యానిమేషన్ కథా చిత్రాలకు ప్రపంచస్థాయిలో స్ఫూర్తిదాయకుడు జేమ్స్ కామెరూన్. ఆయన 2009లో తెరకెక్కించిన అవతార్ చిత్రం ఒక అద్భుతం. ఈ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తరువాత దానికి సిక్వెల్‌గా రూపొందిన అవతార్. ది వే ఆఫ్ వాటర్ చిత్రం 2022లో విడుదలై ప్రేక్షకులకు కనువిందు చేసింది. అప్పుడే దర్శకుడు జేమ్స్ కామెరూన్ దీనికి ఫ్రాంచైజీ ఉందన్నారు.
దీంతో ప్రేక్షకులు ఈ సారి ఎలాంటి వండర్ సృష్టిసారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడే రోజు వచ్చేసింది. అవతార్ మూడో పార్ట్‌గా అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19వ తేదీన తెలుగు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. దీన్ని 20 సెంచరీ స్టూడియో సంస్థ విడుదల చేస్తోంది.
ఈ మూవీ గత రెండు చిత్రాల కంటే మరింత బ్రహ్మాండంగా తెరకెక్కించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఈసారి ఈ చిత్రం ప్రేక్షకులకు ఐమాక్స్ థియేటర్లో అనుభూతిని కలిగించబోతోంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రానికి డిసెంబర్ 5నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


