'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్ | Know The Reasons Of Gold Price Hike Says FM Sitharaman | Sakshi
Sakshi News home page

'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

Feb 23 2026 6:58 PM | Updated on Feb 23 2026 7:19 PM

Know The Reasons Of Gold Price Hike Says FM Sitharaman

భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే.. బంగారం ధర పెరుగుదలకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఫిబ్రవరి 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరుగుదలకు కారణం అవుతోందని అన్నారు.

ఇతర కారణాలు
కేంద్ర బ్యాంకుల కొనుగోలు మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు & సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గోల్డ్ రేటు అమాంతం పెంచేస్తున్నాయి. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి.

ఈ రోజు ధరలు
భారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో తెలుగు రాష్ట్రల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,61,350 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,900 వద్ద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement