ఆస్కార్‌ యాక్టర్‌ బ్రాంచ్‌లో ఎన్టీఆర్‌ | Jr NTR joins actor branch at Oscar Academy | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ యాక్టర్‌ బ్రాంచ్‌లో ఎన్టీఆర్‌

Oct 20 2023 5:32 AM | Updated on Oct 20 2023 5:32 AM

Jr NTR joins actor branch at Oscar Academy - Sakshi

ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. ఎన్టీఆర్‌తో పాటు అమెరికన్‌ నటుడు కె.హ్యు క్వాన్, అమెరిక్‌ నటి మార్షా స్టెఫానీ బ్లేక్, ఐరిస్‌ నటి కెర్రీ కాండన్, అమెరికన్‌ కమ్‌ కెనెడియన్‌ నటి రోసా సలాజర్‌లు ఈ జాబితాలో నమోదయ్యారు.

‘‘వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. అలాంటి వారిని ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే.  

స్పెయిన్‌లో వార్‌ 2?
ప్రస్తుతం తెలుగులో ‘దేవర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ఎన్టీఆర్‌. అటు హిందీలో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్‌ 2’ చిత్రం రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో ్రపారంభమైందట. కాగా నవంబరు చివరి వారంలో ‘వార్‌ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారని భోగట్టా. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement