సింగర్ మంగ్లీ పని అయిపోయిందా?.. ఇక అంతా ఆమెదేనా హవా | Singer Prabha Alternate For Folk Singer Mangli In Tollywood | Sakshi
Sakshi News home page

Singer: ఏష నాగుల సాంగ్.. మంగ్లీకి ప్రత్యామ్నాయంగా ఫోక్ సింగర్..!

Oct 2 2026 3:13 PM | Updated on Oct 2 2026 3:24 PM

Singer Prabha Alternate For Folk Singer Mangli In Tollywood

టాలీవుడ్‌ జానపద గీతాలకు కేరాఫ్ అడ్రస్ అంటే వినిపించే పేరు ఆమెదే. తన గొంతుతో శ్రోతలను కట్టిపడేసే టాలెంట్ ఆమె సొంతం. ఏ ఈవెంట్‌లోనైనా ఆమె పాడిందంటే ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే. ఆమె మరెవరో కాదు.. తెలుగులో జానపద సింగర్‌గా ముద్ర వేసుకున్న మంగ్లీ.  ఎన్నో పాటలు పాడి అభిమానుల గుండెల్లో తన పేరును చిరస్థాయిగా నిలుపుకుంది.

ఇప్పుడు ఆమెకు పోటీగా ఎవరూ రాలేదు. కానీ ఏషనాగుల సాంగ్ విన్నాక మంగ్లీ ప్రత్యామ్నాయం దొరికిందనే టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. రాను బొంబాయికి రాను, బండిల వోధు బావ లాంటి జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభ.. నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్‌లో ‘యేష నాగుల కట్ట మీద’ సాంగ్‌ పాడి మరింత ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె పాడిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలోని ‘నారాయణమ్మ’ పాట కూడా సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

(ఇది చదవండి: విజయ్-రష్మిక లగ్జరీ విల్లా.. విడిపోయేందుకే కొంటున్నారా?)

దీంతో ప్రభ.. సింగర్ మంగ్లీకి ప్రత్యామ్మాయంగా ఎదుగుతోందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఆమె రా వాయిస్, హై ఎనర్జీ ఫోక్ స్టైల్ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. వరుసగా క్రేజీ హిట్ సాంగ్స్ పడడంతో ప్రస్తుతం ఆమెపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతోంది.  అయితే ప్రభ తనకంటూ సొంత గుర్తింపు ఎంతవరకు పెంచుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement