breaking news
Jin movie
-
ప్రేక్షకులకు థ్రిల్
‘‘జిన్’ సినిమాను థియేటర్లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇందులో కొత్త ప్రపంచాన్ని చూపించాం’’ అన్నారు నిర్మాత నిఖిల్ ఎం. గౌడ. అమిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్, రవి భట్, సంగీత ముఖ్య తారలుగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కానుంది. నిఖిల్ గౌడ మాట్లాడుతూ– ‘‘చిన్మయ్ రావ్ చెప్పిన ‘జిన్’ కథ కొత్తగా అనిపించి, నిర్మించాను. థ్రిల్‌కి గురి చేయడంతో పాటు భయపెట్టేలా ఉంటుంది. న్యూ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక నుంచి కన్నడ, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. -
డార్లింగ్-2గా మారిన జిన్
జిన్ చిత్రం డార్లింగ్-2గా మారింది.యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ను కథానాయకుడిగా పరిచయం చేయడంతో పాటు విజయాన్ని అందించిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేసి మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు డార్లింగ్-2 చిత్ర విడుదల హక్కుల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ సీక్వెల్ చిత్రం అంటే అంతకు ముందు చిత్ర కథకు కొనసాగింపు అయి ఉండనవసరం లేదన్నారు. డార్లింగ్-2 చిత్ర కథ, కథనాలు తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. ముఖ్యంగా స్నేహం, హార్రర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం విజయంపై నమ్మకం ఏర్పడడంతో విడుదల హక్కుల్ని పొందినట్లు వెల్లడించారు. ఈ డార్లింగ్-2 చిత్రాన్ని రిట్ మీడియా వర్క్స్ సంస్థ జిన్ పేరుతో నిర్మించింది. నవ దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కలైఅరసన్, మాయ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో కాళీవెంకట్, అర్జున్. మునీష్కాంత్,మెడ్రాస్జానీ,రమీజ్రాజ్ నటించారు.ఈ చిత్రాన్నే డార్లింగ్-2 పేరుతో జ్ఞానవేల్‌రాజా అక్టోబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


