కొన్ని పనులు చూసేందుకు చిన్నగా ఉన్నా.. అందరి హృదయాలను దోచుకుంటుంది. కాస్త మనసుపెడితే..పెద్దపనులతోనే మన ప్రేమను వ్యక్తం చేయాల్సిన పనిలేదు. చాలా చిన్నపాటి వాటితో కూడా అనంతమైన ప్రేమను చాలా సునిశితంగా వ్యక్తం చేయొచ్చు. అందుకు ఈ ఆటో డ్రైవరే నిదర్శనం.
బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో వేలాడిదీసిన చెవిపోగులు కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అవి ఆయన భార్య చెవిపోగులు. రోజంతా ఆమెతో ఉన్నట్లుగా ఫీలయ్యేలా ఆటోలో అద్దానికి వేలాడదీయడంతో అవి ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి చాలామంది ఆ అద్దం ముందు పూలు వంటి ఇతర డెకరేటెడ్ ఐటెమ్స్ పెట్టుకుంటారు.
భార్య గుర్తొచ్చేలా..ప్రతి నిమిషం ఆమెతో ఉన్నట్లుగా ఎదురుగా అలా వేలాడదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా బయటపడుతుంది అనేందుకు ఈ ఆటోడ్రైవర్ చేసిన పనే ఉదాహరణ. సింపుల్‌గా చెప్పాలంటే అతడి ప్రేమ చూస్తే..మనుషులెరగలేరు మాములు ప్రేకాదు..అగ్నికంటే స్వచ్ఛమైనది..అనే పాట గుర్తొస్తోంది కదూ..! నెటిజన్లు సైతం సదరు డైవర్‌పై ప్రశంసలు కురిపిస్తు పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..!


