ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.
ధరలు ఇలా..
ఒక లీటరు పెట్రల్: రూ. 45.10
ఒక లీటరు పాలు: రూ. 160.60
ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70
ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405
అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.
వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు
➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.
➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.
➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!


