మూవీ ప్రమోషన్స్‌లో మహేశ్‌ బాబు కూతురు.. అభిమానులు ఫిదా | Sithara Latest Video Don't Trouble The Trouble Movie | Sakshi
Sakshi News home page

Sithara: సితారతో సినిమా ప్రమోషన్‌.. వైరల్‌గా వీడియో

Oct 2 2026 2:49 PM | Updated on Oct 2 2026 3:07 PM

Sithara Latest Video Don't Trouble The Trouble Movie

ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ఈరోజు (అక్టోబరు 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్నారులు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.

ప్రమోషన్స్‌లో
ఈ క్రమంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార కూడా సందడి చేసింది. సినిమాలోని అంశాల గురించి ఆమె మాట్లాడిన తీరు, చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సితార మాట్లాడిన వీడియోను చూసిన మహేశ్‌బాబు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చిన్న వయసులోనే సితార ఎంతో స్పష్టంగా మాట్లాడుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. ఆమె కాన్ఫిడెన్స్‌పై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

కాగా శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా, బేబి సారా, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement