హాలీవుడ్‌లో ఆస్కార్ పండగ మొదలైంది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మార్చి 16న ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు.
అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణించారు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు ప్రకటించడం విశేషం!
ఆస్కార్ విజేతల జాబితా
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)
ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్‌స్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సలైవా


