‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు | Hema Malini's No Sense Remark on NEET UG Protests | Sakshi
Sakshi News home page

‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు

Jul 21 2026 10:48 AM | Updated on Jul 21 2026 11:01 AM

Hema Malini's No Sense Remark on NEET UG Protests

న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ వివాదంపై రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ ఎంపీ హేమామాలిని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిరసనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి, యువతకు మోదీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని ఆమె సమర్థించారు.
 

అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఈ వివాదం రాజకీయంగానూ వేడెక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయడంతో పాటు భారీగా మోహరించారు. పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement