
పాల నురుగులా తెల్లగా ఉండాలంటే మేనుకి పాల మీగడతో మర్దన చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ముఖం కాంతిమంతంగా, మృదువుగా ఉండాలంటే కాచిన పాలపై ఉండే మీగడ అంద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ పాల మీగడను ముఖానికి ఎలా అప్లై చేస్తే చక్కటి ఫలితం పొందగలమో సవివరంగా చూద్దామా..!.
రెండు టేబుల్ స్పూన్ల ΄పాల మీగడలో ఒక టీస్పూను ఆల్మండ్ ఆయిల్, నాలుగైదు చుక్కల రోజ్ ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇది పొడిబారి, గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
చర్మం తెల్లగా మారాలంటే... చిన్న చందనం ముక్కను పాలతో పేస్టు చేసి అందులో చిటికెడు స్వచ్ఛమైన పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు ప్యాక్ వేస్తుంటే ఫలితం ఉంటుంది.
ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక టీ స్పూన్ పెసలను ఎర్రగా వేయించాలి. వీటిలో పాలను కలుపుతూ పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి ఆరాక వలయాకారంగా రుద్దుతూ ప్యాక్‌ను వదిలించాలి. ఇలా చేయడం వల్ల ప్యాక్‌లోని సుగుణాలు చర్మానికి పట్టడంతోపాటు మృతకణాలు రాలిపోతాయి. తరవాత చన్నీటితో కడిగితే సరిపోతుంది.
(చదవండి: పెళ్లి అంటే డబ్బు, హోదా కాదు..! అంతకటే ముందు..: ఉపాసన కొణిదెల)