ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా | Transfer Trimurthulu Movie OTT Release Update | Sakshi
Sakshi News home page

OTT: కొత్త తెలుగు మూవీ.. ఓటీటీ అధికారిక ప్రకటన

Jul 4 2026 2:29 PM | Updated on Jul 4 2026 2:35 PM

Transfer Trimurthulu Movie OTT Release Update

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని పలు సినిమాలు చేసిన వడ్డే నవీన్.. తర్వాత కాలంలో సరైన చిత్రాలు చేయక పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. దాదాపు దశాబ్దం తర్వాత హీరో కమ్ నిర్మాతగా ఓ మూవీ చేశాడు. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)

వడ్డే నవీన్ రీఎంట్రీలో చేసిన సినిమా 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. రాశీ సింగ్ హీరోయిన్. గత నెల 19న థియేటర్లలోకి వచ్చింది. ‍అయితే విడుదలకు ముందు హడావుడి చేశారు గానీ స్టోరీ మరీ పాతది కావడం, ట్రీట్‌మెంట్ కూడా సీరియల్ తరహాలో ఉండటంతో తొలి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' విషయానికొస్తే.. త్రిమూర్తులు ఓ సాధారణ కానిస్టేబుల్. నిజాయితీ వల్ల పదేళ్లలో 55సార్లు బదిలీ అవుతాడు. అలా 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే పేరు సంపాదిస్తాడు. అరకులో గతంలో తన తండ్రి పనిచేసిన స్టేషన్‌కి బదిలీపై వెళ్తాడు. అక్కడ ఓ గిరిజన అమ్మాయికి సంబంధించిన అత్యాచార కేసు ఫైల్ త్రిమూర్తులుకి కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనకు ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు, హోంమంత్రి సంతోష్ (వివేక్ రఘువంశీ) కారణమని తెలుసుకుంటాడు. మరి బాధిత యువతికి త్రిమూర్తులు న్యాయం చేశాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: అఫిషియల్‌.. ఓటీటీలోకి ‘పెద్ది’.. ఆ రోజే స్ట్రీమింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement