌గా, హీరోగా నందు అందరికీ సుపరిచితుడు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అతడు అన్నుకుంత సక్సెస్ చూడలేకపోయాడు. అది తల్చుకుని తాజా ఈవెంట్‌లో ఎమోషనలయ్యాడు. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్‌రెడ్డితో పాటు నందు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.
నేనంటే చిన్న చూపు: నందు ఎమోషనల్
ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 2న) సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్‌కు ఇంత ఎమోషనల్ అవడం మీకు ఓవర్‌గా అనిపించొచ్చు. కానీ ఇదంతా నాకు ఒక జర్నీ. (కన్నీళ్లు తుడుచుకుంటూ) ఇది పీఆర్ స్టంట్ అయితే కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతోందని ఓ పాడ్‌కాస్ట్ వాళ్లు చెప్పారు. నేనంటే అందరికీ చాలా చిన్నచూపు.
సక్సెస్ రాలే..
పెళ్లిచూపులు సినిమాలో నేను సెకండ్ హీరోగా చేశాను. అందులో చేసిన హీరో పెద్ద హీరో అయ్యాడు. అందులో మంచి రోల్ చేసిన ప్రియదర్శి మంచి హీరో అయిపోయాడు. నాకు పేరొచ్చింది, కానీ సక్సెస్ రాలేదు. నా ప్యాషన్ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా నటనకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చాను.
సినిమా నచ్చకపోతే..
ఆర్సీబీలో విరాట్ కోహ్లి వంటి ప్లేయర్ ఉన్నాసరే ఐపీఎల్ కప్పు గెలవడానికి 18 ఏళ్లు పట్టింది. వాళ్లు ఈసారి కప్ నమ్‌దే అన్నారు. నేను కూడా ఈసారి హిట్టు నమ్‌దే అంటున్నా.. సినిమా చూడండి. మీకు నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి మీ అందరికీ క్షమాపణలు చెప్తాను. కానీ ఫెయిలైనా ఇక్కడే ఉంటా.. చచ్చేవరకు సినిమాలే చేస్తా అని నందు (Actor Nandu) చెప్పుకొచ్చాడు. సైక్ సిద్దార్థ మూవీ (Psych Siddhartha Movie) డిసెంబర్ 12న విడుదల కానుంది.
చదవండి: బిగ్‌బాస్ 9: దుమ్ము దులిపిన ఇమ్మూ, తనూజ.. రేసులో ఆమె అవుట్


