పొంగల్‌వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..! | energetic Puliyattam at New Jersey school Goes Viral | Sakshi
Sakshi News home page

పొంగల్‌వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!

Jan 15 2026 1:46 PM | Updated on Jan 15 2026 1:48 PM

energetic Puliyattam at New Jersey school Goes Viral

పొంగల్‌ వేళ ఓ పాఠశాలలోని టీచర్‌ మార్గదర్శకత్వంలోని సాంప్రదాయ పులి నృత్యం నెట్టింట వైరల్‌గా మారి అదరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ చిన్నారులు ఆనృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించేలా చేసేందుకు అతడు పడ్డ తపన మాటలకందనిది. ఓ గురువు తన శిష్యుల కోసం ఎంతలా కష్టపడతాడు అనేందుకు ఈ ఘట్టం అద్భుతమైన ఉదాహరణ.

న్యూజెర్సీ ఎడిసన్‌లోని తిరువల్లూవర్ తమిళ పాఠశాలలో జరిగిన ఉత్సాహభరితమైన పొంగల్ వేడుక నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో గులాబీ రంగు చీర ధరించిన ఓ మహిళా టీచర్‌ తన పిల్లల ముందు నిలబడి పులియట్టం (సాంప్రదాయ పులి నృత్యం) కోసం మార్గనిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తాడు. దాంతో ఆ విద్యార్థులు తమ టీచర్‌ని అనుసరిస్తూ..సులభంగా ఆ బీట్‌కు అనుగుణంగా కాళ్లు కదుపుతుంటాడు. 

అయితే అక్కడ వాళ్లు ఆ సంగీత లయలకు అనుగుణంగా సరిగా స్టెప్పులు వేస్తున్నా..అక్కడ ఆ మహిళా టీచర్‌ మాత్రం అందరి దృష్టిని అకర్షించి, హైలెట్‌గా నిలిచింది. అక్కడున్న విద్యార్థులంతా ఆ సంప్రదాయ పులి నృత్యం అంతభాగా ప్రదర్శించగలిగారంటే..అందుకు ఆ టీచర్‌ పెట్టిన ఎఫెక్టే కారణం. వాళ్లు ఏ స్టెప్‌ని మిస్‌ చేయకుండా కేర్‌ తీసుకుంటూ..వారికి ఎదురుగా నిలబడి ఆ టీచర్‌ కూడా నృత్యం చేస్తూ..పడిన తపనకి అందరూ ఫిదా అవ్వడమే గాక..ఆమె పెట్టిన ఎఫెక్ట్‌కి మాటల్లేవ్‌ అంతే..!. అంటూ పోస్టలు పెట్టారు నెటిజన్లు

 

(చదవండి: Makar Sankranti 2026: అరిసెలే కాదు ఉంధియు, తిల్ పిఠా కూడా!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement