టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.
ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్లో వినోద్ సాగర్తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు.


