గిన్నిస్‌ రికార్డా? బిగ్‌బాస్‌ అవకాశమా? ధనుష్‌ స్పందన ఇదే.. | Bigg Boss Contestant Dhanush Reveals Truth Behind Tearing His Guinness Record | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డా? బిగ్‌బాస్‌ అవకాశమా? ధనుష్‌ స్పందన ఇదే..

Aug 18 2026 5:35 PM | Updated on Aug 18 2026 5:59 PM

Bigg Boss Contestant Dhanush Reveals Truth Behind Tearing His Guinness Record

బిగ్‌బాస్‌.. అగ్నిపరీక్ష ఎంపిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారుతోంది. పోటీలో భాగంగా నిర్వాహకులు ఇస్తున్న కొన్ని టాస్క్‌లపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్‌ ధనుష్‌ మంజునాథ్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అగ్నిపరీక్షలో భాగంగా ధనుష్‌ తన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను చించేయడంతో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. రియాలిటీ షోలో అవకాశం కోసం జీవితంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన గుర్తింపును ఎలా ధ్వంసం చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
డూప్లికేట్‌ మాత్రమే.. 
ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియలో గోమయాన్ని ముఖానికి పూసుకోవడం, ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటి టాస్క్‌లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ధనుష్‌ చర్య కూడా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమైంది. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన ధనుష్‌.. తాను చించేసింది అసలు గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ కాదని స్పష్టం చేశారు.  టాస్క్‌ కోసం నిర్వాహకులు తనకు డూప్లికేట్‌ కాపీని ఇచ్చారని అసలు సర్టిఫికెట్‌ను భద్రంగా ఉంచుకున్నానని వెల్లడించారు.

అవ​కాశాన్ని వదులుకోనంటూ..
అంతేకాకుండా గిన్నిస్‌ రికార్డును మరోసారి సాధించే అవకాశం ఉండొచ్చని, కానీ కన్నడ బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వేలాది మంది దరఖాస్తు చేసుకున్న వారిలో తనను ఎంపిక చేసిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని తెలిపారు. ధనుష్‌ వ్యాఖ్యలు బిగ్‌బాస్‌ వంటి రియాలిటీ షోలకు యువత ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మరోసారి స్పష్టం చేశాయి. 

ఈ షో ద్వారా గుర్తింపు, సినిమా అవకాశాలు, బ్రాండ్‌ ఒప్పందాలు, మరింత ప్రజాదరణ లభిస్తాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది షో ముగిసిన తర్వాతే తేలనుంది.

ఇదీ చదవండి: నెలకు రూ.33 లక్షలు.. బిగ్‌బీ కొత్త లీజు ఒప్పదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement