breaking news
No sense
-
‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ వివాదంపై రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ ఎంపీ హేమామాలిని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిరసనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి, యువతకు మోదీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని ఆమె సమర్థించారు. #WATCH | Monsoon session of Parliament | Delhi: BJP MP Hema Malini says, “If there is a problem, it should be discussed properly. Protesting in this manner won't achieve anything. As for the country's youth and the education system, our Modi government has always stood by them… pic.twitter.com/4HQqf90fqk— ANI (@ANI) July 20, 2026అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఈ వివాదం రాజకీయంగానూ వేడెక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయడంతో పాటు భారీగా మోహరించారు. పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి...
ప్రస్తుతం వస్తున్న పాటలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయని బాలీవుడ్ ప్రముఖ సంగీత గాయకుడు బప్పీ లహరి అన్నారు. ఈ పాటలు వినడానికి చిరాకుగా ఉందని, ఇది తీవ్రంగా నిరాశపెట్టే అంశమని ఆయన వ్యాఖ్యానించారు. 'హంటర్' చిత్రానికి.. హంటర్ 303 అనే పాటపాడిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నేటి లిరిక్స్లలో చిత్రవిచిత్రమైన పదాలను పొందుపరుస్తున్నారని, ఇది ఏవగింపు కలిగించే అంశమని చెప్పారు. 'ఒక్కసారి పాత పాటల గురించి ఆలోచించండి ఎంత మధురంగా ఉంటాయో. వాటిని జనాలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. సంగీతానికి నేడు స్వర్ణయుగం ఉన్నప్పటికీ నేటి పాటలకు మాత్రం భావాలతో పనిలేకుండా పోయింది. లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి.. కానీ, వీటిని నేటి యువతరం ఇష్టపడుతున్నారు' అని ఆయన అన్నారు. 42 సంవత్సరాల నుంచి తాను సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతున్నానని, తనకు పాత పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వాటి వన్నే తగ్గలేదని చెప్పారు.


