15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్‌పై అప్‌డేట్‌ | Zindagi Na Milegi Dobara 2, Zoya Akhtar Confirms Work Is Underway On The Sequel, Fans Await Hrithik-Farhan-Abhay Return | Sakshi
Sakshi News home page

15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్‌పై అప్‌డేట్‌

Aug 18 2026 3:14 PM | Updated on Aug 18 2026 3:51 PM

Zoya Akhtar confirms Zindagi Na Milegi Dobara Sequel Is In The Works

2011లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘జిందగీ నా మిలేగీ దొబారా’  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్పెయిన్‌, భారత్‌, యూనైటెడ్‌ కింగ్‌డంమ్‌లో చిత్రీకరించిన ఈ చిత్రం రూ.45 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా రూ.153కోట్ల వసూళ్లను రాబెట్టింది. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్ నటించిన ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకరాలు జోయా అక్తర్‌ పార్ట్‌2 కోసం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల 2025 యాస్‌ ఐలాండ్‌’ ప్రకటనలో హృతిక్‌రోషన్‌, అభయ్‌ డియోల్‌, ఫర్హాన్‌ అక్తర్‌ కలిసి నటించారు. దీంతో ‘జిందగీ నా మిలేగీ దొబారా2’  కోసం అభిమానులు చర్చ మొదలు పెట్టారు.  మాన్‌సీన్‌ ఫిల్మ్‌ ఫెస్టివ్‌లో పాల్గొన్న జోయా ఈ స్వీక్వెల్‌పై స్పందించారు.

పనులు జరుగుతున్నాయి..

‘సీక్వెల్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పాత్రలను ఎలా చూపించాలనే అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.  అన్నీ కుదిరితే అభిమానులకు మంచి సినిమా అందించాలనుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు.
ఇక 2025లో విడుదలైన ప్రకటనను చాలామంది ‘జిందగీ నా మిలేగీ దొబారా2 ట్రైలర్‌గా భావించారని జోయా గుర్తుచేసుకున్నారు. మొదట అభిమానులు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత అది ప్రకటన అని తెలిసి సోషల్‌మీడియాలో తనను ట్రోల్‌ చేశారని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement