breaking news
Arnold Vosloo
-
రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత..!
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ మూవీ విలన్ అర్నాల్డ్ వోస్లో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీలో సర్ థియోడర్ హెక్టర్ అనే ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ స్వయంగా వెల్లడించారు. జూన్ 16న అర్నాల్డ్ వోస్లో పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. రణబాలిలో అర్నాల్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. నా చిన్నప్పుడు చూసిన సినిమాలలో 'మమ్మీ' నాకు ఎంతో ఇష్టమైన చిత్రమని రాసుకొచ్చారు. అందులోని ప్రతి పాత్ర నాకు నచ్చిందన్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా రాక్షసులు నిజంగా ఉండగలరని నమ్మేలా చేసింది మాత్ర.. ఆ సినిమాలోని ప్రతినాయకుడైన అర్నాల్డ్ వోస్లోనే అని ప్రశంసలు కురిపించారు.అర్నాల్డ్ ఎంట్రీతో విజయ్ దేవరకొండ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్‌తో నటించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించారు. గతంలో విజయ్ హీరోగా వచ్చిన లైగర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో కలిసి నటించారు. ఇప్పుడు రణబాలిలో అర్నాల్డ్ వోస్లో ఎంట్రీతో ఏ హీరోకు సాధ్యం ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో నటించిన అరుదైన రికార్డ్ సాధించారు. కాగా.. రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Mummy was one of my all-time favorite films growing up. I loved every character in it, but above all, it was the villain who made me truly believe that monsters could exist.Many years later, when I sat down to write one of my favorite villain characters ever- The Monster in… pic.twitter.com/8NXX90U4HX— Rahul Sankrityan (@Rahul_Sankrityn) June 16, 2026 -
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్‌తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్‌లో వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు. -
అప్పుడు మైక్ టైసన్..ఇప్పుడు ఆర్నాల్డ్.. ‘తగ్గేలే’ అంటున్న విజయ్!
విజయ్ దేవరకొండ ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ అయితే లేదు కానీ..అవకాశాలకు మాత్రం కొదవ లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాదు..బడ్జెట్ విషయంలోనూ తగ్గడం లేదు. వందల కోట్ల పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన కోసం హాలీవుడ్ నటులను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ‘లైగర్’లో మైక్ టైసన్‌తో తలపడిన విజయ్..ఇప్పుడు ‘మమ్మీ’ విలన్‌తో పోరాడబోతున్నాడు.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రానికి నిర్మిస్తుంది. ఇందులో విలన్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ( Arnold Vosloo) నటిస్తున్నాడు.‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ లాంటి హాలీవుడ్ సినిమాలతో విలన్‌గా నటించిన ఆర్మాల్డ్.. విజయ్ చిత్రంతో తొలిసారిగా ఇండియన్ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అందర్ని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట. విజయ్ సైతం కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్‌ని మార్చేశాడు.


