
సీనియర్ నటి రాధ కూతురు కార్తీక నాయర్ కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే!

ఈమె జోష్, రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దమ్ము సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

2015లో వచ్చిన ఓ తమిళ సినిమాలో చివరిగా కనిపించింది.

2023లో పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది.

తాజాగా కార్తీక బర్త్‌డే రోజు షూట్ చేసిన ఓ రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో రాధ, కార్తీక తప్ప ఎవరూ నటులు కాదు, అయినా ఎవరికి తోచినట్లు వారు పర్ఫామెన్స్ ఇచ్చారు.

కార్తీక భర్త, మామయ్య కూడా అందులో భాగమయ్యారు.

తన బర్త్‌డే రీల్ స్పెషల్‌గా ఉండాలని కుటుంబమంతా ఇలా ఏకమైందని రాధ చెప్పుకొచ్చింది.