అఫీషియల్‌.. అఖండ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Balakrishna Akhanda 2 Movie Release Date Announced, Check Out Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Akhanda 2 Release Date: అఫీషియల్‌.. అఖండ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Dec 9 2025 10:25 PM | Updated on Dec 10 2025 11:04 AM

Balakrishna Akhanda 2 release date announced

కొన్ని గంటల్లో రిలీజ్‌ కావాల్సిన అఖండ 2.. గత గురువారం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 నిర్మాతలకు ఈరోస్‌ సంస్థతో ఉన్న ఫైనాన్స్‌ వివాదం కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌పై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా నిర్మాత సంస్థ సినిమా విడుదల తేదిని ప్రకటించింది. అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

 రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్‌ 11న ప్రీమియర్స్‌ కూడా పడనున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement