breaking news
Academy of Motion Picture Arts and Sciences
-
స్టూడెంట్స్ ఆస్కార్ అవార్డ్: ఆస్కార్ దారిలో తెలుగమ్మాయ్!
వందకి పైగా దేశాలు... 3,127 షార్ట్‌ఫిల్మ్‌లు... 80 మందికిపైగా న్యాయ నిర్ణేతలు... 30 రోజుల పాటు వడపోతలు.. చివరికి మిగిలింది... 60 షార్ట్ ఫిల్మ్‌లు... అందులో ఒకటి భారత్‌కు చెందిన... అదీ... ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ఐడీ కి చెందిన విద్యార్థి లావణ్య లోధది కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ స్టూడెంట్ అకాడెమీ అవార్డుల్లో లావణ్య తన సత్తా చాటింది. తాను తీసిన ‘వీన్స్ ఆఫ్ గ్రేస్’ చిత్రం టాప్–15లో చోటు దక్కించుకుంది.తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...కాన్పూర్‌కి చెందిన లావణ్య లోధి తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ప్రతి మూడేళ్లకోసారి బదిలీలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతూ విద్యనభ్యసించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలతో కలగలసి లావణ్య జీవితం సాగింది. తల్లి కథక్ నాట్య గురువు. ఆమె నుంచే లావణ్యకు నాట్యం, కథలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో రాణించడంతో పాటు.. సృజనాత్మకంగా బొమ్మలు గీస్తుండటంతో.. తల్లిదండ్రులు ప్రోత్సహించి.. లావణ్యని డిజైన్ రంగం వైపు అడుగులు వేయించారు. 2020లో ప్లస్–2 చదువుతున్న సమయంలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో లావణ్య కళాకృతుల గురించి ప్రధాని మోదీ ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం.. ఆమె విజయవాడ సమీపంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)విద్యా సంస్థలో కమ్యునికేషన్ డిజైన్‌లో చేరింది. యానిమేషన్, మూవింగ్ ఇమేజెస్‌పై నిరంతరం తన డిజైన్లతో పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్ఐడీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. లావణ్య చదువులోనే కాకుండా.. యానిమేషన్, ఫిల్మ్ లాంగ్వేజ్, విజువల్ స్టోరీ టెల్లింగ్, సౌండ్, కల్చరల్ స్టడీస్‌లోనూ డ్యాన్సర్‌గా, స్టోరీటెల్లర్‌గా రాణిస్తూ.. యూనివర్శిటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది.విన్సీ ఆఫ్ గ్రేస్ కథేంటీ..?లావణ్య తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఎలాంటి సంభాషణలూ లేవు. కేవలం సంగీతం, నృత్యం, అభినయమే కథకు బలం. ఇది ఒక చిన్న యానిమేటెడ్ చిత్రం. ఒక యువతి తాను జీవితాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమైపోతుంది. ఈ సమయంలో ఆమె తల్లి తనకు నేర్పినట్లుగా నాట్యం నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఆమెకు గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలన్నీ.. ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ.. ఆ అమ్మాయి.. నృత్యంతో పాటుగా.. కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఓ ప్రశాంతమైన టెర్రస్‌పై కనిపించేలా ఈ చిత్రాన్ని లావణ్య ఆవిష్కరించింది. మనం ఎవరం.. ఎక్కడి నుంచి వచ్చాం.. మన సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసుకునేందుకు నడక, నడత, నాట్యం ఎలా సహాయపడతాయన్నదే విన్సీ ఆఫ్ గ్రేస్.అన్నీ ఆమే!ఈ చిత్రానికి ఫిల్మ్ మేకర్, యానిమేషన్ ఫిల్మ్ డిజైనర్, మొత్తం సినిమా స్క్రిప్ట్, సౌండ్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్, యానిమేషన్.. ఇలా అన్నీ.. లావణ్యే కావడం విశేషం. లావణ్యకు మెంటార్‌గా ఎన్ఐడీ కమ్యునికేషన్ డిజైన్ హెడ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మనాథం వ్యవహరించగా.. ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు డా.అభిషేక్, గౌతమ్ చక్రవర్తి, జనాంతిక్ శుక్లా, బినితా దేశాయ్, శేఖర్ ముఖర్జీ సహకారం అందించారు.ఈ అవార్డులు ఎవరిస్తారంటే.?ఆస్కార్ అవార్డులు అందించే.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ అకాడమీ అవార్డులు (ఎస్ఏఏ) అందిస్తారు. ఈ ఏడాది 52వ అవార్డుల్ని రోలెక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. మే 18 వరకూ ఎంట్రీలు తీసుకున్నారు. ప్రపంచంలోని వివిధ డిజైన్ ఇనిస్టిట్యూట్స్, యానిమేషన్, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్లలో విద్యనభ్యసిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని చిత్ర రంగంలో ప్రోత్సహించేందుకు ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటారు.ఏయే విభాగాలంటే..యానిమేషన్, డాక్యుమెంటరీ, లైవ్ యాక్షన్ కథనం, ప్రయోగాత్మక షార్ట్ఫిల్ములని ఆస్కార్.ఆర్గ్ కు ఆన్లైన్లో పంపగా.... మే 18 వరకూ అందిన షార్ట్ఫిలింలని తీసుకున్నారు. ఆ తర్వాత వడపోత నిర్వహించారు. మొత్తం 3,127 చిత్రాల్లో వివిధ దశల్లో వడపోతలు నిర్వహించి.. సెమీఫైనల్‌కు 60 చిత్రాల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 6న న్యూయార్క్‌లోని జీగ్‌ఫెల్డ్ బాల్ రూమ్‌లో జరిగే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా.. ఈ 60 చిత్రాల్లో టాప్ చిత్రాల్ని ప్రకటించి.. అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రాలు యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ లేదా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 98వ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు అర్హత సాధిస్తాయి.అమ్మకే అంకితం!నా నాట్య గురువు అమ్మకు ఈ విన్సీ ఆఫ్ గ్రేస్‌ని అంకితం చేస్తున్నాను. ఎన్ఐడీ సహకారంతో.. ఈ షార్ట్‌ఫిల్మ్‌ని పూర్తి నమ్మకంతో తీసి.. ఎస్ఏఏ అవార్డులకు పంపించాను. సెమీఫైనల్‌కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 6న ఒక్క అవార్డు అయినా.. విన్సీ ఆఫ్ గ్రేస్‌కు వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి జీవిత వారసత్వ కథే నా చిత్రం. ఆస్కార్ వేదికపై విన్సీ ఆఫ్ గ్రేస్ ప్రదర్శితమయ్యేలా భారతీయులందరి ఆశీస్సులు నాకు కావాలి.– కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
ఆస్కార్ యాక్టర్ బ్రాంచ్‌లో ఎన్టీఆర్
ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. ఎన్టీఆర్‌తో పాటు అమెరికన్ నటుడు కె.హ్యు క్వాన్, అమెరిక్ నటి మార్షా స్టెఫానీ బ్లేక్, ఐరిస్ నటి కెర్రీ కాండన్, అమెరికన్ కమ్ కెనెడియన్ నటి రోసా సలాజర్‌లు ఈ జాబితాలో నమోదయ్యారు. ‘‘వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే. స్పెయిన్‌లో వార్ 2? ప్రస్తుతం తెలుగులో ‘దేవర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ఎన్టీఆర్. అటు హిందీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ చిత్రం రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో ్రపారంభమైందట. కాగా నవంబరు చివరి వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని భోగట్టా. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు
ప్రపంచ చలన చిత్ర రంగంలోని ఏ నటుడైన ప్రతిష్టాత్మకంగా భావిచే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చిన చాలనుకుంటారు. ఈ అరుదైన అవకాశం తాజాగా స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్కు దక్కింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్ విత్ ఫైర్ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్ 28న రాత్రి అకాడమీ బోర్డ్ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. చదవండి: గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి. చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు.. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
Academy Ban On Will Smith For 10 Years: ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్‌పై చర్యలు తీసుకుంటూ అతడిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇది ఒక్క ఆస్కార్ అవార్డులకు మత్రమే కాదు మోషన్ పిక్చర్ నిర్వహించే ఇతర వేడుకలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఏప్రిల్ 8న సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విల్ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ ఇదిలా ఉంటే స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా గత నెల నిర్వహించిన 94వ ఆస్కార్ అవార్డు వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టాడు. స్మిత్ భార్య జాడా పింకెట్‌కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. దీంతో అగ్రహానికి లోనైన స్మిత్ స్టేజ్‌పైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా..
Will Smith Resigns: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (అకాడమీ అవార్డ్స్)కు రాజీనామా చేశాడు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడంపై విల్ స్మిత్ శుక్రవారం (ఏప్రిల్ 1) ఈ విధంగా తెలిపాడు. క్రిస్ రాక్‌ను చెంప దెబ్బ కొట్టండ అనేది 'షాకింగ్, బాధాకరమైనది, క్షమించరానిది' అని పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. ఈ వేడుకను అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని నేను కోల్పోయేలా చేశాను, నేను పోగొట్టుకున్నాను. నా గుండె ముక్కలైంది (హార్ట్ బ్రోకేన్). కాబట్టి, నేను అకాడమీ అవార్డ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను.' అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపాడు. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. అంతేకాకుండా 'మార్పుకు సమయం పడుతుంది. హింసను అనుమతించకుండా, అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా నా పనికి నేను కట్టుబడి ఉంటాను.' అని విల్ చెప్పుకొచ్చాడు. విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలిపారు. క్షమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18న జరిగే గ్రూప్ బోర్డు సమావేశంలో ఈ విషయం గురించి చర్చించనున్నారు. అయితే గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? 'అలోపేసియా' వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌ను ఉద్దేశించి జోక్ చేశాడు వ్యాఖ్యాత క్రిస్ రాక్. దీంతో ఆగ్రహానికి లోనైనా విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప చెల్లుమనించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆస్కార్ అందుకునే సమయంలో అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు, తర్వాతి రోజు ఇన్‌స్టా గ్రామ్‌లో క్షమాపణలు కూడా తెలిపాడు విల్. అకాడమీ చర్యల్లో భాగంగా విల్ స్మిత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. #WillSmith resigns from the #Academy for slapping #ChrisRock at the #Oscars His statement pic.twitter.com/3sDhcAkDuZ — Ramesh Bala (@rameshlaus) April 2, 2022 -
ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే..
Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here: ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 92వ అకాడమీ అవార్డుల వేదికపై విల్ స్మిత్, అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హాలీవుడ్ సినీ లోకం షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి ఇరువురి స్థానాల్లో వారు ఉంటే ఏం చేశారో చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటనపై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. విల్ స్మిత్‌పై త్వరలోనే తగిన చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు విల్ స్మిత్.. క్రిస్ రాక్‌ను కొట్టడానికి గల కారణం ఏమైంటుంది ? విల్ భార్య జాడా పింకెట్‌కు ఏమైంది ? ఎందుకు ఆమె గుండుతో కనిపించింది ? చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ చిన్న కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె జుట్టు పూర్తిగా తొలగించుకొని గుండుతో ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. ఆమెను చూసిన క్రిస్ 'జీఐ జేన్' సినిమాలో 'డెమి మూర్' యాక్ట్ చేసిన పాత్రతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో 'డెమి మూర్' పూర్తి గుండుతో కనిపిస్తుంది. 'జీఐ జేన్' సీక్వెల్లో కనిపించబోతున్నారా ? అని క్రిస్ రాక్ నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: 63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు ఈ మాటలతోనే ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ కోపోద్రిక్తుడయ్యాడు. నిజానికి జాడా పింకెట్ 'అలోపిసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో జుట్టు ఊడిపోతు ఉంటుంది. అయితే తన భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయాడు విల్ స్మిత్. ఆగ్రహంతో నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ దవడ పగలకొట్టి వెనుదిరిగాడు విల్ స్మిత్. తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై విరుచుకుపడ్డాడు. 'నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు' అంటూ గట్టిగా అరుస్తూ క్రిస్ రాక్‌ను హెచ్చరించాడు విల్. ఈ ఘటనతో ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. చదవండి: ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్ హీరో, వీడియో వైరల్ ఈ ఇన్సిడెంట్ తర్వాత 'కింగ్ రిచర్డ్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు. ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు తెలిపాడు. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి క్షమాపణలు కోరాడు. ఈ ప్రపంచంలో హింసకు చోటులేదని, తన ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని పేర్కొంటూ.. తనను క్షమించమని క్రిస్ రాక్‌ను కోరాడు విల్ స్మిత్. 'అలోపిసియా' లక్షణాలు: వయోజన మహిళల్లో ఎక్కువగా వస్తుంది 50% శాతం వరకు జుట్టు రాలిపోతుంది చర్మం రాలిపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి విటమిన్లు, మైక్రో ఎలిమెంట్లు ఉన్న పరిమిత ఆహారం తీసుకోవాలి ధీర్ఘకాలిక చికిత్స చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
మార్పులకు ఆస్కారం
కోవిడ్–19 (కరోనా వైరస్) ప్రభావం వల్ల రానున్న 93వ ఆస్కార్ నియమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆ మార్పులు 93వ ఆస్కార్ వేడుక వరకే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాల రిలీజులు ఆగిన విషయం తెలిసిందే. ఇందువల్ల కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యాయి. ఇలా విడుదలైన వాటిలో ప్రేక్షకులు అమితంగా మెచ్చిన సినిమాలు ఉండొచ్చని, ఆయా చిత్రబృందాల కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్’ ఆస్కార్ అవార్డుల నియమాల్లో మార్పులు చేసింది. దీంతో డైరెక్ట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ అండ్ వీఓడీ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదలైన సినిమాలు కూడా ఈసారి ఆస్కార్ అవార్డ్స్ పోటీ బరిలో ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ సినిమాలు కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్‌ను ప్లాన్ చేసుకుని ఉండాలనే షరతు పెట్టారు. అలాగే సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డు విభాగం కింద పరిగణించనున్నట్లు ఆస్కార్ అవార్డ్ కమిటీ వెల్లడించింది. ‘‘సినిమాను థియేటర్లో చూడడాన్ని మించిన అనుభూతి లేదు. కానీ కోవిడ్ 19 వైరస్ వల్ల ఆస్కార్ అవార్డు అర్హత నియమాల్లో తాత్కాలిక మార్పులు చేయక తప్పలేదు. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే పాత రూల్సే వర్తిసాయి’’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 93వ ఆస్కార్ వేడుక 2021 ఫిబ్రవరి 28న జరగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డుగా పరిగణించాలనే నిర్ణయం పట్ల భారతీయ సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, సౌండ్ మిక్సర్ రసూల్ పూకుట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అకాడమీ పునఃసమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు రసూల్. 2008లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్, రిచర్డ్‌లతో కలిసి రసూల్ ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. -
‘ఆస్కార్స్ బాస్’పై లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : 90వ ఆస్కార్ వేడుకలు జరిగి ఎన్నో రోజులు అవడం లేదు, అప్పుడే ఆ అకాడమీకి చెందిన బాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ ఆప్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడు జాన్ బైలీపై మూడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదైనట్టు హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ రిపోర్టు చేశాయి. ఈ ఆరోపణలపై విచారణ కూడా ప్రారంభమైందని తెలిపాయి. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అయిన బైలీ, గత ఏడాది ఆగస్టులో అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘అమెరికన్ గిగోలో’, , ‘ది బిగ్ చిల్’, ‘గ్రౌండ్ హోగ్ డే’ వంటి సినిమాలకు ఈయన పనిచేశారు. ఈ విషయంపై స్పందించిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. అన్ని పార్టీలను రక్షించడానికి అకాడమీ ఫిర్యాదులను రహస్యంగా ఉంచుతామని తెలిపింది. తమ ప్రవర్తనా నియమావళి ప్రమాణాల ప్రకారం అకాడమీ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను కమిటీ మెంబర్షిప్ సమీక్షిస్తుందని పేర్కొంది. అన్ని సమీక్షలు పూర్తయిన తర్వాత బోర్డు ఆఫ్ గవర్నర్లకు రిపోర్టు చేయనున్నామని చెప్పింది. పూర్తిగా రివ్యూ ముగిసే వరకు దీనిపై ఎలాంటి కామెంట్ చేయమని అకాడమీ వెల్లడించింది. ప్రస్తుతం హాలీవుడ్లో లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున్న చర్చనీయాంశమయ్యాయి. హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌కు, హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ ఉద్యమం’ కూడా భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంగా వైన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా 70 మందికి పైగా ఫిర్యాదులు నమోదుచేశారు. గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ నుంచి వైన్‌స్టీన్‌ను తొలగించేశారు. వైన్‌స్టీన్ కంపెనీ కూడా దివాలా తీయబోతుంది. -
హాలీవుడ్ మ్యూజియమ్
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటే అర్థం కాకపోవచ్చు. కాని ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించే సంస్థ అనగానే గుర్తు పట్టేస్తారు. ఆ సంస్థకు ఒక కల ఉంది. అదేంటంటే పెద్ద హాలీవుడ్ మ్యూజియం ఏర్పాటు చేయడం. అద్భుతమైన సినిమాల స్క్రీన్‌ప్లేలు, కాస్ట్యూమ్స్, కెమెరాలు, ఫిల్మ్ మేకింగ్‌పై వచ్చిన పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఒక్కటనేంటి ఒక సినిమా ప్రపంచాన్నే ఆ మ్యూజియంలో ఆవిష్కరించాలని ఆ సంస్థ కల. ఎప్పట్నుంచో ఈ కల కోసం సంస్థ కష్టపడుతున్నా ఇప్పటికి అన్నీ కుదిరేశాయి. ఆరున్నర ఎకరాల్లో అదిరిపోయే హంగులతో లాస్ ఏంజిల్స్‌లో ఈ మ్యూజియం రెడీ అవుతుంది. ఇది 2019కల్లా రెడీ కానుంది. ఇందులో వెయ్యి మంది కూర్చునేలా ఒక పెద్ద థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. సినిమాలంటే ఇష్టమున్నవాళ్లు మ్యూజియమ్‌కు వస్తే నోరెళ్లబెట్టేలా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతానికి ఆస్కార్‌కు లైబ్రరీ ఉన్నా అది అందరికీ అందుబాటులో లేదు. కొత్తగా వస్తోన్న మ్యూజియం మాత్రం అందరి కోసం! సినిమాను ప్రేమించే అందరి కోసం!! -
ఆస్కార్ అవార్డు కమిటీలో భారతీయులు
ఆస్కార్ అవార్డుల ఎంపికలో వర్ణ వివక్ష కనిపిస్తోందనే వాదన ఎప్పట్నుంచో ఉంది. గడచిన ఫిబ్రవరిలో జరిగిన అవార్డు వేడుకలో కొంతమంది నల్ల జాతి నటీనటులు బహిరంగంగానే విమర్శించారు. కొందరు ఈ వేడుకను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ‘ఆస్కార్.. సో వైట్’ అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ఆస్కార్ అవార్డు ఎంపికల్లో ఇలా జాతి వివక్ష జరగడం సరికాదని పలువురు సినీప్రేమికులు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఛైర్మన్ చెరిల్ బూనె, ‘‘భవిష్యత్తులో జరగబోయే అవార్డు వేడుకల్లో ఇలాంటి వివాదం రాకుండా చూసుకుంటాం. అకాడమీ నిబంధనలు, కమిటీ సభ్యుల ఎంపిక తదితర విషయాల గురించి క్షుణ్ణంగా చర్చిస్తాం’’ అని వేడుకల సమయంలో పేర్కొన్నారు. ఈ ఏడాది అవార్డు వేడుక ముగిసి నాలుగు నెలలైంది. మరో ఎనిమిది నెలల్లో అవార్డుల వేడుక రానే వస్తుంది. ఈసారి వర్ణ వివక్షకు సంబంధించిన వివాదం రాకూడదనుకున్నారు కాబట్టి, కమిటీ మెంబర్స్ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఈ దిశలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో విశేష పేరు సంపాదించిన ప్రముఖులను సభ్యులుగా చేర్చుకోవాలని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 683 మంది ప్రముఖులకు ఆస్కార్ అవార్డు కమిటీలో మెంబర్స్‌గా వ్యవహరించాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు పంపింది. మన భారతీయ తారల్లో ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, నేటి తరం నాయిక, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటో, ప్రముఖ దర్శకురాలు దీపా మెహతాలకు ఆహ్వానం అందింది. అలాగే, భారతీయ మూలాలున్న బ్రిటిష్ ఫిలిం మేకర్ ఆసిఫ్ కపాడియాని మెంబర్‌గా వ్యవహరించాల్సిందిగా ఆస్కార్ అవార్డ్ కమిటీ కోరింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో ‘ఎమి’ అనే లఘు చిత్రానికి దర్శకుడిగా ఆసిఫ్ ఆస్కార్ అందుకున్నారు. ‘ది గుడ్ డైనోసార్’ అనే యానిమేషన్ చిత్రానికి యానిమేటర్‌గా చేసిన సంజయ్ బక్షీకి కూడా ఆస్కార్ కమిటీ ఇన్విటేషన్ పంపించింది. ఈయన కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కమిటీ సభ్యుల ఎంపిక పరంగానే కాకుండా అవార్డు వేడుకను వివాదాలకు తావు లేకుండా నిర్వహించడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటోంది ఆస్కార్ అవార్డు కమిటీ. -
ఆస్కార్ లైబ్రరీలో...
ఆస్కార్గా ప్రపంచ ప్రసిద్ధమైన అవార్డులను అందించే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ లైబ్రరీలో హిందీ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’కు అరుదైన గౌరవం దక్కింది. సినీ దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, రచయితలకు.. ఇంకా సినిమా రంగానికి చెందిన ఇతర శాఖలవారికీ, విద్యార్థులకు పరిశోధన నిమిత్తం ఈ లైబ్రరీలో ఉత్తమ స్క్రీన్‌ప్లేతో రూపొందిన కథలను పొందుపరుస్తుంటారు. అలా, 1910వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 11,000 పై చిలుకు స్క్రీప్ప్లేలకు ఈ లైబ్రరీలో స్థానం లభించింది. ఇప్పుడీ జాబితాలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేరింది. ఈ విషయాన్ని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలియజేశారు. షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరుల కలయికలో ఫరా ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. షారుక్ సతీమణి గౌరీఖాన్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు వసూళ్లు సాధించింది.