టాలీవుడ్ నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రెండు సినిమాలలో వేలు పెట్టిన ఆ టాలీవుడ్ హీరో సంగతి తర్వాత చూస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్ దాకా వెళ్లిందని.. కానీ నేను మాత్రం వెళ్లలేదని తెలిపారు. నా సినిమాకు రూ.1.6 కోట్ల బడ్జెట్ అని చెప్పి.. రూ.4.8 అయ్యేలా చేశారని వెల్లడించారు.
మాకు ఈ విషయం చెప్పకుండానే హీరోయిన్ సీన్స్ తీసేయించారని నిర్మాత అన్నారు. హీరోను డామినేట్ చేసేలా ఉన్నాయంటూ దాదాపు 15 నిమిషాల సన్నివేశాలను తీసేశారని ఆయన మండిపడ్డారు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్గా నటించారని తెలిపారు. దీంతో ఆ తర్వాత సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకున్నారని నిర్మాత పేర్కొన్నారు. అయితే ఆలా చేసిన ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
కాగా.. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మాత సమాధానాలిచ్చారు.
Producer Chandrasekhar opens up about the hurdles faced during the making of #TejaSajja’s #Adbhutam.#GOAT pic.twitter.com/LiaegRU8Xc
— Australian Telugu Films (@AuTelugu_Films) December 2, 2025


