
విజయ్ దేవరకొండ ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ అయితే లేదు కానీ..అవకాశాలకు మాత్రం కొదవ లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాదు..బడ్జెట్ విషయంలోనూ తగ్గడం లేదు. వందల కోట్ల పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన కోసం హాలీవుడ్ నటులను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ‘లైగర్’లో మైక్ టైసన్‌తో తలపడిన విజయ్..ఇప్పుడు ‘మమ్మీ’ విలన్‌తో పోరాడబోతున్నాడు.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రానికి నిర్మిస్తుంది. ఇందులో విలన్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ( Arnold Vosloo) నటిస్తున్నాడు.
‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ లాంటి హాలీవుడ్ సినిమాలతో విలన్‌గా నటించిన ఆర్మాల్డ్.. విజయ్ చిత్రంతో తొలిసారిగా ఇండియన్ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అందర్ని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట. విజయ్ సైతం కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్‌ని మార్చేశాడు.