సీజేపీ ఆందోళన.. కత్రినా కైఫ్ మీద ఈ విమర్శలేంటి? | Katrina Kaif Fanpage Closed Over CJP Issue | Sakshi
Sakshi News home page

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు?

Jul 22 2026 1:12 PM | Updated on Jul 22 2026 1:17 PM

Katrina Kaif Fanpage Closed Over CJP Issue

ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయమై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులే పోరాడుతుండగా తాజాగా ప్రతిపక్షాలు కూడా వీళ్లతో కలిసి చేరాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి బాలీవుడ్ నటీనటులు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, సోనూసూద్, సోనాక్షి సిన్హా తదితరులు తమ సంఘీభావం తెలిపారు. అయితే దీనికి ఏ మాత్రం సంబంధం లేని కత్రినా కైఫ్ మీద ఇప్పుడు పలువురు విమర్శలు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌తో కత్రినా.. సందీప్‌ రెడ్డి ఏం ప్లాన్‌ చేశాడు?)

కత్రినా కైఫ్ అభిమాని ఒకరు 'కేథలిక్ ఫ్యాన్స్' అని ఓ ఫ్యాన్ పేజీ రన్ చేస్తున్నాడు. దీనికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ పేజీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సదరు పేజీ అడ్మిన్ ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి కత్రినాకు అభిమానినని, అలాంటిది భారతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక అంశంపై ఆమె స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సదరు అడ్మిన్ వెల్లడించాడు.

మేము మీకు కష్టకాలంలో అండగా నిలిచాం. కానీ భారతీయుల కోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకు లేదు. అందుకే మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా. ఈ ఫ్యాన్‌పేజీని కూడా మూసివేస్తున్నా అని సదరు అడ్మిన్ పేర్కొన్నాడు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు సదరు పేజీ అడ్మిన్‌కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం కత్రినాకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే, స్పందించకపోయే హక్కు కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై సెలబ్రిటీలు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement