ఆయా షేర్‌ నా తొలి పాట కావడం హ్యాపీ: సుధన్‌ | Nani The Paradise Movie Aaya Sher Song Choreographer Sudhan Master Shares About His Journey In Press Meet | Sakshi
Sakshi News home page

ఆయా షేర్‌ నా తొలి పాట కావడం హ్యాపీ: సుధన్‌

Mar 4 2026 12:51 AM | Updated on Mar 4 2026 1:10 PM

Aaya Sher Song choreographer Sudhan Master Press Meet

‘దసరా’ వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్‌ కానుంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘ఆయా షేర్‌’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా టాప్‌ ట్రెండ్‌లో దూసుకెళుతోందని యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ పాట కొరియోగ్రాఫర్‌ సుధన్‌ మాట్లాడుతూ– ‘‘దసరా’ చిత్రానికి ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఆ సమయంలో ‘నువ్వెప్పుడు కొరియోగ్రాఫర్‌ అవుతావు’ అని అడిగేవారు. ‘సాంగ్‌ ఇస్తే చేస్తానని’ చెప్పేవాడిని. అలా నేను కొరియోగ్రాఫర్‌ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట కలిసింది శ్రీకాంత్‌గారినే. ‘ఆయా షేర్‌’ పాట కొత్తగా ఉండాలని శ్రీకాంత్‌గారు చె΄్పారు. సినిమాలో నానీగారి ఇంట్రో సాంగ్‌ ఇది. దీంతో నానీగారిని కొత్తగా చూపించాలనే ఆలోచనతో కొరియోగ్రఫీ స్టార్ట్‌ చేశాను.

ఒక ఎడిట్‌ వెర్షన్‌ చేశాను. హుక్‌ స్టెప్‌ కూడా అద్భుతంగా కుదిరింది. దర్శకుడికి నచ్చింది. ఒక కొత్త కొరియోగ్రాఫర్‌గా నా తొలి పాటను ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి చేయడం కాస్త ఒత్తిడిగానే ఉంటుంది. దర్శకుడు ఇచ్చిన చాన్స్‌కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పని చేశాను. ఇప్పుడు ‘ఆయా షేర్‌...’ పాటకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ సాంగ్‌ తర్వాత మా నిర్మాత కొరియోగ్రఫీ గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాలకు కూడా చాన్స్‌లు వస్తున్నాయి’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement