Will Smith: నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు: విల్‌ స్మిత్‌

Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here - Sakshi

Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here: ఆస్కార్‌ అవార్డ్స్‌ 2022 వేడుకలో హాలీవుడ్‌ స్టార్ హీరో విల్‌ స్మిత్‌ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 92వ అకాడమీ అవార్డుల వేదికపై విల్‌ స్మిత్‌, అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హాలీవుడ్‌ సినీ లోకం షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి ఇరువురి స్థానాల్లో వారు ఉంటే ఏం చేశారో చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటనపై ఆస్కార్‌ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. విల్ స్మిత్‌పై త్వరలోనే తగిన చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు విల్‌ స్మిత్‌.. క్రిస్‌ రాక్‌ను కొట్టడానికి గల కారణం ఏమైంటుంది ? విల్‌ భార్య జాడా పింకెట్‌కు ఏమైంది ? ఎందుకు ఆమె గుండుతో కనిపించింది ? 

చదవండి: హీరో విల్‌ స్మిత్‌ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?

ఇటీవల జరిగిన ఆస్కార్‌ అవార్డ్స్‌ 2022 వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ చిన్న కామెడీ ట్రాక్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విల్‌ స్మిత్ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె జుట్టు పూర్తిగా తొలగించుకొని గుండుతో ఆస్కార్‌ వేడుకకు హాజరయ్యారు. ఆమెను చూసిన క్రిస్‌ 'జీఐ జేన్‌' సినిమాలో 'డెమి మూర్‌' యాక్ట్‌ చేసిన పాత్రతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో 'డెమి మూర్‌' పూర్తి గుండుతో కనిపిస్తుంది.  'జీఐ జేన్‌' సీక్వెల్‌లో కనిపించబోతున్నారా ? అని క్రిస్‌ రాక్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. 

చదవండి: 63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు

ఈ మాటలతోనే ఆస్కార్‌ విన్నర్‌ విల్‌ స్మిత్‌ కోపోద్రిక్తుడయ్యాడు. నిజానికి జాడా పింకెట్‌ 'అలోపిసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో జుట్టు ఊడిపోతు ఉంటుంది. అయితే తన భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయాడు విల్‌ స్మిత్‌. ఆగ్రహంతో నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్‌ దవడ పగలకొట్టి వెనుదిరిగాడు విల్‌ స్మిత్‌. తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై విరుచుకుపడ్డాడు. 'నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు' అంటూ గట్టిగా అరుస్తూ క్రిస్‌ రాక్‌ను హెచ్చరించాడు విల్‌. ఈ ఘటనతో ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. 

చదవండి: ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్‌ హీరో, వీడియో వైరల్‌

ఈ ఇన్సిడెంట్‌ తర్వాత 'కింగ్ రిచర్డ్‌' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకునేందుకు విల్‌ స్మిత్‌ వేదికపైకి వచ్చాడు. ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు తెలిపాడు. తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరోసారి క్షమాపణలు కోరాడు. ఈ ప్రపంచంలో హింసకు చోటులేదని, తన ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని పేర్కొంటూ.. తనను క్షమించమని క్రిస్‌ రాక్‌ను కోరాడు విల్‌ స్మిత్‌. 

'అలోపిసియా' లక్షణాలు:
వయోజన మహిళల్లో ఎక్కువగా వస్తుంది
50% శాతం వరకు జుట్టు రాలిపోతుంది
చర్మం రాలిపోతూ ఉంటుంది
మానసిక ఒత్తిడి
విటమిన్లు, మైక్రో ఎలిమెంట్లు ఉన్న పరిమిత ఆహారం తీసుకోవాలి
ధీర్ఘకాలిక చికిత్స

చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top