అమెజాన్‌ అతిపెద్ద ఆఫీస్‌.. ఇక్కడే.. | Amazon second largest office in Asia opens in Bengaluru | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ అతిపెద్ద ఆఫీస్‌.. ఇక్కడే..

Feb 23 2026 5:33 PM | Updated on Feb 23 2026 5:49 PM

Amazon second largest office in Asia opens in Bengaluru

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్‌ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.

గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. “భారత్‌ అమెజాన్‌కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.

ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement