కుంతీదేవి కర్ణుడి తల్లి. ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల సూర్యుని ప్రార్థన చేస్తే కర్ణుడు జన్మించాడు. కానీ వివాహం జరగకముందే బిడ్డ పుడితే సమాజం ఏమంటుందో అనే భయంతో ఆ బిడ్డను కుంతీ నదిలో వదిలేసింది. అయితే వరంతో జన్మించిన బిడ్డ కాబట్టి కర్ణుడికి ఏం కాలేదు. మహాభారతంలో దానవీరుడిగా ప్రసిద్ధి చెందాడు కర్ణుడు.
ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని ఓ నగరానికి మేయర్‌గా ఉన్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి పరిస్థితి కూడా దాదాపు ఇదే. మూడు రోజుల శిశువుగా ఉన్నప్పుడే ఓ మాతృసంస్థలో వదిలేసింది కన్నతల్లి. ఇది జరిగి ఇప్పటికి 41 ఏళ్లు అయ్యింది. 1985లో నాగ్‌పూర్‌కు చెందిన ఓ తల్లి.. తన కుమారుడిని మాతృసంస్థకు అప్పచెప్పింది. నాగ్‌పూర్‌లో ఉన్న మాతృసేవా సంఘ్‌లో విడిచిపెట్టి పెళ్లిపోయింది.
ఏ పరిస్థితుల కారణమో, ఎంతటి దయనీయ స్థితిలో ఆ తల్లి కుమారుడిని వద్దనుకుంది. అయితే అక్కడ ఉన్న నర్సు.. ఆ కుర్రాడికి ఫాల్గున్‌గా నామకరణం చేసింది. ఆ శిశువును తల్లి వదిలేసిన నెల వ్యవధిలో నెదర్లాండ్స్ నుంచి ఒక జంట సదరు మాతృసంస్థకు వచ్చింది. ఆ శిశువును అక్కడ నుంచి తీసుకుని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చదువుకుని ఇప్పుడు మేయర్ అయ్యాడు. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌కు దగ్గరగా ఉన్న హీమ్‌స్టెడ్‌కు మేయర్‌గా ఎన్నికయ్యాడు.
ఆ శిశువు నెదర్లాండ్స్‌లో పెరిగి.. అక్కడ మేయర్ కావాలని రాసి పెట్టి ఉంది కాబట్టి అలా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. పూర్వ పుణ్యమో, కారణ జన్మమమో ఆ శిశువును ఇప్పుడు మేయర్‌గా నిలిపింది.
తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు..
ఆ మేయర్‌కు ఇప్పుడు తన మూలాల గరించి తెలిసింది. తన పుట్టుక గురించి తెలిసింది. తాను భారత్‌కు చెందిన ఓ తల్లికి జన్మించాననే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లిని వెలికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌కు వచ్చాడు మేయర్ ఫాల్గున్.. ఈ క్రమంలోనే ఓ మాట అన్నాడు ఫాల్లున్. మహాభారతంలోని కర్ణుడి గురించి చెప్పుకొచ్చాడు. తల్లి కుంతీ దేవిని కలవడానికి కర్ణుడికి హక్కు ఉందన్నాడు. అందుకోసమే తాను తల్లి కోసం వెతుకలాట ప్రారంభించానని అంటన్నాడు.
దీనిలో భాగంగా 2025లో భారత్‌కు మూడుసార్లు వచ్చాడు ఈ ‘కలియుగ కర్ణుడు’. నాగ్‌పూర్ కలెక్టర్ సాయం తీసుకున్నాడు. తాను పుట్టడానికి సాయం చేసిన నర్సును కలిశాడు. నర్సును తాను కలవడం చాలా సంతోషంగా ఉందని, తన జననం ఫాల్గుణ మాసంలో జరిగింది కాబట్టి తనకు ఫాల్గున్ అని పేరు పెట్టినట్లు రిటైర్డ్ అయ్యి ఇంటి వద్దే ఉంటున్న నర్సు తెలిపినట్ల స్పష్టం చేశాడు. తన గురించి పలు విషయాలను ఆమె చెప్పడం ఒక మధురానుభూతిని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు నెదర్లాండ్ మేయర్,


