నెలకు రూ.33 లక్షలు.. బిగ్‌బీ కొత్త లీజు ఒప్పదం! | Amitabh Bachchan Has Added Another Big Deal | Sakshi
Sakshi News home page

నెలకు రూ.33 లక్షలు.. బిగ్‌బీ కొత్త లీజు ఒప్పదం!

Aug 18 2026 4:27 PM | Updated on Aug 18 2026 4:34 PM

Amitabh Bachchan Has Added Another Big Deal

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరో భారీ రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ పోషకాహార సంస్థకు లీజుకు ఇచ్చారు. లింక్‌ రోడ్డులోని సిగ్నేచర్‌ భవనంలో ఉన్న సుమారు 8,428 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయ స్థలాన్ని అమితాబ్‌ బచ్చన్‌ లీజుకు ఇచ్చినట్లు సమాచారం.

అద్దె రూపంలో రూ.21.88 కోట్లు..
ఈ ఒప్పందం ప్రకారం ఆయనకు నెలకు రూ.33 లక్షల అద్దె రానుందట. 2026 ఆగస్టు 15 నుంచి ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుందట. మొత్తం కాలానికి అద్దె రూపంలో సుమారు రూ.21.88 కోట్లు వచ్చే అవకాశం ఉందని టాక్‌. ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచేలా ఒప్పందంలో నిబంధనను చేర్చినట్లు తెలుస్తోంది.

మరోసారి చర్చ..
అద్దెకు తీసుకున్న సంస్థకు కార్యాలయ స్థలంతో పాటు తొమ్మిది పార్కింగ్‌ స్థలాలను కూడా వినియోగించుకునే హక్కు కల్పించారట. ఈ లావాదేవీలో భాగంగా రూ.1.98 కోట్ల భద్రతా డిపాజిట్‌ను చెల్లించినట్లు సమాచారం.
ఇప్పటికే ముంబైలో పలు విలాసవంతమైన నివాసాలు, వాణిజ్య భవనాలను కలిగి ఉన్న అమితాబ్‌ బచ్చన్‌.. ఇటీవల అయోధ్యలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆయన రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

ఇదీ చదవండి: 15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్‌పై అప్‌డేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement