సమస్య అబ్బాయిలది కాదు..!1950ల నాటి ఆలోచనలనే.. | Gurugram CEO Shares Delhi Moms Demand For No Career Wife For Her Son | Sakshi
Sakshi News home page

సమస్య అబ్బాయిలది కాదు..!1950ల నాటి ఆలోచనలనే..

Feb 22 2026 9:22 AM | Updated on Feb 22 2026 9:29 AM

Gurugram CEO Shares Delhi Moms Demand For No Career Wife For Her Son

మహిళా సాధికారత అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పేస్తుంటాం. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా అప్‌గ్రేడ్‌ అవ్వడానికి ఇష్టపడతాం. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పాతధోరణికే వంతపాడతాం. అందులోనూ అత్తగా హోదా రావడంతోనే మహిళలు వెనుబడిపోతున్నారా..?లేక ఏళ్ల నాటి కుచించిత మనస్తత్వం వల్లనో తెలియదు..కానీ అప్పటి వరకు ఉన్న స్త్రీత్వం అత్త అన్న పదం కారణంగా తక్కువగా మారిపోతోంది. చూడటానికి సింపుల్‌గా కనిపించే ఈ రెండు అక్షరాల పదబంధం తెలియకుండానే తనలోని స్త్రీకి తానే హాని చేసుకుంటూ..ఎవరో తొక్కేస్తున్నారు అని అనుకుంటోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ అత్త డిమాండ్‌ చూస్తే..ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామనిపిస్తుంది.

ఏఐ టెక్నాలజీ, రోబో టెక్నాలజీతో దూసుకుపోతున్న తరుణంలో పెళ్లి విషయంలో కాస్త అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఇష్టపడటం లేదేమో అంటున్నారు గురుగ్రామ్‌ సీఈఓ జస్వీర్ సింగ్. ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌​ చేసిన పోస్ట్‌ ఆధునిక కుటుంబాల ఆలోచనలు ఈకాలంలో కూడా ఇలానా అన్నట్లుగా ఉన్నాయంటూ రాసుకొచ్చారు. యువత సైతం కెరీర్‌ వరకు ఎంత బాగా ఆలోచించినా..కొన్నివిషయాల్లో ఆలోచనలు పాతధోరణికే వంతపాడుతున్నారని అన్నారు. 

మాట్రిమోనియల్‌ యాప్‌ నాట్‌. డేటింగ్‌ సీఈవో ఓ మాట్రీమోనిల్‌ ప్రొఫెల్‌ని షేర్‌ చేస్తూ..వారి డిమాండ్లు గురించి రాశారు. డిల్లీ చందిన ఓ తల్లి తన కొడుకు రూ. 75 లక్షలు సంపాదిస్తున్నాడని, కాబట్టి కాబోయే కోడలు..మంచి పేరున్న యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయి అయ్యి..ఉద్యోగం చేసే ఆలోచన ఉండకూడదని కండిషన్‌ పెట్టారామె. పైగా..అందంగా ఉండాలి, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అయ్యి ఉండాలి. ఇంటికి, కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తన కొడుకు భార్య పెళ్లి తర్వాత పనిచేయడం తమకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. 

వాళ్లు ముఖ్యంగా డిమాండ్‌ చేస్తోంది ఏమిటంటే..కెరీర్‌కి అంత ప్రాధాన్యత ఇవ్వని అమ్మాయి కావాలని చెబుతున్నారు. అయితే సీఈవో జస్వీర్‌ సింగ్‌ మాత్రం వాళ్లకి కావాల్సింది మంచి డిగ్రీ, అందమైన శరీరం ఉన్న పనిమనిషి కోసం చూస్తున్నారని అ‍న్నారు. ఇటీవల ఇలాంటి డిమాండ్‌లో కూడిన కేసులను చాలానే చూస్తున్నామని అన్నారు. ఆధునికులు కానీ సాంప్రదాయవాదులు, తెలివైనవారు కానీ విధేయులు, కార్పొరేట్‌ తరహా రేంజ్‌ కానీ కావాల్సింది 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారంటూ నేటి మగపిల్లల కుటుంబాల ఆలోచన తీరుని విమర్శించారు. 

ఆయన షేర్‌ చేసిన పోస్ట్‌ సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అసలు మనం సమాన భాగస్వామ్యానికి సిద్ధంగా లేం కదూ..!. చదువుల్లోనూ, సంపాదనలోనూ అప్‌గ్రేడ్‌ అవుతాం కానీ..పెళ్లి విషయంలో మాత్రం కాలం చెల్లిన ధోరణిలో ఉండటానికే ఇష్టపడుతుండటం బాధకరం. ఇక్కడ సమస్య అబ్బాయిలది కాదు..పెద్దలు తమ ఆలోచన తీరు బ్లూప్రింట్‌నే వారిలో నాటేస్తుండటం వల్ల వస్తున్న సమస్య ఇది. వివాహాలు చేసే విధానంలో డెవలప్‌మెంట్‌ ఉంది, కానీ మనస్తత్వాలను మార్చుకోవడం లేదా అప్‌గ్రేడ్‌ అవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నారు.

(చదవండి: ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్‌ దిగ్గజాలు సైతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement