breaking news
Dont Trouble The Trouble Movie
-
ఓటీటీలోకి రాజమౌళి కొడుకు సినిమా.. అధికారిక ప్రకటన
ఓవైపు 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి, ఇతడి కొడుకు కార్తికేయ మరోవైపు నిర్మాతగా ఓ మూవీ చేశారు. దాన్ని థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడా చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలలోపే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)ఫహాద్ ఫాజిల్ తెలుగులో ఇదివరకే 'పుష్ప'లో షెకావత్ అని విలన్ రోల్ చేశాడు. కానీ హీరోగా చేసిన చిత్రం 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. శశాంక్ యేలేటి దర్శకుడు కాగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించాడు. ఈనెల 02న థియేటర్లలోకి వచ్చింది. కానీ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫాంటసీ ఎలిమెంట్స్ కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం(అక్టోబర్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ విషయానికొస్తే.. సూరి (ఫహాద్ ఫాసిల్) చిన్న చిన్న మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా ఓ రోజు దివ్య (సారా పాలేకర్) అనే అమ్మాయి, ఆమె కుక్క స్నూపీ సూరికి ఎదురవుతాయి. సూరిని దివ్య ఓ మెజీషియన్ అనుకుంటుంది. సూరి మాత్రం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కిడ్నాప్ చేశానని చెప్పి ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని అనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)దివ్య తల్లిదండ్రులు అసలు కనిపించకుండా పోయారని సూరికి తెలుస్తుంది. దివ్య మామ ప్రతాప్ (సౌరభ్ సచ్‌దేవా) మాత్రం సూరి, దివ్యని తన దగ్గరకు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు. ఇంతలో సూరికి అసలు ట్విస్ట్ తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? దివ్య అసలు కథేంటి? సూరికి ఏం జరిగింది? చివరకు ఏం జరుగుతుందనేదే మిగతా కథ.ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్ చాలానే సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ 'బత్తా'తో పాటు సిగ్మా, ఇమ్మోర్టల్, అవరచన్ అండ్ బాయ్స్, లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ సిరీస్‌లు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: లిఫ్ట్ ఎక్కి గతాన్ని మార్చే అవకాశమొస్తే.. ఓటీటీలో తెలుగు థ్రిల్లర్) -
అరడజను సినిమాలు.. అన్నీ నిరాశే!
ఈ వారం థియేటర్లలోకి అరడజనుకు పైగానే సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలపై రిలీజ్‌కు ముందు మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా నిరాశే మిగిలింది.ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్ నటించిన ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవరించాడు. ఆయన కొడుకు ఎస్. ఎస్. కార్తికేయ నిర్మించాడు. అందుకే ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే నెగిటీవ్ టాక్ మూటగట్టుకొంది. అసలు కార్తికేయ ఈ చిత్రాన్ని ఎందుకు నిర్మించాలకున్నాడు? కొడుకు డెబ్యూ ఫిల్మ్‌ని రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తాడా? అనే విమర్శలు వచ్చాయి.(చదవండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ)ఇంచుమించు ఇలాంటి కామెంట్సే ‘సిగ్మా’ చిత్రంపై వచ్చాయి. తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం కావడంతో ‘సిగ్మా’పై ముందే ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగులోనే కాదు తమిళనాట కూడా పెద్దగా ఆడడం లేదు.(చదవండి: సిగ్మా మూవీ రివ్యూ)ఇక కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం డోరతీ ఈ వారమే తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా..టికెట్స్ మాత్రం పెద్దగా తెగడం లేదు. ఇక ఈ వారం సినిమాల్లో గట్టిన ప్రమోషన్స్ చేసిన సినిమా ‘తెల్లకాగితం’. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి కూడా మిశ్రమ స్పందననే లభించింది. ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమి లేదని..పలు పాత్ర చిత్రాలను గుర్తు చేస్తుదంటూ సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అందుకే రెండో రోజు నుంచి ఈ సినిమా టికెట్స్ పెద్దగా తెగడం లేదు. (చదవండి: 'తెల్లకాగితం' మూవీ రివ్యూ)గ్రామీణ నేపథ్యంలో రూరల్ మాఫియా, లోకల్ గ్యాంగ్ వార్, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ‘అనకాపల్లి’ కూడా ప్రేక్షకులను థియేటర్లకు పెద్ద సంఖ్యలో రప్పించలేకపోయింది. ఇదే వారంలో వచ్చిన మరో తెలుగు చిత్రం ‘తత్వం’. పెద్ద స్టార్లు లేకపోవడం, భారీ ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలియదు. ఇక కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన పల్లెటూరి ప్రేమకథ ‘ప్రేమద ఊరలి’ మూవీ.. ‘ప్రేమనే ఊరిలో’పేరుతో తెలుగులో ఈ శుక్రవారం(అక్టోబర్ 2) రిలీజ్ అయింది. ఉన్నంతలో కొంతవరకు ఈ సినిమా కాస్త బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడంతో ఇలాంటి ఒక సినిమా వచ్చిందన్న విషయమే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మొత్తంగా చూస్తే.. ఈ వారం వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చాయి. -
కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ చాలానే తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా', రోషన్ 'తెల్లకాగితం'తోపాటు అనకాపల్లి, కీర్తి సురేశ్ 'డోరతి' తదితర మూవీస్ ఉన్నాయి. ఇంతకీ వీటికి ఎలా స్పందన వస్తోంది? కలెక్షన్స్ సంగతేంటి?రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరో. అయితే ప్రమోషన్ల గట్టిగా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ వీటిని అందుకోవడంలో మూవీ, యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.1.65 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫహాద్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా రివ్యూ)తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో. దీనికి రిలీజ్‌కి ముందు మంచి హైప్ ఏర్పడింది. తీరా చూస్తే టైటిల్ ట్రెండీగా ఉన్నా కంటెంట్ పాతగా ఉందని టాక్ వినిపించింది. ఇకపోతే ఈ చిత్రానికి తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.(ఇదీ చదవండి: జేసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రివ్యూ)'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా సినిమా 'తెల్లకాగితం'. గతంలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా దీన్ని తీశారు. అయితే క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగతాదంతా చల్తా చల్తా. ఇది డీసెంట్ మూవీ అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. దీనికి తొలిరోజు రూ.1.58 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించుకున్నారు.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన సినిమా 'డోరతి'. గతవారం తమిళనాడులోని థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ తెలుగులో రిలీజైంది. స్వలింగ ప్రేమ అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇదో డిఫరెంట్ మూవీ అని చూసిన చాలామంది మెచ్చుకుంటున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఎంతొచ్చాయనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ 'డోరతి' సినిమా రివ్యూ)ప్రముఖ నిర్మాత లగటపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'అనకాపల్లి'. యాక్షన్ ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. అయితే ప్రెజెంటేషన్ పర్లేదనిపించిందని, కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? అనే అంశాలని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దీనికి కూడా తొలిరోజు వసూళ్లెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'అనకాపల్లి' సినిమా రివ్యూ) -
మూవీ ప్రమోషన్స్‌లో మహేశ్ బాబు కూతురు.. అభిమానులు ఫిదా
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ఈరోజు (అక్టోబరు 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్నారులు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.ప్రమోషన్స్లోఈ క్రమంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార కూడా సందడి చేసింది. సినిమాలోని అంశాల గురించి ఆమె మాట్లాడిన తీరు, చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.సితార మాట్లాడిన వీడియోను చూసిన మహేశ్‌బాబు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చిన్న వయసులోనే సితార ఎంతో స్పష్టంగా మాట్లాడుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. ఆమె కాన్ఫిడెన్స్‌పై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.కాగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించారు.Sitara telugu cute undhi, jai babu #DontTroubleTheTrouble pic.twitter.com/PHES0iYVLD— AitheyEnti (@AitheyEntii) October 1, 2026 -
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్నటీనటులు: ఫహాద్ ఫాజిల్, బేబీ సారా, మహేశ్ మంజ్రేకర్, సౌరభ్ సచ్దేవ్, సుబ్బరాజ్ తదితరులునిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్స్స్నిర్మాతలు: ఎస్ ఎస్ కార్తికేయ, శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిరచన-దర్శకత్వం: శశాంక్ ఏలేటిసంగీతం: కాల భైరవవిడుదల తేది: అక్టోబర్ 2, 2026మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కథలు, విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ నేడు(అక్టోబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఫహద్ మరోసారి తన నటనతో మెప్పించారా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సూరి(ఫహాద్ ఫాజిల్) ఓ అనాథ. అంబుల్లెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ. ఈజీ మనీకి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ దగ్గర పందెం కట్టడం..ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బును సంపాదిస్తుంటాడు. అలా ఆ ఏరియా డాన్ అస్లాం భాయ్(మహేశ్ మంజ్రేకర్)ని కూడా మోసం చేసి గొర్రె పొట్టేల పందెంలో గెలుస్తాడు. ఆ తర్వాత అసలు విషయం అస్లాంభాయ్కి తెలుస్తుంది. దీంతో సూరి దగ్గరకు వచ్చి రెండు నెలల్లో రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని హెచ్చరిస్తాడు. అంత డబ్బు సంపాదించడానికి మళ్లీ అడ్డుదారినే ఎంచుకుంటాడు. స్కూల్ బయట స్నేహితుడితో మ్యాజిక్ చేయిస్తూ.. స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసి కొడుతుంది. అదే సమయంలో సూరికి బేబీ దివ్య పరిచయం అవుతుంది. ఆమెకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. అసలు దివ్య ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఆమె సూరికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దివ్య పరిచయం తర్వాత సూరీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ?దివ్యకు ఉన్న స్పెషల్ పవర్స్ ని సూరి ఎలా వాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాజమౌళి కొడుకు నిర్మాత.. రాజమౌళి సమర్పణ.. ఇండియాలోనే గొప్ప నటుల్లో ఒకరైన ఫహద్ ఫాజిల్ హీరో.. ఇవి చాలు సినీ ప్రియుడుకి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా పై అంచనాలు పెట్టుకోవడానికి. అయితే అదే అంచనాలతో థియేటర్ కి వెళ్తే మాత్రం కొంతవరకు నిరాశ తప్పదు. కథలో కొత్తదనం లేకపోవడం కంటే, ఉన్న కథను ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చెప్పలేకపోవడమే ప్రధాన సమస్య. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, సెకండాఫ్‌లోనూ సాగదీత ఉండటం, హీరో–బేబీ ఎమోషన్ పూర్తిగా వర్కౌట్ కాకపోవడం సినిమాకు మైనస్‌లు. అక్కడక్కడ కామెడీ, ఫహద్ ఫాజిల్ నటన, క్లైమాక్స్ మాత్రం కొంత ఉపశమనం ఇస్తాయి.అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అఫ్ అంత సోసోగానే ఉంటుంది. సూరి పాత్ర నేపథ్యాన్ని తెలియజేసే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సూరి డబ్బులు కోసం చిన్న, చిన్న తప్పులు చేసి దొరికిపోవడం.. చివరకు విలన్నే మోసం చేసి డబ్బులు తీసుకోవడం...అతను వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. బేబీ దివ్య ఎంట్రీ తర్వాత సినిమా జోనర్ పూర్తిగా మారిపోతుంది. ద్వితియార్థంలోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ కూడా కథనం పరుగులు పెట్టించకుండా నెమ్మదిగా సాగదీస్తూ.. బోరింగ్‌గా సాగుతుంది. బేబీ దివ్యకు సంబంధించిన అసలు విషయం తెలిసిన తర్వాత కూడా మళ్లీ సాగదీత సన్నివేశాలతో ముందుకు నడిపించాడు. అక్కడక్కడ కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయి కానీ.. హీరో, బేబీ ఎమోషల్ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. చాలా వరకు సాగదీతగా, లాజిక్ లెస్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంతవరకు ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..ఫహాద్ పాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోతాడు. సూరి పాత్రలోనూ ఆయన తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బేబీ సార పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకం. దివ్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అమాయకపు మాటలు.. చూపులతో అందర్నీ ఆకట్టుకుంటుది. ఇక విలన్‌గా మహేశ్ మంజ్రేకర్ తెరపై కనిపించేది కాసేపే. అటు పూర్తిగా విలన్‌గా భయపెట్టలేదు..ఇటు కమెడియన్‌గా నవ్వించనూ లేదు. సౌరవ్ సచ్దేవ్, వెంకటేష్ కాకుమాను, సుబ్బరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాల భైరవ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి..వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
థియేటర్లలో సినిమాల సందడి.. అక్టోబర్‌లో వస్తున్న చిత్రాలివే..
