breaking news
CJP
-
రూ.8,452 కోట్ల పీఎంకేర్స్.. బడుల కోసం మళ్లించాలా?
కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ఫండ్ మరోసారి చర్చలోకి వచ్చింది. ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నట్లు తాజా ఆడిట్ వివరాలు వెల్లడించడంతో.. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలనే అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.యువత తనకు అండగా నిలిస్తేనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు అవసరమైన అవకాశాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దేశ భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగం, ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి పీఎంకేర్స్ నిధులను వినియోగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పీఎంకేర్స్ నిధులు ఎంత పెరిగాయి?.. 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి.తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎంకేర్స్ ఫండ్ నుంచి మొత్తం చెల్లింపులు కేవలం రూ.87.85 లక్షలుగా ఉన్నాయి. ఇందులో రూ.87.84 లక్షలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కోసం ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తం బ్యాంకు తదితర చిన్న ఖర్చులకు వెళ్లినట్లు వివరాలు వెల్లడించాయి.అంతకుముందు ఏడాది రూ.7,173 కోట్లుగా ఉన్న నిల్వ.. ఏడాదిలో దాదాపు 17.8 శాతం పెరిగింది. ఇందులో సుమారు రూ.7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే నిధులు పెరిగినప్పటికీ.. విరాళాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. 2024-25లో దేశీయ విరాళాలు రూ.479 కోట్లకు పడిపోయాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఫండ్‌కు ప్రధాన ఆదాయంగా మారింది.సీజేపీ డిమాండ్ ఏంటి?పీఎంకేర్స్‌లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నప్పటికీ.. దేశంలోని గ్రామీణ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు, తరగతి గదుల్లో బెంచీలు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ సీజేపీ ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ బడుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తూ.. పాఠశాలల పరిస్థితిని పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సీజేపీ చెబుతోంది.‘‘ఒకవైపు పాఠశాలలకు నిధుల కొరత ఉందని చెబుతున్నారు.. మరోవైపు రూ.8,500 కోట్లు పీఎంకేర్స్‌లో ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఈ డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు వినియోగించకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక మోడల్ హైటెక్ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని లెక్కిస్తే.. ఈ మొత్తంతో వెయ్యికి పైగా ఆధునిక పాఠశాలలు నిర్మించవచ్చని ఆయన చెప్పారు.పీఎంకేర్స్పై వచ్చిన ఆరోపణలు ఏంటి?పీఎంకేర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచే ఈ ఫండ్ పారదర్శకతపై ప్రతిపక్షాలు, కొన్ని పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై విమర్శలు వచ్చాయి:ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావడం లేదు?పీఎంకేర్స్ నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నప్పటికీ.. ఇది సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిధుల సేకరణ, ఖర్చుల వివరాలపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు వచ్చాయి.కాగ్ ఆడిట్ ఎందుకు లేదు?ప్రతిపక్షాలు పీఎంకేర్స్‌ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా స్వచ్ఛంద విరాళాలతో నడిచే ట్రస్ట్ కావడంతో కాగ్ పరిధిలోకి రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.నిధులు ఎందుకు ఎక్కువగా నిల్వ ఉన్నాయి?రూ.8,452 కోట్లలో ఎక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం ఏర్పాటైన ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తం వినియోగం లేకుండా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.‘‘అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఉండగా.. వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?’’ అనేది చాలా మంది అడిగేది. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. పీఎంకేర్స్ అనేది అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద విరాళాల ట్రస్ట్ అని, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉండాలని చెబుతోంది.ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి?పీఎంకేర్స్ ఒక స్వతంత్ర ట్రస్ట్ అని, దీనికి ఎలాంటి బడ్జెట్ నిధులు కేటాయించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఇది నడుస్తుందని పేర్కొంటున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వెంటిలేటర్ల కొనుగోలు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు నిధులను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే..సీజేపీ డిమాండ్‌కు ప్రజల్లో కొంత మద్దతు కనిపిస్తున్నప్పటికీ.. ఆచరణలో ఇది అంత సులభం కాదన్నది ప్రభుత్వ వర్గాల మాట. పీఎంకేర్స్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు అత్యవసర సహాయానికి సంబంధించినవి కావడంతో.. నిధులను విద్యా రంగానికి మళ్లించాలంటే ట్రస్ట్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో పాఠశాలల మౌలిక వసతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి భారీ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో వినియోగించాలనే డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.అసలు ప్రశ్న ఏంటి?పీఎంకేర్స్ విషయంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు.. విపత్తుల సమయంలో వెంటనే ఉపయోగించుకునేలా భారీ నిధి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రజల విరాళాలతో ఏర్పడిన వేల కోట్ల నిధులు మరింత పారదర్శకంగా ఉండాలని, అవసరమైన రంగాలకు ఉపయోగపడాలని విమర్శకులు కోరుతున్నారు.రూ.8,452 కోట్ల పీఎంకేర్స్ నిధి.. కేవలం ఓ ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. అత్యవసర నిధి లక్ష్యం, ప్రజా ప్రయోజనం, పారదర్శకత మధ్య సమతుల్యతపై జరుగుతున్న పెద్ద చర్చకు ఇది కేంద్ర బిందువుగా మారింది. -
డీఎస్సీ నియామకాలపై అనుమానాలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ పరీక్ష నిర్వహణపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి అంశాలపై రాష్ట్ర విద్యార్థులకు సంఘీభావంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అండగా ఉంటుందని ఆ పార్టీ సభ్యురాలు, ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తెలిపారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా రెండు నుంచి మూడు శాతం పెంచడం, పాత నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్లు తీసుకురావడంపై విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏదైనా పరీక్షల నిర్వహణపై విద్యార్థులు సందేహాలు, అనుమానాలను రేకెత్తించినప్పుడు స్వేచ్ఛగా న్యాయ విచారణ జరిపి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో నేహా బోరా మాట్లాడుతూ.. పరీక్షల్లో భారీగా కాపీ జరిగిందన్న అనుమానంతో అభ్యర్థులు సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర డీఎస్సీలో కొన్ని అక్రమాలు జరిగాయని.. ఈ అంశంపై పోరాటం చేస్తున్న విద్యార్థులకు తాము అండంగా ఉంటామని ఆమె స్పష్టంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్లో అధికార పార్టీ ప్రజల గురించి కాకుండా ప్రతిపక్ష పార్టీల గురించి ఎక్కువ ఆందోళన చెందుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హమీలను అమలుచేయాలని డిమాండ్ చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకోవడాన్ని నేటి యువత ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ఆమె స్పష్టంచేశారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పాలిగానీ గత ప్రభుత్వమంటూ తప్పించుకోలేరంటూ నేహా బోరా హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం ఉంటే ఇటువంటి ఆటలు ఆడటం ఆపేయాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికలే అవసరంలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ద్వారానే సమస్యలను పరిష్కరించనవసరంలేదని ప్రజా ఉద్యమాల ద్వారా కూడా వీటిని పరిష్కరించవచ్చని నేహా బోరా అభిప్రాయపడ్డారు. ఈ జెన్‌జీ ఉద్యమం ద్వారానే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించామని, అలాగే.. మూడు వ్యవసాయ చట్టాలు కూడా రైతుల పోరాటం ద్వారా ఉపసంహరించుకున్న విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా యువత, పౌరులు ఈ దేశాన్ని కొత్తగా తీర్చుదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం సీజేపీ జన ఉద్యమ సంస్థగానే ఉందని, రాబోయే కాలంలో తాను ఎన్నికల ప్రజాస్వామ్యంలోకి వెళ్లాల్సి వస్తే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
కాక్రోచ్ దెబ్బకు విజయ్ సర్కార్ యూటర్న్
-
సీజేపీ నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తి, డీజీపీ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరగనుంది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలపై సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ఆందోళనలో 240 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని అఫిడవిట్లో పేర్కొన్నారు. 5 వేల మంది భద్రత సిబ్బంది విధుల్లో ఉన్నారని వెల్లడించారు. నిరసనకారులపై అత్యంత నియంత్రణతో అవసరమైన బలగాలను మాత్రమే ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్లో ఢిల్లీ పోలీసులు చెప్పారు. NEET-UG CBSE పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు తెలిపారని అఫిడవిట్ లో పేర్కొన్నారు పోలీసులు.జూన్ 20న సాయంత్రం 5 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఖాళీ చేయలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. జులై 20న 'చలో సంసద్' మార్చ్ పిలుపుతో ఉద్రిక్తత పెరిగిందని, ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఒక ప్రభుత్వ భవనాన్ని ధ్వంసం చేసి అక్కడి ఇటుకలతో దాడి చేశారని అఫిడవిట్లో తెలిపారు. 30,000 మందికి పైగా నిరసనకారులు ఆందోళలో పాల్గొన్నారన్నారు. నిరసనకారులపై అధిక బల ప్రయోగం చేయలేదని, పార్లమెంట్ మార్చ్ చట్ట విరుద్ధమని తెలిపారు. -
ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన దాడిలో సీజేపీ కార్యకర్త అబ్దుల్ హఫీజ్ తండ్రి మృతి చెందడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రంగంలోకి దిగింది. హఫీజ్ కుటుంబాన్ని సీజేపీ సహ కన్వీనర్ ఆశుతోష్ రంకా నేతృత్వంలోని బృందం సోమవారం కరిసుంద గ్రామంలో పరామర్శించింది.హఫీజ్ సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్వాన పరిస్థితులను వీడియో తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని పార్టీ తెలిపింది. స్థానిక పాఠశాల పరిస్థితులను చిత్రీకరించిన సమయంలో కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారని, అనంతరం అతడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో తండ్రికి తీవ్ర గాయాలై మృతి చెందినట్లు కుటుంబం ఆరోపించింది.ఈ దాడి కావాలనే లక్ష్యంగా చేసుకుని, రాజకీయ ఉద్దేశంతో జరిగిందని సీజేపీ ఆరోపించింది. దాడికి ముందు హఫీజ్ ఇంటి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ మరోసారి దాడి జరిగిందని పార్టీ పేర్కొంది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని ఆరోపించింది.ఇప్పటివరకు 8 మంది అరెస్ట్ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కూడా తెలిపింది.పరిహారం వద్దు.. తండ్రి పేరుతో పాఠశాల కావాలిహఫీజ్ కుటుంబం ఆర్థిక పరిహారం కోరడం లేదని సీజేపీ తెలిపింది. తన తండ్రికి న్యాయం జరగడంతో పాటు, ఆయన పేరుతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని హఫీజ్ కోరుతున్నట్లు పేర్కొంది.సీజేపీ 4 డిమాండ్లునిందితులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.పోలీసులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి.హఫీజ్, అతడి కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలి.మృతి చెందిన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి.ఈ డిమాండ్లపై చర్యలు తీసుకునేందుకు సీజేపీ ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇచ్చింది. ఈలోపు స్పష్టమైన చర్యలు లేకపోతే మద్దతుదారులను సమీకరించి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించింది.Imagine the mindset of Abdul who does not want compensation for his father’s brutal murder. Instead he wants the government to build a world class school in his father’s name.Abdul's grandmother said that his struggle is now our collective responsibility. We will not be… pic.twitter.com/loz8frxruG— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 17, 2026After extensive discussions with Abdul's family, CJP demands four things from the West Bengal government. Fulfill these demands within 10 days. If demands are not met, we will enforce a peaceful gherao of the Bankura DM Office in West Bengal.1. File an FIR against all… pic.twitter.com/nmY09TuWUK— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 17, 2026“I don’t need monetary compensation but a good school for poor children as a tribute to my father.”I will never forget these words from Abdul. I don’t think I have ever met someone who loves India as much as Abdul. Abdul lost his father now the country needs stand with him. pic.twitter.com/naia09iwji— Abhijeet Dipke (@abhijeet_dipke) August 17, 2026 -
సీజేపీ రెండో దశ ఉద్యమంలో మరో భారీ ఎదురుదెబ్బ
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బయటి వ్యక్తుల ప్రవేశాన్ని కంట్రోల్ చేసింది. ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్‌ను నిషేధిస్తూ కొత్త మార్గదర్శకాలు అమలు చేసింది. విద్యార్థుల గోప్యత, గౌరవం, భద్రతను కాపాడటమే ఈ ఆదేశాల ఉద్దేశమని సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ తెలిపింది. ఈ సర్క్యులర్ 2026 ఆగస్టు 17న విడుదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల సౌకర్యాలను పరిశీలించే “స్కూల్ ఠీక్ కరో” ప్రచారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా ఎలాంటి బయటి వ్యక్తి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించరాదని, ఏ రకమైన మీడియా రికార్డింగ్కైనా లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.ఈ ఆంక్షలు విద్యార్థులు ఉపయోగించే తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. అనుమతి లభించినా బయటి వ్యక్తులు అధికారిక సిబ్బంది పర్యవేక్షణలోనే ఉండాలి. విద్యార్థుల చిత్రాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వారి గోప్యత, భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రచురించడం లేదా వ్యాప్తి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు నిరోధించాలని ఆదేశాలు పేర్కొన్నాయి.ప్రభుత్వం “ఇన్ లోకో పేరెంటిస్” సూత్రాన్ని ప్రస్తావించింది. పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే బాధ్యత తమపై ఉందని తెలిపింది. ఇన్ లోకో పేరెంటిస్ అంటే తల్లిదండ్రుల స్థానంలో పిల్లల శ్రేయస్సును కాపాడే బాధ్యతను సూచించే న్యాయ సూత్రం.సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయ్.. ఈ ఆదేశాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పులు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) మార్గదర్శకాలు న్యాయ ఆధారాలుగా ఉన్నాయని ఉత్తర్వు పేర్కొంది. “ప్రధానోపాధ్యాయుడు లేదా సంస్థ అధిపతి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బయటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించరాదు. పాఠశాల ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, ఆడియో రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్కు ప్రధానోపాధ్యాయుడి ముందస్తు లిఖితపూర్వక అనుమతి అవసరం” అని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ఇది పారదర్శకతను, ప్రజా పర్యవేక్షణను పరిమితం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయడానికి బదులు వాటిని దాచిపెట్టే ప్రయత్నమే ఈ ఆంక్షలని అన్నారు. పాఠశాలల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటే ఆధారాల నమోదు లేదా ప్రజా పరిశీలనకు భయపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.అనుమతి లేకుండా ప్రవేశించడం లేదా మీడియా కార్యకలాపాలు నిర్వహించడం జరిగితే భారతీయ న్యాయ సంహిత, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, సమాచార సాంకేతిక చట్టం కింద న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని మార్గదర్శకాలు హెచ్చరించాయి.అధికారిక హోదాలో పాఠశాలలను సందర్శించే ప్రభుత్వ అధికారులకు ఈ ఆంక్షలు వర్తించవని, మిగతా సందర్శకులంతా కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించాలని విశ్లేషణలు పేర్కొన్నాయి. “ఎవరైనా అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించినా, బయటకు వెళ్లేందుకు నిరాకరించినా, అనుమతి లేని ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించినా, పాఠశాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించినా ప్రధానోపాధ్యాయుడు వెంటనే స్థానిక పోలీసులకు, జిల్లా విద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని సర్క్యులర్ పేర్కొంది.సందర్శకుల నమోదు పుస్తకాన్ని నిర్వహించాలని, అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించేందుకు లేదా నిషేధిత కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ సూత్రాలకు భంగం కలిగించే చర్యలు జరగకుండా చూడాలని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ ఆంక్షలపై స్పందించిన సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. పాఠశాలలను పరిశీలించి మెరుగుపరిచే ప్రచారం కొత్త పరిమితులు ఉన్నా కొనసాగుతుందని చెప్పారు. విద్యా రంగంలో ప్రజా పరిశీలన, పారదర్శకతను అణచివేసే ప్రయత్నమే రాజస్థాన్ చర్య అని ప్రభుత్వాన్ని విమర్శించారు. -
24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అకౌంట్‌కు 62 పోస్ట్‌లను పోస్ట్ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్‌ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.🇮🇳 DIMAAGI NAXAL JANTA PARTY — DJP 🇮🇳🚨🚨 01. NATION RE-BUILDING • ECONOMIC CONSTRUCTION🏗️ BUILD THE NATION. REBUILD THE ECONOMY.🇮🇳 $10 TRILLION ECONOMY BY 2035📈 Required nominal growth: ~10.5% CAGR⚙️ ECONOMIC RECONSTRUCTION🏭 Manufacturing: ~17% → 25% of GDP📈… pic.twitter.com/36APNRh3ua— Dimaagi Naxal Janta Party 🧠 (@DJPforINDIA) August 16, 2026 అయితే, ఈ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్‌ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.కిరణ్ రిజుజు వివరణఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సోషల్ మీడియాలో జెన్‌జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే. -
రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్ షాక్.. ఒకరి మృతి
న్యూఢిల్లీ: ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం చేపట్టిన రెండో రోజే సీజేపీకి భారీ షాక్ తగిలింది. పాఠశాల సమస్యలను అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న సీజేపీ మద్దతుదారుడి తండ్రిని కొందరు కొట్టి చంపారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు చెందిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుడి తండ్రి ఆగస్టు 15న మృతి చెందారు. సీజీపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా తన చిన్నతనంలో చదువుకున్న పాఠశాల పరిస్థితులను అతడి కుమారుడు వీడియో తీసినందుకు ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఇంట్లోనే ఆయనపై దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులు ఆదివారం జాతీయ మీడియాకు తెలిపారు.మృతుడి కుమారుడి పేరు అబ్దుల్ హఫీజ్. దాడికి బీజేపీ కార్యకర్తలే కారణమని ఆరోపించిన అబ్దుల్ హఫీజ్.. దాడిలో గాయపడిన తన తండ్రి బంకురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. “ఈ బీజేపీ స్థానిక నేతలు దారుణంగా దాడి చేసిన తర్వాత నా తండ్రి శనివారం మృతి చెందారు” అని హఫీజ్ చెప్పారు.బంకురా ఎస్పీ వీజీ సతీష్ పసుమర్తి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. “హఫీజ్ తల్లి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.ఇదిలా ఉండగా, తమ కార్యకర్తలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తేలి, వారిపై పేర్లతో పోలీసులకు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.“అయితే, టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి సామాజిక తనిఖీ చేసే ధైర్యం చేశారా? కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీని చెడుగా చూపించేందుకు టీఎంసీ, వామపక్షాలు చేస్తున్న పద్ధతి ఇది మాత్రమే” అని బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి కేయా ఘోష్ చెప్పారు.జంతర్ మంతర్‌లో జరిగిన సీజీపీ నిరసనల్లో కూడా పాల్గొన్న హఫీజ్.. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సామాజిక తనిఖీలో భాగస్వామి కావాలని అనుకున్నట్లు తెలిపారు. తాను చదువుకున్న కరిసుంద ప్రాథమిక విద్యాలయానికి వెళ్లి కొన్ని వీడియోలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు.రాత్రి 8 గంటల సమయానికి కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి చుట్టుముట్టారని, తనపై కూడా దాడి చేయడంతో పాటు వృద్ధుడైన తన తండ్రిని కొట్టారని హఫీజ్ తెలిపారు. తన ఫోన్‌ను లాక్కుని, పాఠశాలకు సంబంధించిన వీడియోలు, జంతర్ మంతర్‌లో తాను తీసిన వీడియోలను తొలగించాలని బలవంతం చేశారని చెప్పారు.నా రక్తం మరిగిపోతోంది: దీప్కేఅబ్దుల్కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అబ్దుల్‌కు మద్దతు తెలిపారు. అతడి తండ్రి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై మాట్లాడిన తర్వాత అబ్దుల్ ఆ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారని దీప్కే ఎక్స్‌లో చేసిన పోస్టులో తెలిపారు. అబ్దుల్, ఆయన కుటుంబంపై బీజేపీతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దాడి చేసిన తర్వాత ఆయన తండ్రి హత్యకు గురయ్యారని దీప్కే ఆరోపించారు.“మెరుగైన పాఠశాలలు కావాలని డిమాండ్ చేసినందుకు ప్రజలను హత్య చేస్తున్నారంటే నా రక్తం మరిగిపోతోంది” అని దీప్కే పోస్టులో పేర్కొన్నారు. సీజీపీ బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అబ్దుల్, ఆయన కుటుంబంతో కలిసి న్యాయం కోసం పోరాడుతుందని దీప్కే తెలిపారు. బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు ఎదురైనా.. మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్న ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని దీప్కే ప్రారంభించిన తర్వాత ఆయన ఈ పోస్టు చేశారు. -
మరో ఉద్యమం ప్రారంభించిన దీప్కే.. ఇక వీళ్ల పని ఏమైపోతుందో
హింగోలి (మహారాష్ట్ర): కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని ఆయన ఆరోపించారు. పగిలిన కిటికీలు, పూడుకుపోయిన మరుగుదొడ్లు, కూర్చునేందుకు సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.తన గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన తర్వాత దీప్కే ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఎక్స్‌లో దీప్కే స్పందిస్తూ.. “స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలు లేవు. నేను మా గ్రామ సర్పంచ్‌తో మాట్లాడాను. వారంలోపు ఈ సమస్యలన్నింటినీ పంచాయతీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మనమంతా కలిసి చర్యలు తీసుకుంటే మార్పు సాధ్యమే’’ అని చెప్పారు.మరో పోస్టులో పగిలిన కిటికీల వీడియోను పోస్ట్ చేసిన దీప్కే.. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో ప్రభుత్వ పాఠశాలలోని పగిలిన కిటికీలను కప్పేస్తున్నారు” అని ఆరోపించారు. పాఠశాలలో పూడుకుపోయిన మరుగుదొడ్లను చూపించే మరో వీడియోను కూడా దీప్కే పంచుకున్నారు. “ఈ మరుగుదొడ్డిని ఏ పిల్లాడు ఎలా ఉపయోగించాలి?” అని రాశారు.పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా లేదని, పలు కిటికీలు పగిలిపోయాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని దీప్కే ఆరోపించారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 4 బెంచీలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో తదుపరి దశలో మహారాష్ట్రలోని ఇతర తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తానని దీప్కే తెలిపారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు.ఈ ప్రచార ప్రారంభానికి ముందు ఈ వారం ప్రారంభంలో జంతర్ మంతర్ ‘సీజన్ 2’ను సీజేపీ ప్రారంభించబోతోందని దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఇతర కీలక డిమాండ్లపై హామీలు రావడంతో 37 రోజుల పాటు సాగిన జంతర్ మంతర్ నిరసనను జూలై 25న విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా.. పాఠశాలల దుస్థితికి కారణమైన వారి తక్కురేగ్గొట్టనుంది సీజేపీ. స్వాతంత్య్ర దినోత్సవం వేళ సీజేపీకి షాక్కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను శనివారం ఉదయం తొలగించారు. అయితే ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ తమ గొంతును అణచివేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ చర్య అని సీజేపీ ఆరోపించింది.ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనకు నాయకత్వం వహించిన సీజేపీ.. తమ ఖాతాను విజయవంతంగా తిరిగి పొందినట్లు తెలిపింది. “సీజేపీని వ్యతిరేకించే వారు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకుని మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం ఎంత అవమానకరం. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేము భయపడము” అని ఆ పార్టీ ఒక పోస్టులో పేర్కొంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఖాతా తొలగింపుపై స్పందించారు. “కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు. పిరికిపందలు” అని అన్నారు. ఆ తర్వాత అదే రోజు ఖాతాను పునరుద్ధరించినట్లు సీజేపీ తెలిపింది.ఇటీవల సీజేపీ చేపడుతున్న వరుస ప్రచారాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ పాఠశాలల పరిస్థితిపై అవగాహన కల్పించడం, విద్యార్థులు, విద్యకు సంబంధించిన సమస్యలపై నిరసనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి.స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు యువతకు సంబంధించిన సమస్యలను జాతీయ స్థాయి చర్చలోకి తీసుకురావాలని సీజేపీ ప్రయత్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దేశ యువతను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతూ సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. నిరుద్యోగం, విద్య, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తింది.ఇటీవలి నెలల్లో సీజేపీ విద్య, పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఇతర సమస్యలపై నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో దీప్కేకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. How is any kid supposed to use this toilet? #SchoolThikKaro pic.twitter.com/WNkDAFn5sn— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026Broken windows in govt school being covered with the banners of Dy CM of Maharashtra. #SchoolThikKaro pic.twitter.com/XgXIcvbbnC— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026Even after 80 years of Independence, our govt schools still lack basic amenities.I spoke to the Sarpanch of my village, who has assured that the Panchayat will resolve all these issues within a week.Change is possible when we come together and act.#SchoolThikKaro pic.twitter.com/HB4cWKj4D8— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026 -
సీజేపీకి బార్ కౌన్సిల్ చైర్మన్ చురక!
నల్సర్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.వివాదానికి కారణం ఇదేహైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందనబీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.సీజేపీ మాత్రం విజయంగా..బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్‌గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.సుప్రీం నోటీసులుఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది. మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. -
జంతర్ మంతర్ సీజన్ -2 లోడింగ్...!
-
జంతర్ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద 36 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి నెల కూడా పూర్తికాకముందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 'సీజన్-2' త్వరలో మొదలవుతుందని ప్రకటించారు. సీజన్-2లో ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అది ఎలా ముందుకు వెళ్లనుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి సీజేపీ ముందుకు వస్తోంది.సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. సీజన్-2లో అసలు ఏం జరగబోతోందో వివరించారు. ఈసారి పార్టీ దృష్టి దేశంలోని పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడంపై ఉంటుందని చెప్పారు. పాఠశాలల విషయంలో తమ మాట ప్రభుత్వం వినకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని చెప్పారు. 'స్కూల్ ఠీక్ కరో అభియాన్' ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని అన్నారు. పాఠశాలలు బాగుపడాల్సిందే.. సీజేపీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించబోతుందని ఆశుతోష్ ప్రకటించారు. ‘‘మా పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉండనివ్వం. ఇదే జంతర్‌మంతర్ సీజన్-2. ఈ ప్రచారానికి దేశ ప్రజలే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. గ్రామాల్లో ఉన్న పిల్లలను విద్యకు దూరంగా ఉంచారు. గత కొన్ని సంవత్సరాల్లో దేశంలో 94 వేల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలను బలహీనంగా ఉంచాలనే ప్రభుత్వ ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది" అన్నారు.ప్రచార సమయంలో ఏం చేస్తారో కూడా రాంకా వివరించారు. "దేశవ్యాప్తంగా సర్పంచ్‌లను తమ పాఠశాలలను మెరుగుపరచాలని కోరుతాం. రాబోయే నెలల్లో మా బృందం దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలను సందర్శిస్తుంది. ఈ పాఠశాలలను మెరుగుపరచాలని కలిసి డిమాండ్ చేస్తాం. సర్పంచ్‌లకు పూర్తిగా మద్దతు ఇస్తాం" అన్నారు.పాఠశాలలను మెరుగుపరచని చోట తమ పార్టీ నిరసనలు కూడా చేపడుతుందని చెప్పారు. సీజేపీ బృందాలు వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలను సందర్శించనున్నాయి. పాఠశాలలు మెరుగుపడని ప్రాంతాల్లో నిరసనలు చేపడతాయి. నీట్ ఉద్యమం ముగిసినా తమ పోరాటం ముగియలేదని, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇతర సమస్యలపై దృష్టి పెడతామని సీజేపీ చెబుతోంది. -
జంతర్ మంతర్ సీజన్-2 వచ్చేస్తోంది: దీప్కే సంచలనం
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పార్టీ నిరసన కార్యక్రమాల్లో మరో దశకు చేరుకుంటుందన్న సంకేతాలు ఇచ్చారు. తమ ‘జంతర్ మంతర్’ ఉద్యమం ‘సీజన్ 2’ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.“ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ‘జంతర్ మంతర్’ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని కామెంట్లు చేస్తున్నారు. వారికి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ‘జంతర్ మంతర్’ సీజన్ 2 చాలా త్వరలో మొదలుకానుంది” అని దిప్కే చెప్పారు.తదుపరి దశ నిరసనలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో, ఏ డిమాండ్లపై దృష్టి పెడతాయన్న వివరాలను దీప్కే వెల్లడించలేదు. అయితే, జంతర్ మంతర్ వద్ద గతంలో చేపట్టిన ఉద్యమం తర్వాత ఇప్పుడు మరోసారి నిరసనల వేదికపైకి రావడానికి సీజేపీ సిద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలకు సరైన రహదారి కావాలని డిమాండ్ చేస్తూ హమీర్పూర్ జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన పాఠశాల విద్యార్థుల నిరసనకు కూడా దీప్కే మద్దతు ప్రకటించారు. దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి దుస్థితిని విద్యార్థులు ప్రస్తావించారు. విద్యార్థులను దిప్కే ప్రశంసించారు. ప్రాథమిక రవాణా సౌకర్యం కోసం వారు చేస్తున్న డిమాండ్ దశాబ్దాల క్రితమే నెరవేరాల్సిందని అన్నారు.అందుకే దేశవ్యాప్తంగా నిరసనలుసీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. దిప్కే చేసిన “జంతర్ మంతర్ సీజన్ 2” వ్యాఖ్య కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో నిరసనకే పరిమితం కాదన్నారు. ఇదే సీజన్ 2. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాలు, అధికారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినేందుకు సీజేపీ తరఫున ఇప్పుడు దేశవ్యాప్త ‘లిజనింగ్ టూర్’ ప్రారంభిస్తున్నాం. ఒక ప్రచార కార్యక్రమం చేపడతాం. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి విద్యా అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ఆయన అన్నారు. -
అందుకే నేను ఝార్ఖండ్ ఆందోళనలకు వెళ్లట్లేదు: దీప్కే
న్యూఢిల్లీ: సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేపర్ లీకులకు వ్యతిరేకంగా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, ఝార్ఖండ్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమంలో మాత్రం పాల్గొనడం లేదు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించింది. ‘‘మీరు ఇప్పుడు ఝార్ఖండ్‌కు ఎందుకు వెళ్లడం లేదు?’’ అన్న ప్రశ్నకు దీప్కే స్పందిస్తూ.. ‘‘ఎందుకు సర్? నా బృందం ఇప్పటికే వెళ్లింది’’ అని సమాధానమిచ్చారు.‘‘కానీ మీరు ఎప్పుడు వెళ్తారు? మీరే ఎందుకు వెళ్లడం లేదు?’’ అని మీడియా మళ్లీ ప్రశ్నించింది. దీప్కే స్పందిస్తూ.. ‘‘దృష్టి అంతా దేవేంద్ర మహతోపైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయనే నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు. నా గురించి నేను ప్రచారం చేసుకోవాలని అనుకోవడం లేదు’’ అని తెలిపారు.కాగా, రాంచీ ఉద్యమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనల మధ్య దీప్కే ఇటీవల విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాహ్తోతో వీడియో కాల్లో మాట్లాడారు. రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని దీప్కే తెలిపారు. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా, భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కానన్లు వినియోగించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర మాహ్తో కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయనను రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు. -
కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్(మీమ్స్)గా మారుతున్నాయా?
కోర్టు వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా? వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారా?.. ఈ అంశాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం, సీబీఐ సహా పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది.డిజిటల్-రాజకీయ సంస్థగా పేర్కొంటున్న సీజేపీ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌద్రి ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను(Oral Comments) సందర్భం నుంచి వేరు చేసి వైరల్ చేయడం, వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడాన్ని పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా?న్యాయ విచారణల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే సంభాషణలను కొన్ని భాగాలుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో న్యాయ ప్రక్రియ అసలు ఉద్దేశం పక్కదారి పడుతోందని తెలిపారు. “కోర్టు వ్యాఖ్యలను మీమ్స్, వైరల్ వీడియోలు, ఆన్లైన్ ప్రచారాలుగా మార్చి సందర్భం లేకుండా చూపిస్తున్నారు” అని పిటిషన్లో పేర్కొన్నారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంనకిలీ న్యాయ డిగ్రీల అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసినట్లు ప్రచారమైన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం సీజేఐ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా ‘కాక్రోచ్ జంతా పార్టీ’ పేరుతో ఓ ఆన్లైన్ వేదిక ఏర్పడటం, అది రాజకీయ-డిజిటల్ ఉద్యమంగా మారడంపై పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదన్న పిటిషనర్తమ పిటిషన్ ప్రజాస్వామ్య విమర్శలు, వ్యంగ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని రాజా చౌదరి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ సంస్థలపై జరిగే వ్యాఖ్యలను వాణిజ్య ప్రయోజనాల కోసం వక్రీకరించడం సమస్యగా పేర్కొన్నారు.నీట్ వివాదం నేపథ్యంలో CJP చర్చనీట్ యూజీ పేపర్ లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల నేపథ్యంలో ఈ సంస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులతో సీజేపీ కార్యకలాపాలు, కోర్టు వ్యాఖ్యల వినియోగంపై తదుపరి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం, సీబీఐ సమాధానాల అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
సీజేపీ జాతీయ కార్యవర్గం ఇదే.. తెలుగు వ్యక్తికి చోటు
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను కూడా ఇవాళే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని తెలిపారు. సీజేపీ ఇకపై నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలపనుంది.సీజేపీ జాతీయ కార్యవర్గంజాతీయ కన్వీనర్- అభిజీత్ దీప్కేకో-కన్వీనర్లు - అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ - అజింక్యా షిండేఆర్గనైజేషన్ కో ఇన్చార్జ్- దీపక్ బలియన్జాతీయ కార్యదర్శి- ఆఫ్రీన్ నవాజ్సీజేపీ మీడియా లీడ్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి )న్యాయ వ్యవహారాల ఇన్చార్జ్ - రత్న సింగ్రీసెర్చ్ & పాలసీ లీడ్ - వైష్ణవి గౌర్టెక్నాలజీ లీడ్- రోహన్ దేశ్పాండేఫైనాన్స్ లీడ్ -యోగేష్ ఇంగాలేజోనల్ లీడర్‌షిప్‌గా..నార్త్ జోన్- దీపక్ బలియన్దక్షిణ జోన్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి)తూర్పు & ఈశాన్య జోన్లు- అంకిత్ భరద్వాజ్పశ్చిమ జోన్- యోగేష్ ఇంగలేరాబోయే ఆరు నెలల్లో, సీజేపీ భారతదేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్‌సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. -
కాక్రోచ్ పార్టీ మరో సంచలనం అభిజీత్ దీప్కే కామెంట్స్ వైరల్
-
సీజేపీ మరో సంచలనం.. దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తామన్న దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలుపుతామని చెప్పారు.రెండు రోజుల పార్టీ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. గత నెల న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని జెన్ జీ ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచారని, ఆ ఉద్యమం ఫలితంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారకుండానే సీజేపీ కొనసాగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా యువత ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని దీప్కే తెలిపారు. “రెండు రోజుల చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్‌లో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమం పేరు ‘క్యా బోల్తీ పబ్లిక్’” అని దిప్కే చెప్పారు.“ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. భారత యువ జనాభాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన దీప్కే.. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని, అయినా వారి సమస్యలకు ప్రధాన రాజకీయ చర్చల్లో చోటు దక్కలేదని అన్నారు.“భారత జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. అయినా ఈ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ అంశాలపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తాం. వారి అంచనాలను తెలుసుకుంటాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటాం” అని చెప్పారు.విద్యా సంస్కరణలపై సీజేపీ పోరాటంవిద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విద్యా సంస్కరణలను సీజేపీ ముందుకు తీసుకెళ్తుందని దీప్కే చెప్పారు. “విద్య ఖర్చు గణనీయంగా పెరిగింది. విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాలు భారీ విద్యా వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. మన దేశంలో ఉద్యోగాలు దాదాపు లేవు. జంతర్ మంతర్‌కు వచ్చిన వారిలో చాలామంది నిరుద్యోగులే. బలవంతం వల్ల స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా లేదా డెలివరీ బాయ్‌గా మారాలని ఎవరి కలా, ఆశయమూ ఉండదు” అని చెప్పారు.డిగ్రీలు సంపాదించినా పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉన్నారని దిప్కే అన్నారు. “డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా దేశ యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. చదువు పూర్తి చేయని వారు లేదా డిగ్రీలు లేని వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. చదువుకున్న యువత భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.“ఇప్పుడు నిరుద్యోగాన్ని జాతీయ అంశంగా మార్చాలనుకుంటున్నాను. ప్రభుత్వంగా మీరు నిరుద్యోగ సంక్షోభాన్ని ఇక నిర్లక్ష్యం చేయలేరు” అని ఆయన తెలిపారు. పార్టీ సైద్ధాంతిక వైఖరిని మరోసారి స్పష్టం చేసిన దిప్కే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదర్శాలే సీజేపీకి మార్గదర్శకాలని చెప్పారు.“మా సిద్ధాంతం భారత రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుంది. మేము లౌకికవాదులం. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం దిశగా పని చేస్తూనే ఉంటాం” అని అన్నారు.“మహాత్మా గాంధీ శాంతి, అహింస సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయ దృక్పథం, జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత స్వప్నం మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని చెప్పారు. ఇటీవలి రాజకీయ మార్పులకు విద్యార్థులే కారణమని దిప్కే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలకు ముందు దేశం చాలా ఏళ్ల పాటు అణచివేత, నిరంకుశ పాలనను చూసిందని ఆరోపించారు. -
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికCJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్‌చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)యువత ఉద్యమానికి కొత్త దిశ?సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీఐ యాక్టివిస్ట్‌కు ‘అభిజిత్ దీప్కే’ దిమ్మతిరిగే కౌంటర్!
సాక్షి,న్యూఢిల్లీ: తన అమెరికా చదువులకు అయ్యే ఖర్చు వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే స్పందించారు. ఆర్టీఐ యాక్టివిస్ట్‌కు కౌంటర్ ఇచ్చారు. లెక్కల్లో చూపని కుటుంబ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నారనే ఆరోపణల్ని సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ దీప్కే ఖండించారు.‘బోస్టన్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. నా చదువుకు అయ్యే ఖర్చును యూనివర్సిటీ స్కాలర్ షిప్లో అందించగా మిగిలిన మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకున్నాను. ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నానని’ తెలిపారు. ఈ సందర్భంగా బోస్టన్ యూనివర్సిటీ తనకు అందించిన స్కాలర్ షిప్ సంబంధిత వివరాల్ని ఆయన బహిర్ఘతం చేశారు.అభిజిత్ దీప్కే ఇటీవల దేశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో నీట్ పేపర్ లీకేజీపై ఉద్యమం చేశారు. ఫలితంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే సూరత్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆయనపై ఫిర్యాదు చేశారు. అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ రావ్ దీప్కే మహరాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) ఒక సాధారణ రిటైర్డ్ జూనియర్ ఇంజినీర్. అభిజిత్ తండ్రి నెలకు రూ.60వేల నుంచి రూ.65వేలు ఖర్చు చేసి కొడుకును అమెరికా చదివించడానికి అంత భారీగా నిధులు ఎక్కడి నుంచి తెచ్చారంటూ ఆయన ఆస్తులపై దర్యాప్తు కోరారు.ఇక బార్కాదత్ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సీజేపీ తన కార్యకలాపాలకు నిధులు ఎలా సమకూర్చుకోవాలని యోచిస్తోందనే ప్రశ్నలకు కూడా దీప్కే సమాధానమిచ్చారు. ఇకపై సీజేపీ క్రౌడ్‌ఫండింగ్ చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజల నుండి విరాళాలు సేకరిస్తాం. ఆ విషయంలో మేము పారదర్శకంగా ఉంటాము’ అని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఉద్యమానికి సాధారణ పౌరులే మాకు మద్దతిచ్చారు. నిరసనల్లో పాల్గొన్న వారే స్వచ్ఛదంగా ఆహారం, మంచినీరు ఇలా వారికి కావాల్సినవి వారే తెచ్చుకున్నారు. ఇతరులకు కూడా పంచి పెట్టారు. ఈ ఉద్యమానికి కొంతమంది ఢిల్లీ పోలీసు సిబ్బంది రహస్యంగా మద్దతు తెలిపారు. ఢిల్లీ పోలీసుల పిల్లలు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. తమ పిల్లల తరుఫున పోలీసులే.. మాకు కావాల్సిన ఆహార పదార్ధాల్ని ఉచితంగా అందించారు. వారి వివరాల్ని బహిర్ఘతం చేయొద్దని మమ్మల్ని కోరారు. నీట్ ఆందోళనపై సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ ఆహార పదార్ధాల్ని ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో అరెస్టయిన నిరసనకారుల కోసం కపిల్ సిబల్ రూ. 1 కోటి న్యాయ సహాయ నిధిని ప్రకటించారు. ఆ తర్వాతే సీజేపీ ఆర్థిక వ్యవహారాలపై పరిశీలన పెరిగింది. ఆ ఆర్టీఐ కార్యకర్త సీజేపీ చట్టపరమైన హోదాపై భారత ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించి, సిబల్ సహాయాన్ని పరిశీలించాలని కోరారు.దీప్కేతో పాటు, సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి గౌర్ కూడా ఆ ఆర్టీఐ కార్యకర్తపై కౌంటర్ ఇచ్చారు. అతను ఓ ప్రైవేట్ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి విద్యా ఖర్చుల కోసం ఆర్టీఐలు దాఖలు చేసేవారు పీఎం కేర్స్ ఫండ్‌ను కూడా చూడాలి. మోదీజీ మిమ్మల్ని క్షమిస్తారు. చింతించకండి అని గౌర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థ నిధులు, చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తీవ్రతరం కావడంతో, సీజేపీ ఆ ఫిర్యాదులను రాజకీయ కుట్రలో భాగంగా కొట్టిపారేసింది. -
అభిజిత్ కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై ఆరా
-
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్‌గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్‌కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు. -
ఈసారి ‘ఆల్ఫా’ వంతు!
జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు. -
అమిత్ షా రాజీనామా చేయాలి: ‘సీజేపీ’ అభిజీత్ దిప్కే
న్యూఢిల్లీ: పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే జరిగిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలని గురువారం డిమాండ్ చేశారు.మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో విలేకరులతో దీప్కే మాట్లాడుతూ.. “నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడి, రక్తం కారేలా చేయడం అమిత్ షా ఆదేశాలు లేకుండా జరిగి ఉండదు” అని అన్నారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నిరసనకారులపై తీసుకున్న చర్యలకు షానే బాధ్యుడని ఆరోపిస్తూ ఆయన రాజీనామా కోరిన నేపథ్యంలో దీప్కే సైతం ఇదే డిమాండ్ చేశారు. తాను కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాన్నే సమర్థిస్తున్నానని చెప్పారు. “ఆయన (షా) రాజీనామా చేయాలని నేను కూడా భావిస్తున్నాను” అని అన్నారు.సీజేపీ విదేశీ నిధులు పొందుతోందన్న ఆరోపణలను దీప్కే కొట్టిపారేశారు. “హోంశాఖ బాధ్యతలు షా వద్ద ఉన్న సమయంలోనే మాకు విదేశీ నిధులు వస్తున్నాయంటే అది కూడా ఆయన వైఫల్యమే. అప్పుడు మీరు ఎలాంటి చాణక్యులు? అలాంటప్పుడు షా కూడా రాజీనామా చేయాలి” అని చురకలు అంటించారు.బీజేపీలో చేరాలని ఒత్తిడి నిరసనకారులపై చర్యలు తీసుకోవడానికి కారణం చూపించేందుకే ఢిల్లీ పోలీసులు రాళ్లదాడిని సృష్టించారని దిప్కే ఆరోపించారు. “రాళ్లదాడికి ఢిల్లీ పోలీసులు ప్రణాళిక వేశారు. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరారు. దానికి విద్యార్థులనే బాధ్యుల్ని చేశారు” అని ఆయన అన్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని దిప్కే ఆరోపించారు. “నన్ను బెదిరించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు నా తల్లిదండ్రులను కూడా బెదిరించారు. పార్టీలో చేరండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి అని చెప్పారు” అని అన్నారు.ఆరోపణలను ఖండించిన బీజేపీదిప్కేపై బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మార్గంలో నడవాలనుకుంటే దీప్కే కాంగ్రెస్‌లో చేరాలని అన్నారు. “అతను ఒక నిరసన ఉద్యమానికి ముఖచిత్రం. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు తీసుకురావడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం ద్వారా అతని డిమాండ్లను అంగీకరించింది బీజేపీ ప్రభుత్వమే. దాన్ని గౌరవించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే కాంగ్రెస్‌లో చేరాలి” అని అన్నారు. -
వీళ్లు జెన్ జీ కాదు.. జెన్ ఆల్ఫా.. 1,500 మంది ధర్నా
లక్నో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆధ్వర్యంలోని జెన్ జీ (1997 - 2012 మధ్య పుట్టినవారు) నిరసన ప్రభావం జెన్ ఆల్ఫా(2013 - 2025 మధ్య పుట్టినవారు)పై కూడా పడింది. ఉత్తరప్రదేశ్‌లో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.ఫతేపూర్ జిల్లాలోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ధర్నా చేపట్టారు. దీంతో యాజమాన్యం వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. ఈ నిరసనను సామాజిక మాధ్యమాల్లో “జెన్ ఆల్ఫా నిరసన”గా చర్చించినప్పటికీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొని తిరిగి వచ్చిన కొందరు సీనియర్ విద్యార్థులు దీన్ని ప్రణాళిక చేశారని పాఠశాల అధికారులు అంటున్నారు.నీట్ ప్రశ్నపత్ర లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థులు నలుగురు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. అక్కడి అనుభవంతో ప్రేరణ పొందిన వారు తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తరగతి గదుల మౌలిక సదుపాయాల లోపం, క్రీడా సదుపాయాల కొరత వంటి దీర్ఘకాల సమస్యలపై తమ పాఠశాలలో ఇదే తరహా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. “నేను పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా ధర్నా చేపట్టారని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ సమయంలో ఆందోళనకు నాయకత్వం వహించిన అంకూర్ సోన్కర్ ఇటీవల జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విషయం నాకు తెలియదు. తర్వాత అతడు అక్కడ ఉన్న వీడియోలు చూశాను. చిన్న పిల్లలు ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని చెప్పాం. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. అయినా వారిని ఒప్పించడానికి 6 గంటలు పట్టింది” అని ఆయన చెప్పారు.అంకూర్ మాట్లాడుతూ.. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనపై గాఢ ప్రభావం చూపారని తెలిపారు. జంతర్ మంతర్ నిరసన సమయంలో రికార్డు చేసిన వీడియోల్లో “సోనమ్ సర్‌కు మద్దతు ఇవ్వండి. మంచి వ్యక్తులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాం? మీ హక్కుల కోసం పోరాడండి” అని యువతకు పిలుపునిచ్చారు.అంకూర్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు ఆర్వో వ్యవస్థతో స్వచ్ఛమైన తాగునీరు, కొత్త మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు, మెరుగైన క్రీడా సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోరారు. నిరసన అనంతరం యాజమాన్యం డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళన విరమించారు.6 గంటల ధర్నా, చేతుల్లో అంబేడ్కర్ చిత్రపటాలుఉదయం 7.30 గంటల సమయంలో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు అంబేడ్కర్ చిత్రాలు, ప్లకార్డులు పట్టుకుని పాఠశాల ప్రాంగణంలో గుమికూడటంతో నిరసన ప్రారంభమైందని తెలిసింది. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, తరగతి గదుల సదుపాయాల లోపం చాలా కాలంగా ఉందని, వాటి వల్ల చదువులకు ఇబ్బంది కలుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.జెన్ ఆల్ఫా నిరసన వార్త వ్యాపించడంతో పాఠశాల అధికారులు, స్థానిక పోలీసులు విద్యార్థులను తరగతులకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చే వరకు నిరసన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ నితిన్ కుమార్ తదితర అధికారులు క్యాంపస్‌కు చేరుకుని 8 మంది విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించారు. సమావేశం అనంతరం విద్యార్థుల 8 డిమాండ్లలో 7 డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత నిరసన ముగిసింది.ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపడతామని, సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తామని, క్రీడా మైదానాన్ని నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిమాణం మెరుగుపరుస్తామని, ఫర్నిచర్ తక్కువగా ఉన్న తరగతి గదుల్లో అదనపు బెంచీలు నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.సైన్స్ విభాగం ప్రారంభించాలన్న ఒక్క డిమాండ్ మాత్రమే వెంటనే అంగీకరించలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపాలని పాఠశాలకు సూచించారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.నిరసనకు ప్రధాన కారణం ఏమిటి?ఓ విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన కొందరు బాలికలతో ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటనే నిరసనకు కారణమైంది. “బాలికలు ఫిర్యాదు చేయగా, ‘నువ్వు కూర్చో, నిశ్శబ్దంగా ఉండు’ అని ఉపాధ్యాయుడు అన్నాడు. ఆ తర్వాత మరికొందరు బాలికలు కలిసి జరిగిన విషయం బాలురకు చెప్పారు. కొందరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని వారు భావించారు” అని ఆ విద్యార్థి తెలిపాడు. -
సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్‌మంతర్ వద్ద హైఅలర్ట్
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.36 రోజుల ఆందోళన.. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం. -
నన్నంతా హృతిక్ రోషన్‌లా ఉంటానంటారు! కంగనాకేమో..
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్, సీపీజే (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జెన్-జీ నిరసనకారులపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పేరును కూడా తెరపైకి తెచ్చింది. సౌరవ్ దాస్ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘‘నా స్నేహితులు నన్ను చూస్తే యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని చెబుతుంటారు’’ అంటూ సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కంగనా వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్.. గతంలో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.జెన్-జీపై కంగనా వ్యాఖ్యలతో..నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. నిరసనల్లో పాల్గొంటున్న కొందరు యువతపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. జెన్-జీ నిరసనకారుల వీడియోలు చూస్తే అసహ్యం వేస్తోందని, వారి భాష, ప్రవర్తన తనను బాధించాయని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ఉద్దేశించి చేసిన కొన్ని ఘాటు పదజాలంపై(ఇలాంటి వాళ్లను ఎలా కంటారో..) రాజకీయ.. సినీ వర్గాలు, యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలను సౌరవ్ దాస్ తప్పుబట్టాడు. ఆమెను సొంత పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అంటూ విమర్శించాడు. ప్రజా జీవితంలో ఉన్న ఓ ఎంపీ యువతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. జెన్-జీ తరం దేశంలో మార్పు కోసం పోరాడుతోందని, వారి గొంతును తక్కువ చేసి చూడకూడదని వ్యాఖ్యానించాడు. కంగనా ఘాటు కౌంటర్.. సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు కంగనా కూడా అదే స్థాయిలో స్పందించారు. సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆమె.. అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు అని తెలిసింది. అతనో పనికిమాలిన వ్యక్తి అని అర్థమైంది’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. తన వయసులోనే తాను రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని, ప్రజా జీవితంలో తనకు 20 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, వ్యాపారవేత్తగా తాను ఎన్నో రంగాల్లో పనిచేశానని తెలిపారు. సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి ‘‘ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.‘యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానంటారు’సౌరవ్ దాస్ స్పందిస్తూ కంగనా వ్యాఖ్యలపై వ్యంగ్యంగా మాట్లాడారు. తనను స్నేహితులు చూస్తే యువ హృతిక్ రోషన్‌లా కనిపిస్తానని చెబుతుంటారని అన్నారు. అయితే కంగనా మాత్రం తనపై తీవ్రంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పేరు వైరల్‌గా మారింది. ఎందుకంటే గతంలో హృతిక్, కంగనా మధ్య జరిగిన వివాదం బాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అసలు హృతిక్-కంగనా వివాదం ఏంటి?హృతిక్ రోషన్ పేరు ఇప్పుడు చర్చలోకి రావడానికి కారణం 2016లో జరిగిన వివాదమే. ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హృతిక్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని కంగనా చేసిన ఆరోపణలను హృతిక్ రోషన్ ఖండించారు. ఇద్దరూ ఒకరికొకరు లీగల్ నోటీసులు పంపించుకున్నారు. ఈ-మెయిల్స్, డిజిటల్ ఆధారాలపై కూడా దర్యాప్తు జరిగింది. అయితే తమ మధ్య సంబంధం ఉందని కంగనా చెబుతుండగా.. అలాంటి సంబంధం ఎప్పుడూ లేదని హృతిక్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఇప్పటికీ ఎటూ తేలలేదు.మాటల యుద్ధం..ప్రస్తుతం కంగనా రనౌత్, సౌరవ్ దాస్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్-జీపై వ్యాఖ్యలతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు కంగనాకు పర్సనల్ ఎటాక్‌లా హృతిక్ రోషన్ పేరు ప్రస్తావనకు వచ్చే స్థాయికి చేరింది. హృతిక్-కంగనా పాత వివాదాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు సౌరవ్ దాస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.“జూలై 24న నీట్ లీక్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఆర్‌పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్‌గంజ్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్‌ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.పోలీసులు ఏమన్నారు?కిషన్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.मोहम्मद सदाकत 4 महीने से रूस में हैं। बिहार पुलिस ने स्टूडेंट प्रोटेस्ट में उनके खिलाफ भी FIR दर्ज कर दी है !! pic.twitter.com/jEDqWs27ck— Sachin Gupta (@Sachingupta) July 29, 2026 -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన భారీ నిరసన తర్వాత ప్రభుత్వం విద్యార్థులపై తీసుకుంటున్న చర్యలు, జరుగుతున్న పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘‘విద్యార్థులను పోలీసులు వేధించడం కొనసాగితే, కాక్రోచ్ జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, వేధింపుల వేట కొనసాగించడాన్ని వెంటనే ఆపాలి’’ అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు, తమ పోరాటం ఇంకా పూర్తికాలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు స్పష్టం చేశారు. ఆందోళన విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టుకాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇంతకుముందే తెలిపారు.సీజేపీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఈ నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని పేర్కొన్నారు.కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను విమర్శించారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో సౌరవ్ దాస్ స్పందిస్తూ... ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్లు ఉపసంహరించకుండా ఉండేందుకు సాకుగా ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటని గుర్తుచేశారు.అస్సాం, బిహార్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్రం సీజేపీకి ఇచ్చిన హామీని గౌరవిస్తూ ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కోర్టు పోలీసు చర్యలు కొనసాగించాలని ఎక్కడా ఆదేశించలేదని చెప్పారు. మంగళవారాన్నే ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు గడువుగా పేర్కొంటూ, డిమాండ్ నెరవేరకపోతే సీజేపీ మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలని, శాంతియుత ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లక్ష్యంగా చేసుకోబోమని చెప్పిందని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఆ హామీకి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.కేంద్రం తరఫున వాదించిన న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ ఆధారంగానే సీజేపీ దేశవ్యాప్త నిరసనను విరమించుకుందని చెప్పారు. -
జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికి దీప్కే?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (30)కి వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. అభిజీత్ దిప్కే తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన ప్రారంభం కాకముందు కూడా పెళ్లి సంబంధాలు కొన్ని వచ్చాయని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన తర్వాత వాటి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. అభిజీత్ బోస్టన్‌లో ఉన్న సమయంలో అతడి గురించి పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడారని, కానీ తన ప్లాన్స్ గురించి ఆయన పెద్దగా చెప్పలేదని ఆమె తెలిపారు. "దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. చిరునవ్వు మాత్రమే నవ్వాడు. తల్లిదండ్రులుగా పెళ్లి చేసుకోవాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించి, తుది నిర్ణయం ఆయనకే వదిలేస్తాం" అని ఆమె తెలిపారు. ఇప్పుడు దీప్కే అంటే చాలా మంది అమ్మాయిలు పడిచస్తుండడంతో ఆయన జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికే వెళ్తాడేమోనని నెటినన్లు అంటున్నారు.ఉద్యమం కొనసాగుతుంది..సీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఆ సంస్థ నేతలు అంటున్నారు. ఆందోళన విరమించడం ఉద్యమానికి ముగింపు కాదని దీప్కే తెలిపారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో, సీజేపీ "ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది" అని పేర్కొంటూ, నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని చెప్పారు.పరీక్షల వివాదం సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత గరిష్ఠ పరిహారం అందిస్తామని కేంద్రం తెలిపింది.విద్యా సంస్కరణల కోసం సీజేపీ ప్రచారం కొనసాగిస్తుందని, ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తామని కూడా సీజేపీ నాయకులు సూచించారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ, పాలనలో సంస్కరణల కోసం ప్రయత్నిస్తూనే యువతను ప్రభావితం చేసే అంశాలను సంస్థ ప్రస్తావిస్తుందని చెప్పారు.ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రస్తుతం తమ ప్రాధాన్యం కాదని, యువత సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించేలా చూడటంపైనే దృష్టి ఉందని కూడా దాస్ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని సీజేపీ నాయకుడు రాంకా పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఒత్తిడి కొనసాగించడమే తక్షణ లక్ష్యమని చెప్పారు. -
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్‌జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. -
‘మాకే లేదు ఇంకేం ఇస్తాం’: పాక్ క్రియేటర్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలపై పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘మా మధ్య ద్వేషం పెరిగిందని నాకు తెలుసు, కానీ నిరసనల్లోని ప్రతి గుర్తును, పోస్టర్‌ను, అంతర్గత జోక్‌ను మేం (పాకిస్థానీయులు) అర్థం చేసుకోగలం. మేం మా పోలికలను దాంట్లో చూసుకుంటాం. ఏదేమైనా మేం విడిపోయిన తల్లిదండ్రుల సంతానం’ అని పేర్కొన్నారు.భారతదేశంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ.. ‘వీరు పిల్లలు. ఎంతో ధైర్యవంతులు. తమ దేశం మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసమే వారు నిరసన తెలుపుతున్నారు. అందులో ఏదో ఒక అందం ఉంది’ అని అన్నారు. ఈ నిరసనలకు పాక్ నిధులు సమకూర్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను హసన్ ఖండించారు. ‘పాకిస్థాన్ నిరసనలకు నిధులు ఇచ్చిందని అంటున్నారు. మా దేశాన్ని నడుపుకోవడానికే మా వద్ద సరిపడా డబ్బు లేదు. ఇక మేం వాటికి ఎలా నిధులు సమకూర్చగలం?" అని హసన్ ప్రశ్నించారు. ‘ఫ్రమ్ పాకిస్థాన్ టు ఇండియా’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.భారత్, పాకిస్థాన్లలో నిరసనకారుల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఆయన పోల్చారు. పాకిస్థాన్‌లో విద్యార్థులు తీవ్రమైన ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చివరగా భారతీ విద్యార్థులకు సందేశమిస్తూ ‘మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి రిస్క్ తీసుకోండి. ఐక్యంగా ఉండండి. అమ్ముడుపోకండి’ అని హసన్ సూచించారు. ఈ వీడియోకు ఆన్లైన్లో విపరీతమైన స్పందన వస్తోంది. భారత్, పాకిస్థాన్ వినియోగదారులు హసన్ పరిశీలనా శక్తిని ప్రశంసిస్తున్నారు. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
యువతరం రోడ్డెక్కితే.. దేశానికి హెచ్చరికేనా?
-
CJP సంబరాలపై వాంగ్‌చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్‌గా మారిన వేళ.. వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్‌చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్‌చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సపోర్ట్‌గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్‌చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్‌చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
‘‘ఆందోళనకు దిగిన విద్యార్థులను కాల్చిపడేయాలని ఆదేశించేవాడిని’’
తిరువనంతపురం: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశించేవాడినని ఓ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యాత చెప్పడంతో కేరళలో తీవ్ర వివాదం చెలరేగింది.పత్రిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో టీజీ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ముందుగా జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులను 3 సార్లు వెళ్లిపోవాలని హెచ్చరించేవాడినని, అయినా వినకపోతే వారిపై కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని అన్నారు."ప్రజలు చెదిరిపోయి పరుగులు తీస్తారు. కొందరు చనిపోతారు. కొందరు చనిపోరు. ఇంకొందరికి తీవ్రగాయాలు అవుతాయి. 4 గంటల్లో పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. మృతదేహాలను తీసుకుని ఆసుపత్రికి తరలిస్తాం" అని మోహన్‌దాస్ అన్నారు.మహిళా ఆందోళనకారులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. వారిని "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. "సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. దేవుడి దయతో ఎలాంటి ఫిర్యాదులు రావు. ఎందుకంటే అత్యాచారాలను ఇష్టపడే వారు ఉన్నారు. ముఖ్యంగా వామపక్షాలు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ఆందోళనకారులపై హింసను ప్రోత్సహిస్తున్నారని పలువురు మోహన్‌దాస్‌పై నెటిజన్లు ఆరోపణలు చేశారు.టీజీ మోహన్‌దాస్ ఎవరు?టీజీ మోహన్‌దాస్ కేరళకు చెందిన రచయిత, కాలమిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇంజనీర్, న్యాయవాదిగా శిక్షణ పొందిన ఆయన పాత్రికేయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక విమర్శకుడిగానూ పని చేశారు.గతంలో బీజేపీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా పని చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విచార కేంద్రంలో కూడా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2012లో ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరిలో బీజేపీ, సీపీఐ(ఎం) మధ్య రాజకీయ సహకారం సాధ్యాసాధ్యాలపై వ్యాసం రాశారు. ఆ వ్యాసం రెండు వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.పోలీసులకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదుసీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సోమవారం కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేసింది. మోహన్‌దాస్ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపాలని బహిరంగంగా చెప్పడం రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ కాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కుపై నేరుగా దాడి చేసినట్టేనని విద్యార్థి సంఘం ఆరోపించింది.డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యలు అడ్డుకోకపోతే హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయవచ్చని, చట్టవ్యతిరేక పరిస్థితులకు దారితీయవచ్చని కూడా పేర్కొంది. విద్యార్థి ఆందోళనకారులను "కాల్చి చంపాలని" మోహన్‌దాస్ పిలుపునిచ్చారని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని పోలీసులను కోరింది. -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్‌లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్‌ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు.బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్‌పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు."పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. -
ఇప్పుడు కేరళలో ఆందోళనలు.. సినీనటుల మద్దతు
తిరువనంతపురం: కేరళ సచివాలయం ఎదుట నిరవధిక ఆందోళన చేస్తున్న కేరళ పీఎస్సీ ర్యాంక్ హోల్డర్లకు పలువురు మలయాళ సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై సినీ ప్రముఖులు మౌనం పాటిస్తున్నారంటూ విమర్శలు పెరగడంతో వారు స్పందించారు. నీట్ పరీక్ష వివాదం, ఇతర జాతీయ అంశాలపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలకు మద్దతు తెలిపిన పలువురు ప్రముఖులు కేరళలో పీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై ఎందుకు మాట్లాడటం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు రావడం తర్వాత ఈ మద్దతు వ్యక్తమైంది.నటులు రంజిని హరిదాస్, టోవినో థామస్, నస్లెన్, చందు సలీంకుమార్, లియోనా లిషోయ్, దీపా థామస్ ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు. వీడియోలు షేర్ చేస్తూ అభ్యర్థుల డిమాండ్లను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించారు.మొదట స్పందించిన వారిలో టెలివిజన్ వ్యాఖ్యాత, నటి రంజిని హరిదాస్ ఒకరు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న తర్వాత పీఎస్సీ ర్యాంక్ హోల్డర్ల ఆందోళనపై ఎందుకు మాట్లాడలేదని తనకు అనేక సందేశాలు వచ్చాయని ఆమె చెప్పారు. ఈ అంశంపై చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చే వరకు పూర్తి అవగాహన లేదని అంగీకరించారు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేంత సమాచారం ఆన్లైన్లో అందుబాటులో లేదని, బహిరంగంగా తన అభిప్రాయం చెప్పే ముందు దీనిని అధ్యయనం చేయాలనుకున్నానని తెలిపారు. ఆందోళనకారులు లేదా వారి ప్రతినిధులు తనను సంప్రదించాలని, వారి సమస్యలను నేరుగా వినాలని ఆమె కోరారు.ఇదే సమయంలో నటుడు చందు సలీంకుమార్ స్పందిస్తూ.. జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన అంశాలపై మాత్రమే మాట్లాడి, ఇంటి దగ్గరే ఉన్న అంతే ముఖ్యమైన సమస్యలపై మౌనం పాటించడం సరికాదని కొందరు ప్రముఖులను విమర్శించారు."నీట్ ప్రశ్నపత్రం లీక్ పై స్పందించడం ముఖ్యమే. అలాగే పీఎస్సీలో పరిపాలనా లోపాలపై స్పందించడం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, అవసరమైన చోట మన గొంతు వినిపిద్దాం. భారత యువత, వారి కృషి సరిహద్దులతో సంబంధం లేకుండా ఉండడం ముఖ్యమే. ఆలోచించండి" అని ఆయన రాశారు. -
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం
-
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. నేరుగా అక్కడకు..
గురుగ్రామ్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సోనమ్ వాంగ్‌చుక్ తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే వచ్చానని వాంగ్‌చుక్ అన్నారు. అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమని చెప్పారు. ఇంతకు ముందు వాంగ్‌చుక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేస్తూ.. "ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా శరీరం నెమ్మదిగా బలాన్ని తిరిగి పొందుతోంది" అని చెప్పారు. లద్ధాక్‌కు తిరిగి వెళ్లే ముందు మహాత్మా గాంధీకి నివాళి అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు వెళ్తానని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సాగిన విద్యార్థుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మెదాంతా ఆస్పత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. "డిశ్చార్జ్ చేసే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయన పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఔట్ పేషెంగ్లా వచ్చి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించాం" అని మెదాంతా ది మెడిసిటీ వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ దురాణి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.వాంగ్‌చుక్ జూలై 21న ఢిల్లీలో జరిగిన 'సంసద్ చలో' ర్యాలీ తర్వాత ప్రైవేట్ ఆసుత్రిలో చేరారు. జూలై 18న జంతర్ మంతర్ నుంచి ఆయనను తీసుకెళ్లి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్షకు నాయకత్వం వహించారు. ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు ముందు, జూలై 24న ఆయన నిరాహార దీక్షను ముగించారు. -
CJP పుట్టుక వెనుక అసలు కథ అభిజీత్ దీప్కే చరిత్ర
-
మా నెక్ట్స్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తదుపరి కార్యాచరణ ఏంటి? భారతీయుల్లో ఉన్న ప్రశ్న ఇది. దీంతో దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. "మా తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. ఉద్యమం నిన్ననే ముగిసింది. మాకు కొంత సమయం ఇవ్వండి" అని అన్నారు.పంజాబ్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. "ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాం. ప్రస్తుతం దానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం" అని చెప్పారు.ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి దీప్కే మాట్లాడుతూ... "విద్యార్థులపై నమోదైన కేసుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏ విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదు" అని స్పష్టం చేశారు.పంజాబ్ మంత్రిపై ఒత్తిడికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ డిమాండ్లను బైన్స్ తాజాగా తిరస్కరించారు. ఫార్మసీ నియామక పరీక్ష వివాదంపై స్పందిస్తూ విమర్శకులపై ఆయన మండిపడ్డారు.బైన్స్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇది ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కాదు. భారీ స్థాయిలో కాపీయింగ్ జరిగిన ఘటన. కాపీయింగ్‌ను పరీక్షా కేంద్రంలోనే గుర్తించి, అందుకు పాల్పడిన విద్యార్థులను అక్కడికక్కడే పట్టుకున్నాం" అని చెప్పారు.తన రాజీనామా కోరుతున్న వారిపై స్పందిస్తూ, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. "నేను మొదటి నుంచి విద్యార్థులకే అండగా నిలిచాను. నా రాజీనామా వల్ల ఉద్యమానికి ఉపయోగం ఉంటే పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమేనని విద్యార్థులకు చెప్పాను" అని బైన్స్ వెల్లడించారు."ఆ కాపీయింగ్ కేసు నా శాఖ పరిధిలోనిది కూడా కాదు. అది నా సహచర మంత్రి బాధ్యత. అయినప్పటికీ బాధ్యత నుంచి నేను తప్పించుకోవడం లేదు" అని హర్జోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. -
రగిలిన నిప్పురవ్వ.. చరిత్రాత్మక GEN-Z ఉద్యమం.. మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
-
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్‌లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్‌లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 -
'నో చెప్పలేం'.. రాజకీయ ఎంట్రీపై కాక్రోచ్ జనతా పార్టీ బిగ్ హింట్!
ఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్-యూజీ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం..ఓ జాతీయ మీడియా సంస్థ ..‘సీజేపీ ప్రతినిధుల్ని మరి మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?’..అని అడగ్గా.. భారత్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి దేనినైనా పూర్తిగా కొట్టిపారేయలేం’ అంటూ సీజేపీ నాయకత్వం తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే బలమైన హింట్ ఇచ్చింది.ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిన వెంటనే జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ ఉద్యమ భవిష్యత్తు గురించి, అలాగే తమ బృందం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా అనే అంశాలపై మాట్లాడారు.ఇప్పుడు నా మనసులో ఉన్న ఏకైక ఆలోచన ఇంటికి వెళ్లి నిద్రపోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం,నా కుటుంబాన్ని కలవడం మాత్రమే. గత కొన్ని నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటూ గత రెండు నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇదంతా మా అందరికీ ఒక పెద్ద అనుభూతిని కలిగించే విషయం. ఇది గర్వపడాల్సిన సమయం. ఊరట పొందే సమయం ఇది. ఆ తర్వాత, పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం’ అని రంకా చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారా అని అడిగినప్పుడు ‘భారత్‌లో దేనికీ నో అని చెప్పకూడదనేదే నా అభిప్రాయం అని ఆయన బదులిచ్చారు. అయితే, రాజకీయాలు సీజేపీ బృందం తక్షణ లక్ష్యం కాదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చ లేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నా సరే వారు యువత కోసం పనిచేసేలా వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ప్రస్తుత అజెండా’ అని దాస్ చెప్పారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్‌లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
‘నీట్’ అయిపోయింది.. సీజేపీ నెక్ట్స్ ఏం చేస్తుందంటే?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిరసనలకు తలొగ్గడం చాలా అరుదు. సాధారణంగా ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి, నిరసనలను కాలక్రమంలో చల్లారేలా చూస్తాయి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేఐ) ఆందోళనల విషయంలో మాత్రం ఆ పరిస్థితి మారింది.నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వారాల తరబడి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఇతర యువత నిరసనలు కొనసాగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడగానే అక్కడ సంబరాలు జరిగాయి.నీట్ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, జూలై 20న జరిగిన పోలీసు చర్యపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిమాండ్ చేశారు.ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే..?సీజేపీ ఇకపై నీట్, పరీక్షల సంస్కరణలకే పరిమితమవుతుందా? లేక ఉద్యోగాలు, నియామకాలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తుందా? ఈ నిర్ణయమే సీజేపీ చరిత్రను నిర్ణయించనుంది.సీజేపీ.. కేవలం నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పుట్టిందని భావించడం సరికాదు. నీట్ వివాదానికి ముందే, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశ యువతలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిరుద్యోగ యువతను "కాక్రోచ్లు" అని అన్నారనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లో విస్తరించింది. అనంతరం ఆయన నకిలీ డిగ్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చే వారినే ఉద్దేశించి మాట్లాడినట్లు వివరణ ఇచ్చినా, అప్పటికే ఆ పదాన్ని యువత తమ ఉద్యమానికి ప్రతీకగా మార్చుకుంది. అలా "కాక్రోచ్" అనే పదం అవమానం నుంచి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది.సామాజిక మాధ్యమాల నుంచే పుట్టిన ఉద్యమంగతంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగేవి. కానీ, సీజేపీ పూర్తిగా డిజిటల్ వేదికలపై రూపుదిద్దుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లు, ప్రత్యక్ష ప్రసారాల్లో ఉద్యమం వ్యాప్తి చెందింది. వీటి ద్వారానే వేలాది మంది యువత ఒక్కటయ్యారు. మీమ్స్ ఉద్యమానికి ఊపునిచ్చాయి. ఆ తర్వాత నీట్ ప్రశ్నపత్రం లీక్ ఈ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది.ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద కేవలం వైద్య విద్యార్థులే కాదు... యూపీఎస్సీ అభ్యర్థులు, ఎస్ఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, ఇంజినీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఎందుకంటే పరీక్ష రద్దు కావడం అంటే వారికి మరో ఏడాది కోచింగ్ ఖర్చు, మరో ఏడాది ఉద్యోగం లేకపోవడం, కుటుంబంపై మరింత భారం పడటమే.తదుపరి అజెండా ఉద్యోగాలేనా?భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. అయితే స్థిరమైన ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లో... ఖాళీలు భర్తీ కాకపోవడం, కోర్టు కేసులు, ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. యువతకు నిరుద్యోగం అనేది నిత్యజీవిత సమస్య.సీజేపీ ముందున్న కీలక అంశాలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ప్రధాన డిమాండ్ నెరవేరింది. ఇప్పుడు సీజేపీ ముందు పలు మార్గాలు ఉన్నాయి. పరీక్షల సంస్కరణలు, పారదర్శకత కోసం ఉద్యమాన్ని కొనసాగించడం. ఉద్యోగాలు, నియామకాలు, ప్రభుత్వ ఖాళీల భర్తీ వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకోవడం. లేదా భవిష్యత్తులో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలా అనే విషయంపై ఆలోచించడం.చరిత్ర ఏమి చెబుతోంది?భారత రాజకీయాల్లో ఇలాంటి ఉద్యమాలు భిన్న ఫలితాలు ఇచ్చాయి. జేపీ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ఒక వర్గం రాజకీయాల్లోకి ప్రవేశించింది. రైతుల ఉద్యమం ఒకే చట్ట లక్ష్యంతో విజయాన్ని సాధించింది. అయితే విద్యార్థి ఉద్యమాలు మాత్రం ప్రధాన సమస్య పరిష్కారమైన తర్వాత బలహీనపడిన సందర్భాలు ఎక్కువ.శనివారం జరిగిన పరిణామం మరో విషయాన్ని కూడా నిరూపించింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల మద్దతు లేకుండానే డిజిటల్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఒక తరం యువతను ఏకం చేయవచ్చని సీజేపీ చూపించింది. ఈ ఉద్యమం ఇంటర్నెట్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చినా దాని డిమాండ్లు మాత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనవి.. అవే జవాబుదారీతనం, సమాన అవకాశాలు, న్యాయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సీజేపీ ఉద్యమానికి ముగింపు కాకపోవచ్చు. ఉద్యోగాలు, నియామక సంస్కరణలు, యువత భవిష్యత్తు వంటి పెద్ద అంశాలపై కొత్త దశకు ఇది ఆరంభం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు.. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతగా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు.మరోవైపు, ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కర్ణాటక నుంచి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ధారవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా దేశానికి స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధనం కోసం ఆయన దృష్టి సారించారు. 2030 నాటికి పునరుత్పాదక, శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించడం, 2070 నాటికి నికర కార్బన్ ఉద్గారాలను సున్నాకు చేర్చే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కృషి చేస్తున్నారు. ఈ లక్ష్యాలు భారత ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రతకు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.పునరుత్పాదక ఇంధన రంగంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రహ్లాద్ జోషి పలు కీలక కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు.కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే రోజున తాత్కాలికంగా కొత్త మంత్రిని నియమించడం గమనార్హం. -
ఇది మేము ఇస్తున్న వార్నింగ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... ఇది విద్యార్థుల విజయమని తెలిపారు. దేశ భవిష్యత్తును విద్యార్దులు నిర్ణయిస్తారని చెప్పారు.‘‘ఇది భారత విద్యార్థుల నుంచి, ప్రతిపక్షం నుంచి వస్తున్న వార్నింగ్. ఇప్పటి వరకు మీరు దేశాన్ని నడిపిన తీరులోనే ఇకపై నడపలేరు. ఇది మీ వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ సొంత ఆస్తి కాదు. ఈ దేశం భారత ప్రజలది. భారత రాజ్యాంగానిది. ఈ సంస్థలన్నీ మీ సొంతం కాదు. ఇదే దారిలో మీరు ముందుకు సాగితే, ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్థాయిలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే మా ప్రధాన సందేశం.మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పది. భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేసింది. విద్యార్ధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై కాల్పులను అనుమతించము. ప్రజలు ఏం అనుకుంటున్నారో ప్రభుత్వం వినాలి. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. పేపర్ లీకులపై తీసుకొచ్చే బిల్లులపై విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. నా తరఫున మద్దతు ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశ భవిష్యత్తు కచ్చితంగా గతాన్ని ఓడిస్తుంది. విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి. విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించింది. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
కేంద్ర మంత్రులతో CJP సంచలన ప్రెస్ మీట్
-
వాంగ్చుక్కు కనీసం థ్యాంక్స్ చెప్పని అభిజీత్ దీప్కే..
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వేదికపై.. తాము విజయం సాధించామని ప్రకటించారు. అయితే, 26 రోజుల నిరాహార దీక్షతో ఈ నిరసనను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పేరును తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.శనివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికపై దీప్కే మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు నన్ను హీరోగా చూడొద్దు. ఆ తప్పు చేయకండి. ఒక వ్యక్తిని హీరోగా మార్చడం వల్లే ఈ దేశం నష్టపోయింది. ప్రభుత్వానికి తలవంచకపోతే ఎవరినైనా రాజీనామా చేయించగలమని ఈ విజయం నిరూపించింది. ఇది ప్రజాస్వామ్యం" అని పేర్కొన్నారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన సోనం వాంగ్‌చుక్ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఉద్యమానికి బలం ఇచ్చిన వాంగ్చుక్అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి జూన్ 6న భారత్‌కు వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రారంభించారు. తొలి రోజుల్లో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. సౌరభ్ దాస్, ఆశుతోష్ రంకా, ఉద్యోగం కోల్పోయిన విజయతా దహియా వంటి కొద్దిమంది సహచరులు మాత్రమే ఆయనతో ఉన్నారు. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ యువతకు మద్దతు ప్రకటించారు.ప్రారంభంలో నిరసనకు పెద్దగా స్పందన లేకపోవడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, జూన్ 28న వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగి, నిరసనకు భారీగా మద్దతు రావడం ప్రారంభమైంది. జంతర్ మంతర్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఆసుపత్రికి తరలింపు.. ఉద్యమానికి మరింత ఊపుపరిస్థితి విషమించడంతో జూలై 18న ప్రభుత్వం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. అనంతరం ఆయనను గురుగ్రామ్‌లోని మెదంతా ఆసుపత్రికి మార్చారు. ఆసుపత్రిలోనే ఆయన నిరాహార దీక్ష కొనసాగించడంతో, అది ఉద్యమానికి కేంద్ర బిందువైంది. లక్షలాది మంది తమ వాట్సాప్ డీపీగా "ఐ సపోర్ట్ సోమ్" అనే సందేశంతో వాంగ్‌చుక్ ఫొటోను పెట్టుకున్నారు.ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా, పంపిన సందేశాలు నిరసనకారులకు స్ఫూర్తినిచ్చాయి. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి భారీగా హాజరుకావాలని కూడా వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్గొనకపోతే "దెయ్యంలా తిరిగి వస్తాను" అంటూ భావోద్వేగ వ్యాఖ్య కూడా చేశారు.పోలీసుల చర్యలతో మరింత ఉద్ధృతంజూలై 20న వేలాది మంది పార్లమెంట్ వైపు కదిలారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలప్రయోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, వేలల్లో ప్రజలు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. దీంతో ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది.నిరాహార దీక్ష విరమణపై విమర్శలుజూలై 22న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీల నేపథ్యంలో వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఆయన తన వైఖరిని సడలించారని విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేయగా, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, విమర్శకులు మానవీయ కోణంలో ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఉద్యమం సీజేపీని దాటి..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. "ఇది ఇప్పుడు సీజేపీకి మాత్రమే సంబంధించిన ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ప్రజలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ ఉద్యమం సీజేపీ కంటే చాలా పెద్దదిగా మారింది. వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్ష విరమించడం మాకు సంతోషమే. ఆయన ఆరోగ్యం గురించి మేము చాలా ఆందోళన చెందాం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చింది ఆయనే" అని పేర్కొన్నారు.విజయ ప్రసంగంలో మౌనంఉద్యమం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థను దాటి ప్రజల ఉద్యమంగా మారినప్పటికీ.. ఉద్యమానికి బలం, విశ్వసనీయత, పోరాట స్ఫూర్తి అందించిన సోనం వాంగ్‌చుక్ పేరును విజయ ప్రసంగంలో అభిజీత్ దీప్కే ప్రస్తావించకపోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన 26 రోజుల నిరాహార దీక్షే యువత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
అభిజీత్ దీప్కే తల్లి అనిత భావోద్వేగభరిత కామెంట్స్
ముంబై: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తల్లి అనితా దీప్కే ఇంటి వద్ద స్వీట్లు పంచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జీవితంలో అద్భుతమైన రోజు. చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన నిజాయితీతో చేసిన కృషికి చివరకు ఫలితం దక్కింది. తాను పెట్టిన డిమాండ్ నెరవేరాల్సిందేనని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే పట్టుదలతో చివరి వరకు పోరాడాడు. మొదట్లో మేము చాలా భయపడ్డాం. తల్లిదండ్రులుగా మాకు చాలా భయం వేసేది. జైపూర్‌లో అతనిని చెంపదెబ్బ కొట్టినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆ రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం. అతను తిరిగి వచ్చిన తర్వాత స్వీట్లు పంచి, అందరం కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజయంతో చాలా ఆనందంగా ఉంది. పిల్లలంతా ఇప్పుడు విముక్తి పొందారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చాలా, చాలా సంతోషంగా ఉంది. అభిజీత్ గురించి చాలా గర్వంగా ఉంది. అభిజీత్ చాలా మంచి పని చేశాడు. మధ్యలో అతనిపై దాడి చేసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఏమవుతుందో అని చాలా ఆందోళన పడ్డాను. అతనికి చెంపదెబ్బలు కొట్టినప్పుడు చాలా బాధగా అనిపించింది. జూన్ 7 నుంచి మా ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. అందరం తీవ్ర ఆందోళనలోనే ఉన్నాం. నాకు టైఫాయిడ్ కూడా వచ్చింది. నా కుమారుడు చాలా గొప్ప పని చేశాడు. అతని వయసు కేవలం 29 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పని చేశాడు. అతని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల మాట విని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు అభిజీత్‌తో మాట్లాడలేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ కలవలేదు. తర్వాత టీవీ ఆన్ చేశాం. ఈ రోజంతా టీవీలో అతని గురించే చూస్తున్నాం. నా బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద పని చేశాడనే గర్వం కలిగింది. అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. కానీ ఒక యువకుడు ఇంత పెద్ద పని చేసి చూపించాడు. చాలామంది అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ రోజు అతడు ఇంటికి రాడు. ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఎలా ఉంటుందో తెలియదు. రేపు వెళ్లి అభిజీత్‌ను తీసుకురావాలని అనుకుంటున్నాం. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం’’ అని తెలిపారు. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్‌మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. నవభారత్‌కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్‌చుక్ కోరారు. -
నీట్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-
GEN- Z కేంద్రంకు మా సత్తా ఏంటో చూపించాం..!
-
GEN-Z సంబరాలు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి..
-
రాజీనామా డిమాండపై భిన్నాభిప్రాయాలు.. బీజేపీకి ఉన్న సమస్య ఏంటి? మాట జారడమే ముంచేసిందా
-
‘కాక్రోచ్’ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలుసా?
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల కారణంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ ల్యాబ్స్’ (Cockroach Labs) అనే పేరు కూడా ట్రెండ్‌గా మారింది. పార్టీ పేరుకు, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, పేరులోని "కాక్రోచ్" పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులతో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కూడా "మా కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు" అనే భావనతో సోషల్ మీడియాలో స్పందించడంతో మరింత చర్చ మొదలైంది.ఏమిటీ కాక్రోచ్ ల్యాబ్స్?కాక్రోచ్ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థ. ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం అత్యంత వేగంగా, సురక్షితంగా పనిచేసే ‘కాక్రోచ్డీబీ’ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. సిస్టమ్‌లో ఏదైనా సర్వర్ పనిచేయకపోయినా, డేటా కోల్పోకుండా సేవలు కొనసాగించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా బతికి బయటపడే కాక్రోచ్ (బొద్దింక) పేరును కంపెనీ బ్రాండ్‌గా ఎంచుకున్నారు.ఈ సంస్థను 2015లో ముగ్గురు మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ స్థాపించారు. గూగుల్‌లో భారీ స్థాయి డేటా సిస్టమ్‌లపై పనిచేసిన అనుభవంతో, క్లౌడ్ యుగానికి సరిపోయే కొత్త తరహా డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీని ప్రారంభించారు. సంస్థ సహవ్యవస్థాపకుడు స్పెన్సర్ కిమ్బాల్ (Spencer Kimball) ప్రస్తుతం కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్‌లో పనిచేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓపెన్‌సోర్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ GIMP అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.కాక్రోచ్ ల్యాబ్స్ ప్రధాన ఉత్పత్తి ‘కాక్రోచ్డీబీ’. ఈ డేటాబేస్‌ను ముఖ్యంగా బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు, టెలికాం సంస్థలు, SaaS కంపెనీలు, AI, క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్లు వంటి భారీ స్థాయి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వర్లలో ఒకేసారి డేటాను నిర్వహించడం, సిస్టమ్ డౌన్‌టైమ్‌ను తగ్గించడం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకత. ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి ప్రధాన క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంది.కాక్రోచ్ ల్యాబ్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కాబట్టి దీనికి అధికారిక మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు. అయితే 2021లో సిరీస్ ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43,000 కోట్లకు పైగా)గా అంచనా వేశారు. ఇది ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీగానే కొనసాగుతోంది.భారత్‌లో కూడా కార్యకలాపాలు2022లో కాక్రోచ్ ల్యాబ్స్ భారతదేశంలోని బెంగళూరులో తన అనుబంధ సంస్థను నమోదు చేసింది. ప్రస్తుతం భారత్‌లో కూడా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ బృందాలను విస్తరిస్తోంది. ప్రపంచంలోని అనేక పెద్ద సంస్థలు కాక్రోచ్డీబీని ఉపయోగిస్తున్నాయి. వీటిలో నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్, బోస్, ఈక్విఫాక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. అధిక ట్రాఫిక్‌ను నిర్వహించే అప్లికేషన్ల కోసం ఈ డేటాబేస్కు మంచి డిమాండ్ ఉంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్ చుక్ రియాక్షన్
-
అంబేద్కర్ ఫోటో ఫ్రేమ్ తో CP లీడర్స్ సంబరాలు
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అభిజిత్ ఫస్ట్ రియాక్షన్
-
ఇది రా GEN-Z పవర్.. అనుకున్నది సాధించిన CJP.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
CJP సంబరాలు.. మా యుద్ధం ఇంకా పూర్తికాలేదు..!
-
Big Breaking : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం గెలిచింది సీజేపీ నేతలు అన్నారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాజీనామాకు తమ ఉద్యమమే కారణమని చెప్పుకున్నారు. "మేము ఇది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు" అని దీప్కే వ్యాఖ్యానించారు. "ఈ రాజీనామా ఒక రుజువు.. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం ముందు తలవంచకపోతే, ఎవరి రాజీనామాను అయినా మనం సాధించగలం" అని ఆయన అన్నారు.కేంద్ర మంత్రి రాజీనామాతో NEET-UG వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది, అలాగే పరీక్షా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో ఆసక్తి నెలకొంది.#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN— ANI (@ANI) July 25, 2026 -
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్‌కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL
-
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. -
అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్‌మంతర్‌లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేస్తున్న ఉద్యమంలో అరాచక శక్తులు చేరాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ బండి సంజయ్ విమర్శించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులు చేశారని, ఆ దాడిలో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 24వ తేదీ) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నుంచి మాట్లాడిన బండి సంజయ్.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాలనలో 18 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, కర్ణాటక, బెంగాల్, కేరళంలో పేపర్లు లీకైతే ఎవరూ రాజీనామా చేయలేదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో పేపర్లు లీకైతే మీరు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి చేరాయన్నారు. నిరసనలు చేస్తుంది విద్యార్థులైతే.. వారి చేతుల్లో రాళ్లు, రాడ్లు ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. ‘ ఈ ఆందోళనలో పార్లమెంట్‌పై దాడికి కుట్ర చేశారు. సంఘ విద్రోహలపైనే పోలీసులు లాఠీలు వాడారు. విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి విష ప్రచారం చేస్తున్నారు. యూపీఏ హయాంలో 70 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో పేపర్ల లీక్ ఘటనలు జరిగాయి. ఆ సమయంలో వారు రాజీనామాలు చేశారా? అని బండి సంజయ్ నిలదీశారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సస్పెన్స్ ఒకరోజు గడువు కోరిన కేంద్రం
-
పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలుకే.. మోదీ కేబినెట్ కఠిన నిర్ణయాలు
-
మా డిమాండ్ లు ఇవే.. కేంద్రం చర్చలు... తగ్గని CJP లీడర్లు
-
CJP టీమ్ మొత్తం అరెస్ట్..! ఈ రాత్రికే ముహూర్తం..
-
CJP నిరసనలపై ఉక్కుపాదం NSA చట్టం అమల్లోకి
-
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్‌పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
ఢిల్లీ: సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామన్న సీజేపీ ప్రతినిధులు.. ఈ డిమాండ్లకు నెరవేరేవరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి.కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. -
ప్రధాని వీడియో సందేశం ఏంటీ? కాక్రోచ్ ఉద్యమం వెసక ఉన్నదెవరు?
-
మహిళా జర్నలిస్టులపై దాడి.. చేసింది ఎవరు?
-
మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు.. CJP అభిజిత్ సంచలన కామెంట్స్
-
పోలీసుల కాళ్లు పట్టుకున్న CJP అభిజిత్.. కారణం తెలిస్తే షాక్!
-
బొద్దింకలతో పోలుస్తారా..? అధికారిణికి కాక్రోచ్ కౌంటర్
-
కేంద్రం ముందుకు CJP అభిజిత్
-
జంతర్ మంతర్‌కు మీరే రావాలి.. సర్కారుకు CJP హెచ్చరిక
-
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం
న్యూఢిల్లీ: లాఠీచార్జ్‌తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సమీపంలో జూన్ 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలో పోలీసులు చట్టవిరద్ధంగా పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సచేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్లు బహిర్గతంకావడంతో ఈ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల విభాగం గతంలోనే ఎన్నోసార్లు మొత్తుకున్నా ఢిల్లీ పోలీసులు మొద్దనిద్రపోతూ ఇప్పుడు సీజేపీ కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కంట్లో చూపు కోల్పోయిన టీనేజర్ ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్యకళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. వివరాలను అతని మేనమామ అజయ్ దుగ్గల్ ఏడుస్తూ చెప్పారు. ఇప్పుడెలా ఉందిరా అని లోకాబ్ను అడిగితే అతను చెప్పిన సమాధానంతో నోట మాట రాలేదు. మసగ్గా కాదుకదా కనీసం వెలుగు కూడా కన్పించట్లేదు. అంతా చీకటే’’అని సమాధానమిచ్చారు. ‘‘పెల్లెట్ ధాటికి అతని కుడి కంటి కారి్నయాకు రంధ్రం పడింది. కారి్నయల్ పెర్ఫోరేషన్ కారణంగా కుడి కంటితో చూడగలిగే అవకాశాలు కేవలం ఒక శాతం’’అని వైద్యులు చెప్పారు. మెడ, ఛాతి, భుజం, చేతిలోకీ పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి కుడి కంట్లో ఉండిపోయింది. ఢిల్లీ వర్సిటీ దూరవిద్యా కోర్సులో సాహిల్ డిగ్రీ చేస్తున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సిద్దమవుతున్నాడు. ఇప్పుడు ఇతని భవిష్యత్ ఏంటి? అని అతని కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సాహిల్లాగా మరెంతో మంది పెల్లెట్ల బారిన పడ్డారని మీడియాలో సాక్ష్యాధారాలతో సహా కథనాలు వెలువడుతున్నాయి. పలువురి ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లోకి పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఔట్లుక్ రిపోర్టర్, 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరీ సైతం పెల్లెట్ల బారినపడి శస్త్రచిక్సిత చేయించుకోవాల్సి వచ్చింది. వివరాలను మన్సూరీ వెల్లడించారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం మూడున్నరకు ఉద్యమకారులతోపాటు వెళ్తుంటే కన్నాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ వద్ద సీఆర్పీఎఫ్లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు గాల్లోకి బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. తర్వాత నేరుగా ఏదో ఆయుధం గురిపెట్టారు. కొన్ని సెకన్ల తేడాతో ఏదో వచ్చి నా ఎడమ కనుబొమ్మకు గుచ్చుకుంది. తర్వాత ఇంకొన్ని ఇనుపముక్కల్లాంటి నుదురు, ముక్కు, గదమ వద్ద గుచ్చుకున్నాయి. మెడలోకీ దూసుకెళ్లాయి. బాధ తాళలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లా. వైద్యులు వాటిని పెల్లెట్లుగా నిర్ధారించారు. మూడు పెల్లెట్లను వెంటనే తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. ఒకటి మెడలో ప్రధాన నరం, రక్తనాళం సమీపంలో ఇరుక్కుంది. ఇంకోటి ఎడమ కంటి కదలికలను నియంత్రించే కండరం వద్ద చిక్కుకుంది. ఇంకోటి ముక్కు సమీపంలో ముఖంలోకి వెళ్లింది. వీటిని తీయకపోతే ప్రమాదమని చెప్పారు. సర్జన్ అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజు శస్త్రచికిత్స చేసి తొలగించారు’’అని మన్సూరీ వెల్లడించారు.ఏమిటీ పెల్లెట్లు? పెల్లెట్ గన్ను పంప్–యాక్షన్ గన్ లేదా షాట్‌గన్ అని కూడా పిలుస్తారు. వీటిని పేలిస్తే చాలా చిన్నగా ఉండే ఇనుపముక్కల్లాంటివి జల్లెడలా చుట్టూతా వేగంగా దూసుకెళ్తాయి. ఇవి సెకన్‌కు 1,000 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. వీటిని ఏదైనా ఖనిజంతో లేదా రబ్బర్‌తో తయారుచేస్తారు. గన్‌లోని ఒక్కో క్యాట్రిడ్జ్‌లో 600 వరకు పెల్లెట్లు ఉంటాయి. ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర నిబంధనల ప్రకారం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను పాటిస్తూ తొలుత పోలీసులు మైక్‌లో ఆందోళనకారులను శాంతించాలని హెచ్చరించాలి. తర్వాత జలఫిరంగులతో అడ్డుకోవాలి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాలి. తప్పదనుకుంటే లాఠీచార్జ్ చేయాలి. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే పెల్లెట్లు ప్రయోగించాలి. అవి కూడా నడుం కిందకు గురిపెట్టి కాల్చాలి. కానీ ప్రభుత్వ సాయుధబలగాలు ఉద్యమకారులను తరమికొట్టేందుకు నేరుగా ముఖం, ఛాతికి గురిపెడుతున్నాయని చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి. -
TG: రేపు విద్యాసంస్థలు బంద్!
హైదరాబాద్: ఈ నెల 24న(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్,ఎన్ఎస్యూఐ,పీడీఎస్‌యూ,ఏఐఎఫ్డీఎస్ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని,. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. -
జంతర్ మంతర్‌కు వేలాది మంది.. ఇది వాంగ్‌చుక్, దిప్కే వల్ల కాదు..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలకు వేలాది మంది తరలివస్తున్నారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేతృత్వం వహిస్తుండగా, లడఖ్‌కు చెందిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. అయితే, ఇంతమంది జనం స్వచ్ఛందంగా తరలివస్తుండటానికి అసలు కారణం ఈ ఇద్దరు నేతల ఆకర్షణ మాత్రమే కాదని, 2026 నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పేరుకుపోయిన తీవ్ర ఆగ్రహమేనని క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి. పరీక్ష ఒత్తిడితో తోబుట్టువులను, స్నేహితులను కోల్పోయిన అనేకమంది యువకులు, పాఠశాల విద్యార్థులు సైతం తల్లిదండ్రులకు తెలియకుండా ఇక్కడికి చేరుకుంటున్నారు.జంతర్ మంతర్‌కు ఇప్పుడు వేలాదిగా చేరుతున్న వారిని నడిపిస్తున్నది ఒక్క నాయకుడు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం తర్వాత విద్యార్థులు, యువతలో ఆగ్రహం మరింత పెరిగిందని అంటున్నారు. అదే దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఢిల్లీకి రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అందుకే ఈ ఉద్యమం వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజల ఆవేదన చుట్టూ విస్తరిస్తోందని వివరిస్తున్నారు.ఇలా మొదలైంది సీజేపీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఐఎస్ఏ వంటి విద్యార్థి సంఘాలు 2026 జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 28న వాంగ్‌చుక్ దీక్ష ప్రారంభించగా, జులై మధ్యలో బారికేడ్లు తొలగించి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం, దిప్కేపై సిరా దాడి ఘటన మీడియా దృష్టిని మరింత పెంచాయి.జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు 'సంసద్ చలో' పేరిట వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపు కవాతు చేపట్టగా, భద్రతా బారికేడ్లను దాటే యత్నం చేయడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో నిరసనకారులు, పోలీసులు స్వల్పంగా గాయపడగా, 10-15 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయలేదని అధికారులు తెలిపారు.రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలు పరీక్షల సమస్యలకు మించి రాజకీయ లక్ష్యాలతో సాగుతున్నాయని ఆరోపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ స్పందన, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి, మరిన్ని విద్యార్థి బృందాల భాగస్వామ్యంపైనే ఈ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల ఆగ్రహమే కారణంనీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకల వల్ల జీవితాలు నాశనమైన సాధారణ విద్యార్థులు, కుటుంబాలే ఈ జనప్రవాహానికి నిజమైన కారణం. నాయకుల పిలుపు కంటే మించి, వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన సామాన్యుల ఆగ్రహమే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. -
రుద్రమదేవిలా హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్‌కు అమ్మాయి
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్‌కు వస్తున్నారు. ఓ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసింది. ‘‘అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండటంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరూ తెలియరు. అయినా సరే... ఎలాగోలా ధైర్యం చేసి బయల్దేరాను. నాకు తెలుసు...’’ అని ఆమె వ్యాఖ్యానించింది.Many girls are coming solo to Jantar Mantar.She is from Hyderabad.@Cockroachisback pic.twitter.com/MvK7CWd4XE— 🪳Against Corruption (@akashuchani08) July 22, 2026ఒకరు ఎక్స్‌లో ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ... ‘‘ఈమె హైదరాబాద్‌కు చెందిన యువతి. ఈమె పేరు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన దిశ. దిశ ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ర్యాపిడో బైక్‌లో నేరుగా నిరసన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది.తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని దిశ తెలిపింది. ఢిల్లీ చేరిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ముందుగానే చెప్పి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్పలేదని తెలిపింది. అయితే తనకు నమ్మకమైన ఓ స్నేహితుడికి ప్రతి విషయం చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. దారిలో కలిసిన మంచి మనసున్న వారు ఆమెకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. దిశ రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ నేలపై పుట్టిన యువతి. తెలంగాణ మహిళలు ఒకప్పుడు తుపాకీ చేతబట్టి రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి ధైర్యసాహసాల సంప్రదాయం నుంచి వచ్చిన వారే వారు. దిశపై ఎంతో గర్వంగా ఉంది. మనందరి గొంతును ఆమె బలంగా వినిపిస్తుందనే నమ్మకం ఉంది. ముందుకు సాగు దిశ. ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని అందులో పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ఆందోళనలునీట్ యూజీ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రశ్నపత్రం లీక్ అంశంపై ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా సీజేపీ తన ఆందోళన కొనసాగిస్తోంది.దేశవ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన చేపడుతున్నామని సీజేపీ తెలిపింది. అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది. "సమావేశాల ముందు విద్యార్థుల డిమాండ్లను గట్టిగా చదవాలి. పోలీసుల దౌర్జన్యానికి గురైన వారికి సంఘీభావం ప్రకటించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై" అని ప్రకటనలో పేర్కొంది. "జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్" వంటి సానుకూల నినాదాలే ఇవ్వాలని, జరిగిన ప్రతిదాన్ని రికార్డు చేయాలని ఆందోళనకారులకు సూచించింది.ఏ పరిస్థితి ఎదురైనా శాంతియుతంగా, అహింసా మార్గంలోనే నిరసన కొనసాగించాలని సీజేపీ తెలిపింది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే ఉండాలని, అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే, పరువునష్టం కలిగించే, మత విద్వేషం రెచ్చగొట్టే లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. Found her name. She is Disha from Hyderabad. She reached Delhi. From the airport took a rapido and directly and reached the protest site. She is there with the protesting students.She says she is safe and absolutely fine. The moment she landed in Delhi, she called her… pic.twitter.com/R4FHNa8311— Revathi (@revathitweets) July 23, 2026 -
సీజేపీ నిరసనలకు మద్దతుగా అన్నా హజారే ‘మౌన ఆందోళన్’
ముంబై: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం మహారాష్ట్రలోని అహిల్యానగర్లో 2 గంటల పాటు మౌన ఆందోళన్ చేపట్టారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.ఉదయం 11 గంటలకు అహిల్యానగర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన మొదలుపెట్టి, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు. ఆ తర్వాత అదే జిల్లాలోని తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నా హజారే లేఖ రాసిన విషయం తెలిసిందే. "హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయి" అని అందులో పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా, సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పని తీరు మరింత జవాబుదారీతనంతో, సమర్థంగా మారుతుందని ఆయన చెప్పారు. నిరసనకారుల మాటలను ఓర్పుగా వినాలని, నమ్మకం పెంచే వాతావరణం కల్పించాలని, సానుకూల చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మౌన ఆందోళన్ తర్వాత విలేకరులతో మాట్లాడిన హజారే.. "ప్రజల సమస్యలు ప్రధానమంత్రికి తెలియాలి. అందుకే ఆయనకు లేఖ రాశాను" అని చెప్పారు.మరోవైపు, గురువారం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల కారణంగా సాయంత్రం 6.30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్‌లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.నిరసన ప్రాంతం బయట పూర్తిగా ధ్వంసమైన కారును ఢిల్లీ పోలీసులు ఉంచారని సీజేపీ ఆరోపించింది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ముందు అద్దం ఉన్న ఆ కారు దృశ్యాలు షేర్ చేస్తూ.. "ఈ కారును ఇక్కడికి ఈ స్థితిలో తీసుకొచ్చారు. తర్వాత శాంతియుత నిరసనకారులపై నెపం మోపకుండా ముందే నమోదు చేసుకోవాలి" అని పేర్కొంది. -
మళ్లీ వస్తే డ్రగ్స్ కేసు పెడ్తా.. CJP లీడర్స్ కు పోలీస్ వార్నింగ్
-
యూనిఫాంలో ఉన్నంత మాత్రాన..!
ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్‌గా మారింది.సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. -
‘టైం, ప్లేస్ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి కేంద్రం సీజేపీని చర్చలు ఆహ్వానించింది. మీ ఇష్టం. టైం, ప్లేస్ ఎక్కడో మీరే చెప్పండి అన్ని సమస్యల్ని చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన తక్షణ రాజీనామా, నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చలో సంసద్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసహరణపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ నేతలతో చర్చించేందుకు కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపాం. అన్నీ సమస్యలపై కేంద్రం వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు జరిపేందుకు సమయం, ప్లేస్ వాళ్లం ఇష్టం.ఈ చర్చల్లో నాతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం పాల్గొంటారు. ఈ చర్చలు జేపీ నడ్డా ఇల్లు, కార్యాలయంలో జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మాకు ఎలాంటి అహంభావం లేదు. చర్చల ద్వారా సమస్యల్ని క్రమంగా పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యల్లో ఇది ఒక భాగం. చర్చల్లో పాల్గొనాల్సిందిగా సీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. చర్చలు జరిపేందుకు కేంద్రం పంపుతున్న ఆహ్వానాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. మాతో చర్చలు జరపాలని అనుకుంటే కేంద్రమే మా వద్దకు రావాలి. మా డిమాండ్స్‌కు కట్టుబడాలి. అయితే, జంతర్‌మంతర్‌లో కేంద్రం మాతో చర్చలు జరపాలి. ఆ విషయంలో వెనక్కితగ్గబోమన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ మార్చికి పిలుపునిచ్చిన తరుణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ ప్రధాని మోదీ పేపర్ లీకేజీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై సత్వరమే విచారణ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. #WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon...This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa— ANI (@ANI) July 23, 2026 -
సీజేపీ నిరసనలపై ఉక్కుపాదం.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్‌కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్‌గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్ఎస్ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. -
గుజరాత్‌లోనూ నిరసనలు.. అహ్మదాబాద్‌లో ఆందోళనలు ఉధృతం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు గుజరాత్‌కూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు అహ్మదాబాద్‌లో నిరసనలకు దిగారు. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతా దృష్ట్యా అహ్మదాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.MUMBAI ❌️ DELHI ❌️ Now, visuals emerge from Ahmedabad, Gujarat — home of Modi and Shah. Students are protesting against a failed education system. 👇 pic.twitter.com/zxQaQC3QcP— Priya Purohit (@Priyaa_Purohit) July 23, 2026 ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీజేపీ నిరసనలు కొనసాగడం గమనార్హం. బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. The protest at Gujarat University in Ahmedabad remains ongoing, with students persisting in their demonstration despite considerable police mobilisation and the arrest of demonstrators.#StudentProtest #GujaratUniversity #NEETProtest #PoliceDetention #StudentVoice pic.twitter.com/BQTyKTp6au— Kumar R Talukdar🇮🇳 (@Kumarjyoti49291) July 22, 2026Ahmedabad, Gujarat 📍मोदी जी के गढ़ गुजरात में भी छात्र अब सड़को पर उत्तर आए हैं 🔥🔥 pic.twitter.com/KxbDWcd93L— Amit Mishra (@Amitjanhit) July 23, 2026 -
CJP చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
-
సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన, విద్యార్థుల సమస్యలను చట్టం, వ్యవస్థ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీ.. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో జరిగింది. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు.ఈ నేపథ్యంలో స్పందించిన అన్నా హజారే తన లేఖలో ప్రజాస్వామ్యంలో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అవసరం లేని బలప్రయోగానికి స్థానం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావించిన హజారే, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులపైనే బాధ్యత మోపడం సరికాదన్నారు. సంబంధిత శాఖకు రాజకీయ బాధ్యత వహించే మంత్రులు కూడా జవాబుదారీతనం చూపాలని సూచించారు. అవసరమైతే శాఖా వైఫల్యాలపై మంత్రిని తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని, బాధ్యతాయుత పాలనకు అది సంకేతంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.‘ప్రజాస్వామ్యంలో ఘర్షణ కంటే సంభాషణే ఉత్తమ మార్గం. ప్రజల గొంతును ప్రతిపక్ష స్వరంగా మాత్రమే చూడకూడదు. విభేదాలు సహజం. వాటిని చర్చలు, పరస్పర గౌరవంతో పరిష్కరించాలి’ అని హజారే లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ఆందోళనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. మరోవైపు లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని అన్నా హజారే మరోసారి విజ్ఞప్తి చేశారు. -
భద్రత కట్టుదిట్టం.. మెట్రో బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7:30 గంటల నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.ఇక, మెట్రో మూసివేత నిర్ణయం కారణంగా ప్రతిరోజూ మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే.తాత్కాలికంగా మూసివేస్తున్న మెట్రో స్టేషన్లు: లోక్ కల్యాణ్ మార్గ్ రాజీవ్ చౌక్ పటేల్ చౌక్ రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ బరఖంబా రోడ్ సుప్రీం కోర్ట్ సేవా తీర్థ్ జనపథ్ మండీ హౌస్ సెంట్రల్ సెక్రటేరియట్ ఐటీఓ ఢిల్లీ గేట్ ఇంద్రప్రస్థ ఖాన్ మార్కెట్ జోర్ బాగ్ శివాజీ స్టేడియం -
ఆసుపత్రి బెడ్‌పై నుంచే నిరాహార దీక్ష.. వాంగ్‌చుక్ గురించి కాదు..
నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో, ఇటు మధ్యప్రదేశ్‌లోని కేన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సామాజిక కార్యకర్త అమిత్ భట్నాగర్ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఒకరి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తే, మరొకరి ఉద్యమంలో బాధితులు మాత్రమే పాల్గొంటున్నారు. ఆ ఉద్యమం దేశ వ్యాప్తంగా మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు. అయినా ఆసుపత్రి మంచంపైనే అమిత్ భట్నాగర్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.కేన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అమిత్ భట్నాగర్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి దాదాపు 6 ఏళ్లుగా అమిత్ భట్నాగర్ నాయకత్వం వహిస్తున్నారు. కేన్–బేత్వా ప్రాజెక్టు భారతదేశంలో అమలులోకి వచ్చిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.44,000 కోట్లకు పైగా ఉంది. కేన్ నది నుంచి బేత్వా నదికి నీటిని మళ్లించి బుందేల్‌ఖండ్‌లో నీటి కొరత తగ్గించడమే లక్ష్యం. 10 లక్షల హెక్టార్లకు పైగా సాగునీరు అందించాలనే ప్రణాళిక ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్లాది మందికి తాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఉద్యమం ఎందుకు?మరోవైపు వేలాది కుటుంబాల్లోని వారు నిర్వాసితులు అవుతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దౌధన్ ఆనకట్ట వల్ల సుమారు 25,000 మంది, దాదాపు 10,000 కుటుంబాలు ప్రభావితమవుతాయని అంచనా. అనేక గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని బాధితులు చెబుతున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఆధారంగా జీవించే గిరిజన కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పన్నా పులుల అభయారణ్యంపై కూడా ఈ ప్రాజెక్టు ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.అమిత్ భట్నాగర్ డిమాండ్లు అర్హులైన చాలా కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని అమిత్ భట్నాగర్ ఆరోపించారు. అసలు ప్రభావితులు కాని కొందరికి పరిహారం చెల్లించారని కూడా ఆయన అంటున్నారు. గ్రామసభ ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయని, భూసేకరణ పారదర్శకంగా జరగలేదని ఆయన ఆరోపించారు. పరిహారంలో దాదాపు రూ.400 కోట్ల అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు.అధికారులు ఏమంటున్నారు?ఈ ఆరోపణలన్నింటినీ జిల్లా యంత్రాంగం నిరాధారమని ఖండించింది. చట్టప్రకారమే పునరావాసం, పరిహారం అందిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరాహార దీక్షలో అమిత్ భట్నాగర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. అర్ధరాత్రి పోలీసులు ఉద్యమ స్థలాన్ని ఖాళీ చేయించి నిరసనను నిలిపివేశారని కార్యకర్తలు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, జీవనోపాధి, అటవీ హక్కులు కోల్పోకుండా న్యాయమైన పునరావాసం, పారదర్శక పరిహారం కల్పించాలనే డిమాండ్ ఈ ఉద్యమం ప్రధాన అంశంగా మారింది. -
ఇది పబ్లిసిటీ అని మీరు ఎలా చెప్పగలరు?
ఢిల్లీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్‌మంతర్‌లో లాఠీఛార్జ్‌పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సీజేపీ నిరసన వీడియోలు భద్రపర్చాలని ఆదేశించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ల వేశారన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. పబ్లిసిటీ అని ఎలా అంటారు? అంటూ ప్రశ్నించింది. సీజేపీ నిరసనకారులపై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. సీసీ టీవీ, ఇతర వీడియో ఫుటేజీ సహా అవసరమైన రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు కోర్టు వాయిదా వేసింది.విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు-ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏఎస్జీ ఎస్.రాజు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని.. వారి మర్మంగాలపై దాడులు చేశారని.. మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని, పోలీసుల వద్ద నేమ్బేడ్జీలు కూడా లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తమ ఆరోపణలను రుజువు చేసేలా 110 వీడియోలు ఉన్నాయని తెలిపారు.అయితే, ఏఎస్జీ రాజు ఈ వాదనలను ఖండిస్తూ... నిరసనకారులు తీవ్ర హింసాత్మకంగా ప్రవర్తించారని పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పిటిషన్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం పబ్లిసిటీ పొందేందుకే వేశారని వ్యాఖ్యానించారు. అయితే, చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యను ప్రశ్నిస్తూ... "ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటూ నిలదీసింది.విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్లు ఎన్.హరిహరన్, వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. నిరసనకారులు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులనే ఉపయోగించుకున్నారని తెలిపారు. -
'సర్, మీ ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగాలి'
న్యూఢిల్లీ: విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును బాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఖండించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న యువతను దౌర్జన్యంగా అణచివేయాలని చూడడం సమంజసం కాదని హితవు పలికారు. పంతాలకు పోకుండా ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని మోదీ సర్కారుకు సూచించారు. పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌ను తప్పుబట్టారు. ఈ మేరకు ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు.'వినాశకాలే విపరీత బుద్ధి'... సర్, మీ ప్రభుత్వానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచి బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాను. దయ్యచేసి విద్యార్థుల పోరాటాన్ని ఇగో సమస్యగా చూడకండి. జెన్ జెడ్/సీజేపీ చట్టబద్ధమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోండి. ప్రభుత్వానికి గానీ, యువతరానికి గానీ ఏమాత్రం మేలు చేయని, మీకు అత్యంత విధేయులైన మీ ప్రతినిధులు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను నియంత్రించండి.నిరసన తెలిపే హక్కు, డిమాండ్ చేసే హక్కును కాపాడాలి. లాఠీచార్జి, దౌర్జన్యాలతో వాక్ స్వేచ్ఛను హరించకూడదు. పోరాటం చేస్తున్నవారంతా మన సమాజానికి చెందిన ప్రజలే. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? 'వారి' డిమాండ్లు నెరవేరనిదే ప్రభుత్వం పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట కూడా విజయం సాధించకపోవచ్చు. మన శాంతియుత నిరసనకారులను, మద్దతుదారులను దేవుడు ఆశీర్వదించుగాక. జై హింద్!'' అంటూ శత్రుఘ్న సిన్హా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.నాకు కోపం వస్తోంది: నసీరుద్దీన్ షాఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు వ్యహరించిన తీరుపై సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాఘత ఫలితాన్ని ఏదో ఒకరోజు వారు కూడా కచ్చితంగా అనుభవిస్తారని శపించారు. విద్యార్థులకు పోరాటానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు.చదవండి: డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్''అమెరికా ఐసీఈ ఏజెంట్లను తలపించేలా, ముసుగులు ధరించి లాఠీలు పట్టుకున్న ఆ దుండగులు మన పిల్లలను క్రూరంగా హింసిస్తుండటం చూసి, ప్రస్తుతం నా గుండె బరువెక్కింది, నాకు తీవ్రమైన కోపం వస్తోంది. అప్పుడప్పుడు మీ పిల్లల గురించి ఆలోచించండి, అలాగే ఒకరోజు మీకు కూడా అదే గతి పడుతుందని గుర్తుంచుకోండి” అని నసీరుద్దీన్ షా అన్నారు.మీకు అండగా మేముంటాంన్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న యువతకు చాలా మంది ప్రజల సానుభూతి ఉందన్నారు షా. విద్యార్థుల పోరాటానికి ఎంతో మంది అండదండలు ఉన్నాయని, పోరాటం కొనసాగించాలన్నారు. దేశ యువతపై తనకు ఎప్పుడూ ఆశ ఉండేదని, అది ఇప్పుడు మరింత ద్విగుణీకృతం అయిందని పేర్కొన్నారు. మీరు మీ పోరాటాన్ని కొనసాగించండి, మేము మీకు అండగా ఉంటామని నసీరుద్దీన్ షా భరోసా ఇచ్చారు. -
10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్.. వారిలో ఒక్కరికీ శిక్షపడలేదు
-
నిరాహారదీక్ష విరమణపై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని స్పష్టమైన హామీ ఇస్తే నిరాహారదీక్ష విరమిస్తానని తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు లేఖ రాసి సోనమ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘నిన్న రాత్రి ఆసుపత్రికి వచ్చి నన్ను కలిసినందుకు, నా నిరాహార దీక్షను విరమించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసినందుకు ధన్యవాదాలు. మన చర్చ సందర్భంగా ఈ కింది అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మీరు నాకు హామీ ఇచ్చారు.ప్రశ్నపత్రం లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా పరిశీలిస్తూ, జవాబుదారీతనం నిర్ధారించేలా పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరపాలి. 2026 జులై 20న జరిగిన "చలో సంసద్" ర్యాలీ.. పోలీసులు అమానుషంగా వ్యవహరించినా, అధిక బలప్రయోగం చేసినా ప్రశాంతంగానే సాగింది. నిరసనకారుల సహనం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలన్న అంకితభావాన్ని దేశం, ప్రపంచం చూసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, ప్రతీకార చర్యలకు దిగడం వంటివి చేయొద్దు. ప్రజాస్వామ్య సంస్థలపై వారి నమ్మకం దెబ్బతినకూడదని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.మీరు నన్ను కలిసిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది పార్లమెంట్ సభ్యులు నాకు లేఖలు రాశారు. కొందరు ఇప్పటికే వచ్చి కలిశారు. మరికొందరు ఈ సాయంత్రం రానున్నారు. దేశ సేవలో నేను ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని గుర్తుచేస్తూ, నిరాహార దీక్షను విరమించాలని వారంతా కోరారు. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నేను జీవించాలనుకుంటున్నాను. నా విద్యార్థుల వద్దకు, విద్యా రంగంలోకి, నా జీవితాన్ని అంకితం చేసిన పనిలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. అయితే, ఈ ఉద్యమం ప్రారంభానికి కారణమైన యువత ప్రయోజనాలను పక్కనపెట్టి అలా చేయలేను.అందువల్ల, ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు, ప్రతీకార చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. న్యాయమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతూ తమ గొంతు వినిపించడమే వారు చేసిన ఏకైక "తప్పు".అలాంటి హామీ వస్తే, ప్రభుత్వం నా విజ్ఞప్తినే కాదు, లక్షలాది మంది భారత యువత ఆకాంక్షలను కూడా ఆలకించిందన్న నమ్మకంతో నా నిరాహార దీక్షను విరమిస్తాను. అలాంటి హామీ రాకపోతే, నిరవధికంగా నా నిరాహార దీక్షను కొనసాగించక తప్పదు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఇకపై పోలీసులు అధిక బలప్రయోగం చేయరని కూడా ఆశిస్తున్నాను.మన ప్రజాస్వామ్య భవిష్యత్తు, తనతో ఏకీభవించే వారితో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఆధారపడదు. ధైర్యం, ఆశ, దృఢ విశ్వాసంతో మాట్లాడే యువ పౌరులతో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. -
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు
న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్‌లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.3 డిమాండ్లు కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. "అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్‌లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్‌కు దాదాపు సమానం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు. -
అమిత్ షా నివాసంలో కీలక భేటీ
-
కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయాలు
న్యూఢిల్లీ: కాక్రోచ్లు కొనసాగిస్తున్న ఉద్యమం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బుధవారం తెలిపింది. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేసింది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే బుధవారం మాట్లాడుతూ.. 25 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను వాంగ్‌చుక్ ఇక విరమించాలని కోరారు. పరీక్షల సంస్కరణల కోసం చేస్తున్న ఈ ఉద్యమం ఏ మాత్రమూ బలహీనపడబోదని చెప్పారు."వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షను విరమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి ఆయన అవసరం. ఆయన జీవితం ఎంతో విలువైనది. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన మా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుంది" అని దిప్కే తెలిపారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో సీజేపీ తన విజ్ఞప్తిని మరోసారి వెల్లడించింది. "సోనం సర్‌కు సీజేపీ విజ్ఞప్తి. మీ త్యాగం ఒక తరం యువతకు స్ఫూర్తినిచ్చింది. దయచేసి మీ నిరాహార దీక్షను విరమించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పరీక్షల్లో న్యాయం జరిగే వరకు, మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం" అని పేర్కొంది.మెదాంత ఆసుపత్రికి ఎంపీలు! వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించేలా ఒప్పించేందుకు ప్రతిపక్ష ఎంపీల బృందం గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన వేళ ఈ విజ్ఞప్తి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ వాంగ్చుక్ను కలిసి, పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, విద్యా రంగంలో జవాబుదారీతనం అంశాలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వనున్నారు.పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇస్తే తాను నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ ఇప్పటికే చెప్పారు. అయితే, సీజేపీ చేపట్టిన "సంసద్ చలో" ర్యాలీపై ఢిల్లీలో పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత, హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జవాబుదారీతనం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వాంగ్‌చుక్ జూన్ 28న జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలో చేరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల తర్వాత ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నపత్రం లీక్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మరింత పెంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించింది. విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను కూడా పార్టీ ఖండించింది. పరీక్షల సంస్కరణలు కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపింది.జేపీ నడ్డా నివాసానికి మేము రాముసీజేపీ బుధవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లి సమావేశం కావడానికి నిరాకరించింది. విద్యార్థులు, నిరసనకారులు లేవనెత్తిన అంశాలపై చర్చించాలంటే మంత్రులే ప్రజా న్యాయస్థానానికి రావాలని పార్టీ తెలిపింది.సీజేపీ కార్యకర్త సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ఎలాంటి చర్చ అయినా జంతర్ మంతర్‌లోని "ప్రజల న్యాయస్థానం"లోనే జరగాలని స్పష్టం చేశారు. బీజేపీ నేత జేపీ నడ్డా నివాసంలో చర్చలు జరపాలన్న ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, "మళ్లీ తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. మేము నేరుగా తిరస్కరించాం. ప్రజల న్యాయస్థానం ఇక్కడే ఉంది. మంత్రులే ప్రజల మధ్యకు రావాలి" అని దాస్ చెప్పారు.We request @Wangchuk66 sir to end his hunger strike. The country needs him, and his life is far too precious to be put at further risk.The peaceful protest at Jantar Mantar will continue until our demands are met. pic.twitter.com/rCfygpuCH6— Abhijeet Dipke (@abhijeet_dipke) July 22, 2026 -
LIVE: రణరంగంగా ఢిల్లీ..! హై అలర్ట్
-
కాక్రోచ్ జనతా పార్టీపై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
-
కాక్రోచ్ పార్టీకి ఊహించని మద్దతు.. ప్రత్యర్థుల్లో టెన్షన్!
-
సీజేపీ ఆందోళన.. కత్రినా కైఫ్ మీద ఈ విమర్శలేంటి?
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయమై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులే పోరాడుతుండగా తాజాగా ప్రతిపక్షాలు కూడా వీళ్లతో కలిసి చేరాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి బాలీవుడ్ నటీనటులు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, సోనూసూద్, సోనాక్షి సిన్హా తదితరులు తమ సంఘీభావం తెలిపారు. అయితే దీనికి ఏ మాత్రం సంబంధం లేని కత్రినా కైఫ్ మీద ఇప్పుడు పలువురు విమర్శలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్‌తో కత్రినా.. సందీప్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు?)కత్రినా కైఫ్ అభిమాని ఒకరు 'కేథలిక్ ఫ్యాన్స్' అని ఓ ఫ్యాన్ పేజీ రన్ చేస్తున్నాడు. దీనికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ పేజీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సదరు పేజీ అడ్మిన్ ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి కత్రినాకు అభిమానినని, అలాంటిది భారతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక అంశంపై ఆమె స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సదరు అడ్మిన్ వెల్లడించాడు.మేము మీకు కష్టకాలంలో అండగా నిలిచాం. కానీ భారతీయుల కోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకు లేదు. అందుకే మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా. ఈ ఫ్యాన్పేజీని కూడా మూసివేస్తున్నా అని సదరు అడ్మిన్ పేర్కొన్నాడు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు సదరు పేజీ అడ్మిన్‌కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం కత్రినాకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే, స్పందించకపోయే హక్కు కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై సెలబ్రిటీలు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్) -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్లు మూసివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా కారణాలతో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్‌పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. భద్రతా పరిస్థితుల ఆధారంగా స్టేషన్ల పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని DMRC వెల్లడించింది. Delhi Metro stations -Lok Kalyan Marg, Rajiv Chowk, Patel Chowk, Ramakrishna Ashram Marg, Barakhambha Road, Supreme Court, Seva Teerth, Janpath, Mandi House, Central Secretariat, ITO, Delhi Gate, Indraprastha, Khan Market, Jor Bagh and Shivaji Stadium are closed till further… pic.twitter.com/PXLPuJTP2r— ANI (@ANI) July 22, 2026 -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించి అప్డేట్స్.. -
భీమ్ ఆర్మీ టికెట్‌పై అభిజీత్ దిప్కే పోటీ?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోస్యం చెప్పారు. ఆయన భీమ్ ఆర్మీ టికెట్‌పై రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజా ఉద్యమం నుంచి రాజకీయ నాయకులు ఉద్భవిస్తారని, జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, అన్నా హజారే ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు.నీట్-యూజీ పేపర్ లీక్ సహా వివిధ సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు దిప్కే నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ భవన సముదాయంలో దూబే మీడియాతో మాట్లాడుతూ, సీజేపీ ఆందోళనల్లో నినాదాలు చేస్తున్న చాలామంది భీమ్ ఆర్మీతో పాటు గతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారేనని ఆరోపించారు. ఈ నిరసన వెనుక నిర్దిష్ట రాజకీయ అజెండా ఉందని ఆయన విమర్శించారు.మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘చలో సంసద్’ మార్చ్‌పై స్పందిస్తూ ఈ ఉద్యమం పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కోరుకుంటోందని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై దూబే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్‌చుక్ వరకు.. -
అదే వేదిక.. అదే పోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తమ డిమాండ్ల సాధనకు బయల్దేరిన వేలాది మంది కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక, విద్యావేత్తలను లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో చెదరగొట్టి, జంతర్‌మంతర్ వద్ద దీక్షాస్థలిని తొలగించినా ఉద్యమకారులు మళ్లీ మొదటి నుంచి తమ ఉద్యమాన్ని ఆరంభించారు. సోమవారం సాయంత్రం కార్యకర్తలందరినీ దీక్షాస్థలి నుంచి తరిమికొట్టినా మంగళవారం మధ్యాహ్నంకల్లా అందరూ మళ్లీ అదే దీక్షాస్థలికి వచ్చి నిరసనను మొదలెట్టారు. ‘‘పోలీసుల దాష్టికం చూశాక ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం కంటే ఎక్కువ మంది ఈరోజు దీక్షాస్థలికి చేరుకున్నారు. డజన్ల మంది విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనిని వృథాగా పోనివ్వం.మా డిమాండ్లు నెరవేరేదాకా పోరాడతాం’’ అని ఉద్యమకారులు పునరుద్ఘాటించారు. నిరసన కార్యక్రమం మంగళవారం 32వ రోజుకు చేరిన సందర్భంగా జంతర్‌మంతర్‌లో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రసంగించారు. ‘‘సోమవారం చర్చల పేరిట మోదీ సర్కార్ మా సమయాన్ని వృథాచేసింది. కుట్రప్రకారం మా ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్‌లను ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నివాసానికి పిలిపించి అక్కడ వారిని నిలువరించారు. వాళ్ల మొబైల్స్ లాక్కున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు వీధుల్లో విద్యార్థులను తలలు పగలగొట్టారు’’అని దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు.లాఠీచార్జ్, అణచివేతతో తమ ఐక్యతను పోలీసులు చెదరగొట్టలేరని దీప్కే అన్నారు. ఆస్పత్రిలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో సీజేపీ కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకున్నారు. వాంగ్‌చుక్ దీక్షకు గుర్తుగా జంతర్‌మంతర్ వద్ద ఆయన చిత్రపటాన్ని, రాజ్యాంగ ప్రతి, చర్కాను పెట్టారు. సీజేపీ నుంచి విజేత దహియా బయటకు.. సోమవారం పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వేళ ప్రతిఘటించాల్సిందిపోయి జంతర్‌మంతర్ వద్ద తాపీగా బర్గర్ తింటూ కన్పించిన పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను సీజేపీ బయటకు పంపేసింది. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీజేపీ మంగళవారం ప్రకటించింది. దహియా సోమవారం బర్గర్ తింటున్న వీడియో బయటకు రావడంతో పలువురు నిరసనకారులు ఆయన నిబద్ధతను ప్రశ్నించారు. దీనిపై దహియా స్పందించారు. ‘‘రెండ్రోజులుగా అందరిలా రోడ్లపై నిద్రలేని రాత్రులు గడిపా. ఆకలేసి బర్గర్ తినడం కూడా తప్పేనా?’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. గాయాలతో వెంటిలేటర్‌పై విద్యార్థినిన్యూఢిల్లీ: చలో సంసద్ సందర్భంగా సోమ వారం పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన 23 ఏళ్ల విద్యార్థిని సాక్షి ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బాష్పవాయువు ప్రయోగం తర్వాత నిరసనకారులు పరుగులు తీయడంతో ఏర్పడిన తొక్కిసలాట వంటి పరిస్థితుల్లో ఆ యువతి ఊపిరి ఆడక ఇబ్బంది పడినట్లు భావిస్తున్నారు.ఆమె ముఖం, ఛాతీ, మెడ భాగాల్లో గాయాలైనట్లు సాక్షి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. నిరసన జరిగిన సమయంలో ఆ యువతి తన బంధువుతో కలిసి అక్కడే ఉంది. ఆమె బంధువు కాలికి కూడా గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి సాక్షి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు అభ్యసిస్తోంది. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. -
నిరసన స్వరాలు వింటారా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని. పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. -
చలో సంసద్.. షాక్‌లో కాక్రోచ్ జనతా పార్టీ!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించారు. దీంతో సీజేపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మంగళవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా జనసమూహం రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా ఢిల్లీలోని ఓ బర్గర్ అవుట్‌లెట్‌లో బర్గర్ కొనుగోలు చేసి కారులో కూర్చొని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న వేళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని వీడియోల్లో అతన్ని కొందరు నిలదీస్తూ, నిరసనకు మద్దతుగా నిలవకుండా బర్గర్ ఎందుకు తింటున్నారని ప్రశ్నించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై స్పందించిన అభిజిత్ దీప్కే, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. जंतर मंतर पर कल छात्र लाठियां खा रहे थे, उसी वक्त CJP प्रवक्ता विजेता दहिया मॉल में जाकर बर्गर खा रहा था !! pic.twitter.com/D75L0hJlZL— Sachin Gupta (@Sachingupta) July 21, 2026 విమర్శలపై స్పందించిన విజేత దహియా మాత్రం తాను నిరసన కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నానని, అది ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లానని తెలిపారు. రెండు రోజులుగా ఉద్యమ కార్యక్రమాలతో నిద్ర లేకుండా పనిచేశానని, ఇంటికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆహారం తీసుకున్నానని చెప్పారు. బర్గర్ తినడంలో తప్పేముంది? ఆకలి వేసింది కాబట్టి తిన్నాను. దేశం కోసం ఉద్యమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు’అని ఆమె పేర్కొన్నారు.కాగా, ట్రాన్స్జెండర్లపై చేసిన వ్యాఖ్యలు, మహిళల రాజకీయ అవగాహనపై చేసిన వ్యాఖ్యల కారణంగా విజేత దహియా గతంలోనూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమం సందర్భంగా వైరల్ అయిన వీడియోలతో దహియా వివాదం మరింత ముదిరి, చివరకు పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించింది. -
రాహుల్ గాంధీ ధర్నాపై కేంద్ర సర్కారు సమాధానం ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో ఎంపీ రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడిన విషయం తెలిసిందే. లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకుని రాహుల్ గాంధీతో ఆయన చర్చించారు. ఆ సమయంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడే ఉన్నారు.దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ... "కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు ఉన్న సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తమ మద్దతుదారులతో కలిసి అక్బర్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నట్టు తెలిసింది.ఈ సీనియర్ ప్రతినిధి బృందానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారితో చర్చించేందుకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి నన్ను ప్రభుత్వం స్వయంగా అక్కడికి పంపింది. ఆ ప్రదేశం ధర్నాలకు అనువైనది కాదని, అక్కడ ధర్నా చేయడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెబుతూ, ధర్నాను విరమించాలని రాహుల్ గాంధీని కోరాం.ప్రభుత్వం నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు అంగీకరిస్తే తాను వెంటనే ధర్నా విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. కొన్ని క్షణాల్లోనే ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత, ఆయన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని, నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాం.ఈ సమాచారం రాహుల్ గాంధీకి తెలియజేయగానే, దీనికే తాను అంగీకరించనని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని హామీ ఇవ్వాలని కూడా కోరారు. ఇప్పుడు తనకు రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి పార్లమెంట్లో చర్చ, రెండోది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని చెప్పారు.ఇంతకుముందు చర్చ మాత్రమే కోరారని గుర్తు చేయగా, ఇప్పుడు తన డిమాండ్లు మారాయని చెప్పారు. ఇంత త్వరగా మాట మార్చడం తనలాంటి సీనియర్ నేతకు తగదని వినయంగా వివరించే ప్రయత్నం చేయగా, అది తన ప్రత్యేక హక్కు అని చెప్పారు.ఈ ప్రదేశం ధర్నాకు అనువైనది కాదని హోం కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా, తాను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవడం కూడా తన ప్రత్యేక హక్కేనని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ లాంటి సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు తన మాట నుంచి వెనక్కి తగ్గడం దురదృష్టకరం. అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధం.నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి భిన్నంగా, ఈ తీవ్రమైన అంశంపై నిబంధనల ప్రకారం అధికారిక చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు" అని జితేంద్ర సింగ్ తెలిపారు. -
రాహుల్ గాంధీ, ప్రియాంక సహా కీలక నేతలు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని చుట్టుముట్టి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.కేంద్రం ముందుకు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి, నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలి, నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించాలి. ఈ ఐదు డిమాండ్లపై హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో ఆయా నేతలందరినీ అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. రాహుల్ ముక్కులో నుంచి రక్తం?రాహుల్ గాంధీని బలవంతంగా తరలించే సమయంలో ముక్కులో నుంచి రక్తం వచ్చిందని ఎన్డీటీవీ పేర్కొంది. పోలీసులు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చుని.. అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించగా, దాదాపు 10 మంది పోలీసు సిబ్బంది ఆయనను చుట్టుముట్టారు. చివరకు ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ముక్కు నుంచి రక్తం కారుతున్నట్టు కనిపించింది.కాగా, కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరిగిన తదుపరిరోజే కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వైపు నిరసన చేపట్టడం గమనార్హం. రాహుల్ గాంధీ రాత్రంతా ప్రధాని నివాసం బయటే నిరసన కొనసాగిస్తారని సమాచారం వచ్చినా.. సాయంత్రం 6.40 గంటలకు పోలీసులు ప్రవేశించి ధర్నాను భగ్నం చేశారు. राहुल गांधी के साथ नरेंद्र मोदी का यह बर्ताव ठीक नहीं है।Rahul gandhi Prime Minister Narendra Modi #RahulGandhi pic.twitter.com/Yq4dWSBNOR— Neeraj Bhawani (@Neeraj_Bhawanii) July 21, 2026 Delhi: Pictures of Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg being detained by Delhi Police.(ANI photos by Naveen Sharma) pic.twitter.com/Y9mSANwbdt— ANI (@ANI) July 21, 2026 -
సీజేపీ ప్రొటెస్ట్‌లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్‌లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్‌పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్
-
మరోసారి పార్లమెంట్ ను ముట్టడించనున్న CJP నేతలు
-
‘‘ఆ ఫొటోలో ఉన్నది నా కూతురు.. ఆమె గొంతుకగా నిలుస్తా’’
కార్గిల్ యుద్ధ వీరుడు రాజేశ్ మాల్‌కు తన కూతురు కెరీర్లో బాగా రాణించాలన్న ఆశ ఉండేది. కానీ గత నెల ఆయన కల ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్న ఆయన 23 ఏళ్ల కూతురు, నీట్ అభ్యర్థిని రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తల్లిదండ్రులకు "ఐ లవ్ యూ" అని మాత్రమే రాసి లేఖను పెట్టింది.ఆ ఘటన తర్వాత తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని రాజేశ్ మాల్ పోరాటం చేస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదని పీక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు."ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే నిరసనలు ఎక్కడ జరిగినా నా కూతురు ఫొటోను తీసుకెళ్తాను. వారు విన్నా వినకపోయినా నా కూతురి గొంతుకగా నేనే నిలుస్తా" అని ఆయన చెప్పారు.రాజేశ్ మాల్ 1999 కార్గిల్ యుద్ధ వీరుడు. ఆయన ఉత్తరాఖండ్‌కు చెందినవారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు జరిగిన సీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన కూతురు రియా కుమారి థాపా, డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల నీట్ అభ్యర్థిని. ఆమె జూన్‌లో ఆత్మహత్య చేసుకుంది.తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని, ఆమె విషాద గాథను రాజకీయ నాయకులతో ఒకే వేదికపై పంచుకుంటూ న్యాయం కోరుతున్నారు. ఈ నెల ప్రారంభంలో జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు.విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని రాజేశ్ మాల్ నిరాశ వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడమే అత్యంత విషాదకరం" అని అన్నారు. సోమవారం వేలాది మంది పాల్గొన్న నిరసన, తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరికీ నివాళి అని చెప్పారు. ఆమె కూతురి ఫొటో నిరసన ప్రదర్శన వద్ద ఉంది. ఆ ఫొటోలో ఉన్నది తన కూతురేనని అన్నారు."ప్రభుత్వం వినకపోయినా ఇంతమంది నిరసనకు రావడం గొప్ప విషయం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. బహుశా దేశం మేల్కొంటుంది. బహుశా ఆయన (ధర్మేంద్ర ప్రధాన్) రాజీనామా చేస్తారు" అని అన్నారు.ఇంట్లో రియా ఆత్మహత్య రియా జూన్ 16న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో ఆత్మహత్య లేఖ దొరికింది. "ఐ లవ్ యూ మమ్మీ, పాపా. ఎవరి తప్పూ లేదు" అని ఆమె హిందీలో రాసినట్టు సమాచారం.చదువులో ఆశించిన విజయం రాకపోవడం వల్ల కలిగిన నిరాశే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ కందారి తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) మే 3న జరిగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష రద్దైంది. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. పలువురు నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంట్ ముట్టడి ర్యాలీ చేపట్టడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని మధ్య ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. View this post on Instagram A post shared by PEEK TV (@peektv_in) -
సీజేపీ నిరసన పునః ప్రారంభం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిన్న సోమవారం రాత్రి 10:30 గంటలకు తిరిగి ప్రారంభించింది. యాథావిధిగా తమ వేదికను ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తుంది. కాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్లమెంటుకు నిర్వహించిన మార్చ్ సందర్భంగా, నిరసనకారులకు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు సాయంత్రం 5 గంటలకు జంతర్ మంతర్‌ను ఖాళీ చేయించారు.సీజేపీ ఆందోళన హింసాత్మకంకాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసన కారుల దాడుల్లో ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని 20కి వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు.నిరసనలు ఎందుకు? దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందనే నెపంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని ప్రభుత్వం చేసిన "అపహరణ"గా భావించిన యువత, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని నిరసనను ఉధృతం చేశారు. -
చలో సంసద్.. రణరంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్‌లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.మా డిమాండ్లు నెరవేర్చండి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీక్ష కొనసాగిస్తా వాంగ్‌చుక్ సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్‌కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్‌చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.దీప్కేను నిర్బంధించిన పోలీసులు! దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్‌మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. -
అప్పటివరకు నా నిరాహార దీక్ష కొనసాగుతుంది: వాంగ్‌చుక్
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని ఆయన ఎక్స్‌లో తెలిపారు. "శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై క్రూరత్వాన్ని చూపుతున్నారు. యువ నాయకులకు సంసత్ భవన్లో పార్లమెంట్ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చే వరకు, లేక ఇక్కడ ఆసుపత్రిలో నేను వారిని కలిసే అవకాశం వచ్చే వరకు నా నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అంతకంటే ముందే విద్యాశాఖ మంత్రిని బాధ్యుడిగా నిర్ధారిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించేందుకు, విద్యార్థులు తమ ఫిర్యాదులు, డిమాండ్లు పార్లమెంట్ సభ్యుల ముందు ఈ రోజు లేదా రేపు చెప్పే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసు బలగాలను కోరుతున్నాను. ఈ రోజు చూపిన ఓర్పు, సహనాన్నే యువ నిరసనకారులు రేపూ చూపుతారని నా నమ్మకం" అని చెప్పారు. జులై 20 ఉదయం సోనం వాంగ్‌చుక్ ఒక ప్రకటన విడుదల చేసి, ఈ రోజు 3 షరతుల్లో ఏదైనా నెరవేరితే తన నిరాహార దీక్షను విరమిస్తానని తెలిపారు. పరిస్థితులు మారకపోవడంతో దీక్ష ముగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.కేరళ హౌస్ సమీపంలో నిరసనసెంట్రల్ ఢిల్లీలోని కేరళ హౌస్ సమీపంలో ధర్నా కొనసాగుతోందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. "అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, గీతాంజలి జంతర్ మంతర్‌లో ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు కేరళ హౌస్ ముందు ఉన్నారు" అని సీజేపీ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ముగించారు. 23 రోజులుగా దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమిస్తున్నట్లు సోమవారం(జూలై 20వ తేదీ) సాయంత్రం ప్రకటించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చల తర్వాత వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు.అంతకుముందు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేసేనాటికి 21 రోజులు పూర్తవ్వగా, ఆపై ఆయనను ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో సైతం వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. మరొకవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్రమంత్రితో చర్చల అనంతరం వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. ఒక్కటి నెరవేర్చినా..తాను ఈరోజు ఢిల్లీలో దీక్షను విరమిస్తానని ముందుగానే చెప్పారు వాంగ్‌చుక్. తన విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్ష విరమిస్తానన్నారు. నీట్-యూజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలా కాని పక్షంలో డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీలకు సమర్పించేందుకు పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. -
కాక్రోచ్ పార్టీ నేతలతో జేపీ నడ్డా చర్చలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నడ్డాకు సీజేపీ విజ్ఞాపన పత్రాన్ని అందించింది. జేపీ నడ్డాను కలిసిన వారిలో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఉన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, లేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీలో 'చలో సంసద్' ర్యాలీ జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులతో భేటీ కావడం గమనార్హం. తమ డిమాండ్ల జాబితాను లిఖితపూర్వకంగా అందించామని, స్పందించే ముందు బీజేపీ నాయకత్వంతో చర్చించేందుకు సమయం కోరారని సీజేపీ నేతలు చెప్పారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య జరిగిన తొలి అధికారిక చర్చ ఇదే.ఈ భేటీ జరుగుతున్న సమయంలో వేలాది మంది సీజేపీ మద్దతుదారులు పరీక్షల సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టారు. ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు, బ్యారికేడ్లు, లాఠీచార్జ్, అరెస్టులు, ట్రాఫిక్ అంతరాయాలు చోటుచేసుకున్నాయి.సౌరవ్ దాస్ ఏమన్నారు? "కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నేను, ఆశుతోష్ రంకా జేపీ నడ్డాను కలిసేందుకు వెళ్తున్నాం. ఈ ఉదయం చర్చల కోసం ప్రభుత్వం సంప్రదించింది. మా డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. భారీ సంఖ్యలో యువత ఒక్కటయ్యారు" అని దాస్ ఎక్స్‌లో సోమవారం చర్చలు జరగకముందు పేర్కొన్నారు.భేటీ తర్వాత దాస్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రిని కలిసే ముందు ఇద్దరమూ 2 గంటలకు పైగా వేచి చూశామని, చివరకు దాదాపు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించిందని చెప్పారు.డిమాండ్లు ఇవేసీజేపీ డిమాండ్లను వివరించే లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశామని దాస్ చెప్పారు. "మా డిమాండ్లతో లిఖితపూర్వక లేఖను అందించాం. ఈలోపు అంతర్గతంగా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది" అని దాస్ తెలిపారు.తర్వాత రంకా మాట్లాడుతూ.. చర్చలు కొనసాగుతుండడంతో తాను, దాస్ ఇంకా నడ్డా నివాసంలోనే ఉన్నామని చెప్పారు. పార్టీ ప్రధాన డిమాండ్లపై బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరపాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి మరింత సమయం కోరారని రంకా చెప్పారు. ఆ డిమాండ్లలో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న అందరు నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడం ఉన్నాయి. -
కాక్రోచ్ నిరసనతో దద్దరిల్లిన ఢిల్లీ
-
‘నన్ను వదిలేయండి.. సీజేపీ ఆందోళనకు వెళ్తా’
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పారామీటర్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. గత 21 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, కార్యకర్తలు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసురుతూ ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. -
నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన చలో సంసద్ ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వైపు దూసుకువచ్చిన సీజేపీ కార్యకర్తలను భద్రతా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించి, లాఠిచార్జి చేసి చెదరగొట్టాయి. దీంతో పార్లమెంట్ సమీపంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఉద్విగ్న పరిస్థితులు కనిపించాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహారదీక్ష విరమించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఐసా విద్యార్థి నాయకులు నేహా, మనీష్, అమీన్ కూడా తమ దీక్షలకు ముగింపు పలికారు. వీరితో బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజారామ్ పాల్, సీపీఎం ఎంపీ అమ్రారామ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ దీక్షలు విరమింపజేశారు. నిరాహారదీక్ష ముగిసినా సీజేపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వీరు ప్రకటించారు.దీక్ష విరమించేందుకు అంగీకరించిన వాంగ్చుక్తాను చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష విరమిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు మూడు షరతులతో ఆస్పత్రి నుంచి ఆయన స్వదస్తూరితో లేఖ విడుదల చేశారు. మరోవైపు సీజేపీ ర్యాలీలో పాల్గొనేందుకు తనను అనుమతించాలని ఆయన కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ర్యాలీకి వెళ్తానని అన్నారు. థాంక్యూ ఖర్గేయువత ఆందోళన గురించి పార్లమెంట్లో ప్రస్తావించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు కాక్రోచ్ జనతా పార్టీ ధన్యవాదాలు తెలిపింది. రాజ్యసభలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేశారని, ఇది సరికాదని ఆయన అన్నారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా..ఢిల్లీలో వర్షంలోనూ కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ కొనసాగింది. చలో సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు దేశం నలు మూలల నుంచి వేలాదిగా యువత హస్తినకు తరలివచ్చారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నా లెక్కచేయకుండా ముందుకు సాగారు. పలువురు సినిమా నటులు, రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు కూడా సీజేపీ నిరసన ర్యాలీలో పలుపాంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వీడియోలు వైరల్సీజేపీ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోటెత్తాయి. యువత వేలాదిగా తరలిరావడంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఓ యువకుడిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. భద్రతా సిబ్బంది లాఠీలతో కొడుతున్నా ఆ యువకుడు ఏమాత్రం బెదరకుండా ఎదురెళ్లడం అందరినీ ఆలోచింపజేసింది. लोकतंत्र का दमन करती सरकार।🥺संविधान विरोधी लोगों के सत्ता में आने से यही होता है।😳 pic.twitter.com/iShgP5LBqW— Cockroach Janta Party (@CJP_for_India) July 20, 2026 -
కాక్రోచ్ Vs పోలీస్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ కట్..
-
కాక్రోచ్ పార్టీ ర్యాలీ: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతుండడంతో పాటు అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) "చలో సంసద్" ర్యాలీ దృష్ట్యా న్యూఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆదివారం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సచిన్ శర్మ.. ఇలాంటి నిరసన ర్యాలీకి అనుమతి కోరలేదు, ఇవ్వలేదని చెప్పారు. న్యూఢిల్లీ జిల్లా అంతటా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని డీసీపీ తెలిపారు. ఈ ఆంక్షల ప్రకారం జంతర్ మంతర్‌లో నిర్దేశించిన నిరసన స్థలం మినహా అదీ ముందస్తు అనుమతితో తప్ప, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పాల్గొనే నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధించారు. ప్రజలెవరు ర్యాలీలలో పాల్గొనొద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకరించాలని పోలీసులు కోరారు. -
ఓవర్ టు ఢిల్లీ!
భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్ వాంగ్‌చుక్.లదాఖ్ పర్వత ప్రాంతీయుడైన సోనమ్ ఒక ఇంజినీర్. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్‌ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్ వాంగ్ చుక్ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్‌మంతర్‌లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్‌తో సోనమ్‌కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్ మొండిగా నిరాకరించింది. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్ల పెంపుడు మీడియాగా మారిపోయింది. వాంగ్‌చుక్ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్‌మంతర్‌లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్‌మంతర్‌ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్చుక్ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్’ అనే సూపర్ హిట్ సినిమాకు వాంగ్‌చుక్ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్‌కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్‌చుక్ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్‌తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్ లాకప్ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ మరణిస్తే యావత్ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మణిపూర్ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్‌లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్ ఎస్టేట్ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్‌మంతర్ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్‌కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. బెంగాల్లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్‌లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్‌లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్‌లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమం నడుస్తున్నది.హైదరాబాద్‌లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘టార్గెటెడ్’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్‌పోర్ట్‌తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. సరికొత్త ఓటర్ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్ చేశారు.The core tenets of the Modi government are Asatya and Hinsa.The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future. No…— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్‌లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్‌చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు. रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ, ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు, కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది. పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్చుక్ను కోరారు.కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.ఇదీ చదవండి: వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీమరోవైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాంగ్ చుక్‌ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలాంటి డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్చుక్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.I’m Not in good shape but not so bad either...Rather than asking me to break my fast please join me on 20th July... Peaceful March to the Parliament.#cockroachjanataparty #jantarmantar #cjpprotest #chalosansad pic.twitter.com/QZ6VyxVMAR— Sonam Wangchuk (@Wangchuk66) July 15, 2026సోనమ్ భావోద్వేగ వీడియోమరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలనే డిమాండ్స్‌తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనకు యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం జంతర్ మంతర్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. లోక్‌సభలో అతి వయస్కులైన ఎంపీల్లో ఒకరైన ఆమె సీజేపీ ఆందోళనకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ తరపున మచ్లిశహర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రింకు సింగ్‌తో గేతడాది జూన్‌లో నిశ్చితార్థం జరగడంతో ప్రియా సరోజ్ పేరు దేశమంతా తెలిసింది.ఎవరీ ప్రియా సరోజ్?ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 1998లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో మచ్లిశహర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.8.5 కిలోల బరువు తగ్గిన వాంగ్చుక్దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన మంగళవారం 25వ రోజుకు చేరుకుంది. సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. ఆయన 8.5 కేజీల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.రాజకీయ, సినీ ప్రముఖుల మద్దతు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా, నటి స్వరభాస్కర్ మంగళవారం జంతర్ మంతర్ చేరుకుని సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. బీకేయూ చారుణి ప్రెసిడెంట్ గుర్నామ్ సింగ్ చారునీ తదితరులు కూడా సీజేపీ ధర్నాలో పాల్గొన్నారు.చలో పార్లమెంట్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండిఈనెల 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చింది. కార్యక్రమానికి హాజరయ్యే వారు 70116 70115 నంబరు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరింది. CHALO SANSAD!!Give a missed call and mark your attendance for 20th July70116 70115 pic.twitter.com/c3AQHAd2ut— Cockroach is Back (@Cockroachisback) July 14, 2026 -
‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం
నీట్ (NEET) పరీక్ష లీక్, ఇతర పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షకుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీనిపై '3 ఇడియట్స్' సినిమాలో 'చతుర్' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఓమి వైద్య తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.ఓమి వైద్య భావోద్వేగ విజ్ఞప్తి‘ఫున్సుఖ్ వాంగ్దూ’( వాంగ్ చుక్) చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై ఎవరూ స్పందించడం లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తన మద్దతును ప్రకటించిన ఓమి బాలీవుడ్ ఐకానిక్ సినిమాతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ పోషించిన 'ఫున్సుఖ్ వాంగ్డూ' పాత్ర నిజ జీవితంలో సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తితో రూపొందించిందేనని సినీ ప్రేమికులకు గుర్తు చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక భావోద్వేగ వీడియోలో ఓమి వైద్య మాట్లాడుతూ, "నాకు ఫున్సుఖ్ వాంగ్దూ చనిపోవడం ఇష్టం లేదు" అంటూ ఆవేదనవ్యక్తం చేశారు. గతంలో తాను వాంగ్చుక్ను కలిశానని, ఇంజనీర్‌గా, ఆవిష్కర్తగా, విద్యా సంస్కర్తగా ఆయన చేసిన కృషి ఎంతో అద్భుత మైందని కొనియాడారు. View this post on Instagram A post shared by Omi Vaidya (@omivaidya_official)ప్రస్తుతం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన చాలా రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు, దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్షీణిస్తుండటం చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా ప్రజలు దీనిని చూడాలన్నారు. ఆయనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఒక మేధావి చనిపోవడం తనకు అస్సలు ఇష్టం లేదని వైద్య పేర్కొన్నారు. వాంగ్‌చుక్ చేసిన పనుల గురించి చదివి, ఆయన సందేశాన్ని అందరికీ షేర్ చేస్తూ అవగాహన పెంచాలని ఆయన ప్రజలను కోరారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యంవాంగ్చుక్ దీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. తాజా హెల్త్ అప్డేట్స్ ప్రకారం, వాంగ్‌చుక్ 8 కేజీలకు పైగా బరువు తగ్గారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన దీక్షను విరమించడానికి నిరాకరించారు "నా దీక్షను విరమించమని నన్ను అడగకండి. కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో వారిని అడగండి" అని వాంగ్‌చుక్ అన్నట్లు దిప్కే పేర్కొన్నారు.ఆమీర్‌పై విమర్శలుమరోవైపు బాలీవుడ్లో 3 ఇడియట్స్ మూవీ ద్వారా కోట్లు రూపాయలు దండుకున్న ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతూ, రియల్ ‘ఫున్సుఖ్ వాంగ్దూ’ గురించి పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.కాగా 59 ఏళ్ల సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలో చేరారు. అప్పటి నుండి ఆయన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలో ఉన్న వాంగ్చుక్ను నటులు ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, రచయిత్రి అరుంధతీ రాయ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఆయన పోరాటానికి మద్దతు పలికారు. -
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎక్స్ ఖాతాపై (గతంలో ట్విట్టర్) ఖాతాపై ఉన్న బ్లాక్‌ను తొలగించి, దానిని పునరుద్ధరించాలని ఆదేశించింది. నీట్ పరీక్ష ముగిసిపోయినందున, కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ప్రాథమిక ఆందోళనకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొంటూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.ఈ అంశంపై కోర్టులో ప్రభుత్వం తరపున భారత సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ పరీక్ష సమయంలో ఈ పార్టీ చేసే పోస్టుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం,అశాంతి నెలకొనే అవకాశం ఉందనే ప్రాథమిక ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వం ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పరీక్షలు పూర్తయినందున ఆ ఆందోళనలు తొలగిపోయాయని, కాబట్టి ఆ అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వ బ్లాకింగ్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టింది.గతంలో, ఈ విషయమై కాక్రోచ్ ఫౌండర్ అభిజిత్ దీప్కే కేసును పరిశీలించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కి చెందిన రివ్యూ కమిటీని కోర్టు ఆదేశించింది. అలాగే వర్చువల్ విధానంలో కమిటీ ముందు హాజరయ్యేందుకు దీప్కేకు అవకాశం కూడా కల్పించింది.కాగా నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. -
ఆరు కిలోలు తగ్గిన వాంగ్‌చుక్
న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన నిరసనలు సోమవారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఇదే డి మాండ్‌తో ఇదే వేదికపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆయన ఆరు కిలోల బరువు తగ్గారు.వాంగ్‌చుక్ రక్తపోటు 112/70కు, హృదయ స్పందన నిమిషానికి 72, బ్లడ్ షుగర్ స్థాయి 67గా నమోదైందని ఆరోగ్య బులెటిన్ పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనతో రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుందని, ఆర్మీ రిటైర్డు ఉద్యోగి ఆమె తండ్రి ఆదివారం నిరసనలో పాలుపంచుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు. తమ ఆవేదన మరే కుటుంబానికి రాకూడదని ఆయన కోరుకుంటున్నారని, కేంద్రమే దీనిపై భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా దీప్కే పేర్కొన్నారు. Hunger strike Day 9Health update of Sonam Wangchuk sirBP- 107/67Blood Glucose- 72Total weight loss- 6.9 kg pic.twitter.com/c4byLZtqj6— Cockroach is Back (@Cockroachisback) July 6, 2026చదవండి: అయోధ్య విరాళాల దుర్వినియోగంపై వినూత్న నిరసన -
‘ధర్మేంద్ర ప్రధాన్‌జీ హ్యాపీ బర్త్‌డే’ : సీజేపీ అభిజీత్ దీప్కే
సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్‌పోస్టర్‌పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Happy Birthday @dpradhanbjp, please resign! pic.twitter.com/djLcewkQch— Abhijeet Dipke (@abhijeet_dipke) June 25, 2026 -
పవన్.. మీరా యువతకు ప్రతినిధి?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ పార్టీల వైఫల్యాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తికి ప్రతీకగా రూపుదిద్దుకున్న కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విమర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సుమతీ శతకంలోని ఉదాహరణను చెబుతూ చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపగలవని, అలాగే చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆలోచనలతో దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి విభజనవాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘కాక్రోచ్’కు దేశవ్యాప్తంగా మద్దతిస్తే పవన్‌కు తప్పుగా కనిపిస్తోందా..? నీట్ అక్రమాలపై నిరసనగా మే 16న అభిజీత్ డిప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ‘ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు. వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలక వర్గాల వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా, ఆ ఉద్యమాన్ని అవమానకర పదజాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వైఖరి కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, నిరసనలు సహజమని, వాటిని వినిపించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పవన్‌కు వారు గుర్తు చేస్తున్నారు. ఒక ఉద్యమంతో ఏకీభవించకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న భావజాలాన్ని, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా పవన్‌కు ఉన్నప్పటికీ తెర వెనుక అజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. యువతకు మీరా ప్రతినిధి...?? యువతకు ప్రతినిధిగా, మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలా జెన్‌జీ యువతను, వారు ఆదరిస్తున్న సీజేపీని ఎగతాళిగా మాట్లాడటంపై యువతరం మండిపడుతోంది. యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని దేశద్రోహంగా లేదా సమాజ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం సమస్యల మూలాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా మారుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యువత నిరుద్యోగం, అవకాశాల కొరత, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు వారి ఆలోచనలను కొట్టిపారేస్తూ పవన్ మాట్లాడటం యువతను పవన్‌కు మరింత దూరం చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీపై వచ్చిన స్పందనను పవన్ చెప్పినట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌గా కాకుండా, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పట్టే సామాజిక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. యువత స్వరాన్ని వినేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందా? లేక తమకు నచ్చని అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ చిన్నచూపు చూస్తుందా? అనే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, జెన్ జీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్‌లు, రీల్స్, వార్తా కథనాలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి. ‘నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని పవన్ సమర్థిస్తున్నారా’ అని పలువురు నిలదీశారు. ‘నిలకడ లేదు.. విలువలు లేవు’ అంటూ పవన్ ద్వంద్వ వైఖరిని మరికొందరు తప్పుబట్టారు. ‘విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తే విభజనవాదం ఎలా అవుతుంది’ అంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు. ప్రధానంగా ‘నేషన్ ఫస్ట్ అనేది వాస్తవమేగానీ, యువత లేకుండా దేశం ఎక్కడుంది’ అని పవన్ కళ్యాణ్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపైన, విద్యార్థుల భవిష్యత్తుపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా యువత పవన్‌ను డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని, అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగే ఏ తప్పునూ ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ కాక్రోచ్ జనతాపార్టీ, జెన్ జీ యువతని కించపరుచ్తూ మాట్లాడి సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. -
కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి
-
హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ., నీట్ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. ‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్‌లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్ అడ్మిషన్‌కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్ నీట్, సీబీఎస్ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను జైలుకు పంపాలి’ అని అన్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. -
హైదరాబాద్‌లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం
హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్ 14వ తేదీ) ఇందిరా పార్క్ దర్నా చౌక్ వద్ద ఆందోళనకు ప్లాన్ చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. -
కామ్రేడ్.. జెన్ జెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాక్రోచ్ జనతా పార్టీ పేరు తో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసన కార్యక్రమాలు ఇటు మావోయిస్టులు, అటు నిఘా వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎవరికి వారుగా తమ కార్యాచరణను అమలు చేసేందు కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జెన్‌జెడ్‌లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోలు ఉన్నట్టు తెలుస్తోంది.రాజ్యాంగ పరిధిలోతిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అజ్ఞాతం వీడిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ‘మా పార్టీపై నిషేధం, మాపై కేసులు ఎత్తివేస్తే రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు తోటి కామ్రేడ్లకు పిలుపునిస్తా’అని ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం కొంచెం అటూఇటుగా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పట్లో మావో యిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసే అవకాశం కనిపించడం లేదు.కార్యాచరణ ఎలా?ఓ వైపు ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జెడ్ ఆధ్వర్యాన తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ యువతలో సైతం నేపాల్, శ్రీలంక తరహాలో అసంతృప్తి ఉందనేది మాజీల అంచనా. అయితే దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు అమలైన తీవ్ర నిర్బ«ంధం కారణంగా సాయుధ విప్లవ పోరాటం ప్రధానంగా అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలకే పరిమితమైంది, ఫలితంగా 2000కి అటూఇటుగా జన్మించిన జెన్‌జెడ్ తరంతో సాయుధ విప్లవ పార్టీలకు పెద్దగా సంబంధాలు లేవు. అయితే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో మావోయిస్టు అగ్ర నాయకత్వం అడవులను వదిలింది. అయితే, ఏ తరహా పోరాటం చేయాలి.. ఎవరి కేంద్రంగా పోరాటాలు చేయాలనే కచ్చితమైన కార్యాచరణకు మాజీ మావోయిస్టులు రాలేకపోతున్నారు. వామపక్ష పార్టీలు మాజీ మావోలను తమ పార్టీలోకి రావాలంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. అయితే వారితో కలిసి పనిచేయడం సబబా, కాదా అన్న మీమాంస లొంగిపోయిన మావోయిస్టు నేతల్లో ఉన్నట్టు సమాచారం.యువత కేంద్రంగానే బెస్ట్..సోషల్ మీడియా వేదికగా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తోన్న ప్రభంజనం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.దీంతో కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్ కామ్రేడ్లతో కలిసి నడవడం కంటే, ఉవ్వెత్తున ఎగిసిపడే శక్తి సామర్థ్యాలు, తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత కేంద్రంగానే తమ దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ మేలనేది ఎక్కువ మంది మాజీల అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలకంగా అడవులకు దగ్గరగా పనిచేసిన ఖాకీలు ఇప్పుడు జెన్జెడ్ల అడ్డా అయిన సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నారు. మారు గుర్తింపులతో ఖాతాలు తెరుస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోంది. జెన్‌జెడ్ అడుగులు ఎటువైపు అనేది అన్ని వర్గాలకు గమనించతగ్గ అంశంగా మారిపోయింది.


