కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు | TDP And Janasena Leaders Clash In NTR District | Sakshi
Sakshi News home page

కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు

Mar 9 2026 6:44 PM | Updated on Mar 9 2026 7:22 PM

TDP And Janasena Leaders Clash In NTR District

ఎన్టీఆర్‌ జిల్లా: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే ఒకేసారి చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒకరు ఉదయం భూమి చేస్తే.. అదే కార్యక్రమానికి సాయంత్రం మరొకరు భూమి పూజ చేస్తారు. ఇలా భూమి పూజతో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి.  

ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించారు కూటమి నేతలు. కోడూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ రోడ్డుకు భూమి పూజలో రగడ నెలకొంది.  

ఉదయం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు. మధ్యాహ్నం అదే రోడ్డుకు కోడూరు మండల టిడిపి నాయకులు మళ్లీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement