Oral Health
-
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్‌డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్‌లో బ్రషింగ్‌కు బదులు బ్రష్‌ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్‌కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్‌కు ఐస్‌బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్‌డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్‌గా కూల్‌డ్రింక్స్ చాలా మాల్స్‌లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, ఫుట్‌బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్‌లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్‌క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్‌ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్‌బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్‌కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్‌గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్‌డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్‌ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్‌నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్‌లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్‌తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్‌ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్‌ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్‌వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో ΄ోలిస్తే రెడ్‌వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్‌వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్‌నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్‌పిక్స్‌తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్‌లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్‌ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్‌ను గానీ లేదా పెన్ క్యాప్‌ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్‌గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్‌కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్‌ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్‌కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
నోటి ఆరోగ్యంతో కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్!
నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యంమంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!)అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. నోటి సంరక్షణ ఎలా?ఆయుర్వేద పేస్ట్‌తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్‌ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి.నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. -
ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యం కోసం..
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్ఎమ్ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం. నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు. కొన్ని సమస్యలు...అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు... పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం. పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు... ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం... ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్‌పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు. పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్ఎమ్ఆర్’... దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది. ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్ఎమ్ఆర్)గా చెబుతారు.ఎఫ్ఎమ్ఆర్లో ఏం జరుగుతుంది... ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు. అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు. ఇక అందానికీ, లుక్స్‌కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు. డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
Tooth Brush టూత్ బ్రష్.. దీని కథ తెలుసా?
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది. ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్‌ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్‌లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్‌ల వెనుక ఇంత చరిత్ర ఉంది. -
టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?ఎపుడు మార్చాలి?దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది. శానిటైజ్బ్రష్లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్‌వాష్‌లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.అలాగే బ్రష్ హోల్డర్లను బాత్రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది. చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంఅనారోగ్యం తరువాతజలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్‌ను వదిలేసి, కొత్త బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్ను బ్రష్‌నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఇంకా వేగంగా అరిగిపోతాయి. -
ఒంటికి మంచిదే..మరి పంటికి?
ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో... తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.దగ్గు మందులతో... దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్య అధిగమించడానికి...దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో... పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. (చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?
మనలో చాలామంది టూత్‌బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. మరీ ఏళ్లు కాకపోయినా బ్రిజిల్స్ అంటే మనం పళ్లు తోముకునే భాగం బాగుంటే కనక కనీసం ఏడాదికి తగ్గకుండా వాడతారు. అయితే టూత్‌బ్రష్‌ను అంతకాలం పాటు వాడటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.టూత్‌బ్రష్‌ను ఇంతకాలం లోపు మార్చాలనే విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ మూడు నాలుగు నెలలకోసారి మార్చడం మంచిదంటున్నారు వైద్యులు. అదేవిధంగా బ్రిజిల్స్ వంగి΄ోయినప్పుడు, లేదా కొన్ని బ్రిజిల్స్ ఊడిపోయినప్పుడు... ఊడుతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే బ్రష్ మార్చడం మంచిది. బ్రష్‌ను, టంగ్క్లీనర్ను బాత్రూమ్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. మరో ముఖ్యవిషయం... ఏదైనా జబ్బు పడి కోలుకున్న తర్వాత అప్పటివరకు వాడుతున్న బ్రష్ కొత్తదైనా సరే, దానిని పారేసి, కొత్త బ్రష్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే జబ్బుపడ్డప్పుడు ... అంటే వైరల్ ఫీవర్స్, డెండ్యూ, మలేరియా, టైఫాయిడ్... మరీ ముఖ్యంగా దంత వ్యాధులతో బాధపడుతున్ననప్పుడు తప్పనిసరిగా బ్రష్ మార్చడం అవసరం. ఇంటిల్లిపాదీ ఒకే బాక్స్‌లో బ్రష్‌లు పెట్టుకోవడం సాధారణం.. అటువంటప్పుడు రోజూ బ్రష్ చేసుకునేముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోడాతో ముప్పురోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.సోడా చాలా కార్బోనేటేడ్గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.ఎముకలు బలహీనంసోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.చర్మంపై దురదలుసోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.షుగర్వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. -
నోరు తెరిస్తే దుర్వాసన! తౌడు నానబెట్టిన నీటిలో వీటిని కలిపి తాగితే..
Oral Health Tips In Telugu- Bad Breath: ఉదయమే చక్కగా బ్రష్ చేసుకున్నారు. అయినా మధ్యాహ్నం నుంచి నోరు తెరిస్తే చాలు.. దుర్వాసన అని తెలిసిపోతోంది. ఎందుకిలా? బ్రష్ చేసిన తర్వాత కూడా వచ్చే నోటి దుర్వాసనకు కారణం ఏమిటి? దుర్వాసన అనేది చిగుళ్ళ వ్యాధి వంటి పెద్ద దంత సమస్య యొక్క లక్షణం కావొచ్చు. ఇది దంతాలపై ఫలకాన్ని (plaque) తయారు కావడం వల్ల సంభవిస్తుంది. చికిత్స చేయకపోతే, చిగుళ్ళ వ్యాధి దుర్వాసన మరియు దవడ ఎముక దెబ్బతినడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. హేలిటోసిస్ అంటే నోటిలో నుంచి దుర్వాసన రావడం. దీనినే దుర్వాసన లేదా బ్యాడ్ బ్రీత్ అని కూడా అంటారు. దీనికి కారణాలు ప్రధానంగా.. 1. ఆహారం- మీ దంతాలలో మరియు చుట్టుపక్కల ఉన్న ఆహార కణాల విచ్ఛిన్నం బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు దుర్వాసన కలిగిస్తుంది. 2. పొగాకు ఉత్పత్తులు. ధూమపానం అత్యంత అసహ్యకరమైన నోటి వాసనకు కారణమవుతుంది. 3. పేలవమైన దంత పరిశుభ్రత, అంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం నోటి దుర్వాసన ఇంకా ఏవైనా అనారోగ్యాలకు సంకేతమా? నోటి దుర్వాసన ఇతర వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉన్నాయన్న దానికి హెచ్చరిక సంకేతం కూడా కావచ్చు. శ్వాసకోశ మరియు టాన్సిల్ ఇన్ఫెక్షన్లు, సైనస్ సమస్యలు, డయాబెటిస్, కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలు, అలాగే కొన్ని రక్త రుగ్మతలలో నోటి దుర్వాసన ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది. మనం నోరు బాగా శుభ్రం చేసుకొన్నా దుర్వాసన వస్తోందంటే ఒక సారి డెంటిస్ట్‌ను కలవడం మంచిది. నోటిపూత సాధారణంగా నోటిపూత బి(B) విటమిన్ లోపం వలన వస్తుంది. నివారణకు ముందు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తౌడుని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ఓ 15 రోజుల పాటు తీసుకోవాలి. తౌడులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక పొట్టలో అల్సర్ వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది. ఆహారంలో మసాలాలు లేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి. పండ్లు, కూరగాయలు, జ్యూస్‌లు, తీసుకోవాలి. అలాగే నీరు బాగా త్రాగాలి. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు!


