ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...
పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.
తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు...
పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం.
ఇతర అవయవాలకూ పాకవచ్చు
డెంటల్ యాబ్సెస్‌కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు.
లక్షణాలు
సాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి.
పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙
ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం.
గొంతులోని గ్రంథులు వాచడం.
నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం.
ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్‌ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి.
నివారణ
ప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌నే వాడంటం.
పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం.
పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం.
బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం.
నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం.
చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం.
ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం.
చికిత్స
పంటి యాబ్సెస్‌కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్‌ను తొలగించడంతోటు రూట్‌కెనాల్ అవసరం పడవచ్చు.
డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్


