ఆరు కిలోలు తగ్గిన వాంగ్‌చుక్‌ | CJP Protest: Sonam Wangchuk hunger strike enters 9th day | Sakshi
Sakshi News home page

17వ రోజుకు చేరిన సీజేపీ నిరసన

Jul 6 2026 2:14 PM | Updated on Jul 6 2026 2:36 PM

CJP Protest: Sonam Wangchuk hunger strike enters 9th day

న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ (Cockroach Janata Party) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన నిరసనలు సోమ‌వారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఇదే డి మాండ్‌తో ఇదే వేదికపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్ష 9వ‌ రోజుకు చేరుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆయన ఆరు కిలోల బరువు తగ్గారు.

వాంగ్‌చుక్‌ రక్తపోటు 112/70కు, హృదయ స్పందన నిమిషానికి 72, బ్లడ్‌ షుగర్‌ స్థాయి 67గా నమోదైందని ఆరోగ్య బులెటిన్‌ పేర్కొంది. నీట్‌ పేపర్‌ లీకేజీతో తీవ్ర ఆందోళనతో రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుందని, ఆర్మీ రిటైర్డు ఉద్యోగి ఆమె తండ్రి ఆదివారం నిరసనలో పాలుపంచుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు. తమ ఆవేదన మరే కుటుంబానికి రాకూడదని ఆయన కోరుకుంటున్నారని, కేంద్రమే దీనిపై భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా దీప్కే పేర్కొన్నారు.  

చ‌ద‌వండి: అయోధ్య విరాళాల దుర్వినియోగంపై వినూత్న నిర‌స‌న‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement