టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
అయితే మరోవైపు ఈ మూవీ టైటిల్పై కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


