‘‘జిన్’ సినిమాను థియేటర్లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇందులో కొత్త ప్రపంచాన్ని చూపించాం’’ అన్నారు నిర్మాత నిఖిల్ ఎం. గౌడ. అమిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్, రవి భట్, సంగీత ముఖ్య తారలుగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కానుంది.
నిఖిల్ గౌడ మాట్లాడుతూ– ‘‘చిన్మయ్ రావ్ చెప్పిన ‘జిన్’ కథ కొత్తగా అనిపించి, నిర్మించాను. థ్రిల్‌కి గురి చేయడంతో పాటు భయపెట్టేలా ఉంటుంది. న్యూ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక నుంచి కన్నడ, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.