సినీ ప్రియులకు అక్టోబర్ ఫుల్ మీల్స్ పెట్టబోతోంది. ఈ నెలలో వరుసగా ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, విభిన్న కథాంశాలతో తెరకెక్కిన మూవీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా దసరా పండుగను టార్గెట్ చేస్తూ పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవేంటో చూద్దాం రండి! అక్టోబరు 2తో మొదలు..డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ : శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది.సిగ్మా: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.తెల్లకాగితం: హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ ‘తెల్లకాగితం’. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది.ఎస్ఐ యుగంధర్: ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఎస్ఐ యుగంధర్’. మేఘ లేఖ కథానాయిక. రాఘవేంద్ర కటారీ దర్శకుడు. ఈ మూవీ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆదర్శ కుటుంబం: విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం..AK47’ . ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.కామ్రేడ్ కళ్యాణ్: జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.దసరా పోరు..జైలర్ 2 : రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రజినీకాంత్–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. రణబాలి: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గరివిడి లక్ష్మి : నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష్మి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ అనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో లక్ష్మీ పాత్రలో ఆనంది కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. కల్ట్: నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కల్ట్’. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ కాకరాల మరో నిర్మాత. ఈ సినిమాను అక్టోబరు 30న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ నెగటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ అప్పీల్‌తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఏమో ఏమో ఇది : శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏమో ఏమో ఇది’. అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా కనిపించనుంది.కాగా చిత్రాలతో పాటు పలు మరికొన్ని చిన్న సినిమాలు అక్టోబర్‌లోనే రిలీజ్‌కు ముస్తాబవుతున్నాయి. -
రాజమౌళికే ఝలక్.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆయన.. అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సెట్స్‌లో ఎంతో గంభీరంగా కనిపించే రాజమౌళి.. ఇంట్లో మాత్రం అందరిలాగే సాధారణ భర్తేనని చెప్పే ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో..రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి కుటుంబసభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకలో రాజమౌళిని వేదికపైకి ఆహ్వానించిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజమౌళి వెనుకే నిల్చున్న ఆయన భార్య రమా రాజమౌళి.. చేతితో ‘త్వరగా నడవండి’ అన్నట్లుగా సరదాగా ముందుకు నెట్టారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. బయట ప్రపంచానికి ఎంత పెద్ద దర్శకుడైనా.. ఇంట్లో మాత్రం భార్య మాట వినాల్సిందే అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ‘సినిమా సెట్స్‌లో రాజమౌళి బాస్ కావచ్చు.. కానీ ఇంట్లో రమా గారే రియల్ బాస్’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విషయానికొస్తే..ఇక ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విషయానికొస్తే.. శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది. ఇదీ చదవండి: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్, మహేశ్‌ల మూవీ రివ్యూ Rajamouli & Rama’s Funny Moment! A fun moment between SS Rajamouli and Rama Rajamouli has gone viral on social media.#SSRajamouli #RamaRajamouli #ViralVideo pic.twitter.com/kQG3vcs0S8— Telangana Ahead (@telanganaahead) September 30, 2026 -
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్, మహేశ్‌ల మూవీ రివ్యూ
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వీక్షించి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఎన్టీఆర్ ఏమన్నారంటే..‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రతి చిన్నారికి, ప్రతి తల్లిదండ్రికి.. తమలోని చిన్నారిని ఇంకా మోస్తున్న ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం. ఫహాద్ ఫాజిల్ ‘సూరి’ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశానికి ఆయన ప్రాణం పోశారు. దర్శకుడు శశాంక్ తెరకెక్కించిన తీరు అద్భుతం. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే స్వచ్ఛమైన భావోద్వేగాలను తెరపై చూపించడం అంత సులభం కాదు. తొలి చిత్రంతోనే శశాంక్ దాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుతున్న ‘తమ్ముడు’’ అని ఎన్టీఆర్ అభినందించారు. చిన్నారి సారా నటన తన మనసును దోచుకుందని అన్నారు. ఎంతో సహజంగా నటించిందని, ప్రతి భావోద్వేగాన్ని అమాయకత్వంతో పలికించిందని పేర్కొన్నారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆమె పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని చెప్పారు. సంగీత దర్శకుడు కాలభైరవ నేపథ్య సంగీతాన్ని కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.మహేశ్‌బాబు ఏమన్నారంటే..మరోవైపు మహేశ్‌బాబు కూడా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ప్రశంసలు కురిపించారు. ‘ సినిమా ఎంతో అనుభూతిని అందించింది. చక్కగా రూపొందించిన, ఆనందాన్ని పంచే చిత్రమిది. లోతైన భావోద్వేగాలను కలిగించింది. ఫహాద్ ఫాజిల్ అద్భుతమైన నటుడు. ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు స్ఫూర్తిదాయకం. ఫహాద్, చిన్నారి సారా కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో ఆకట్టుకున్నాయి. దర్శకుడు కార్త్కు ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నిర్మాత శోభుతో కలిసి ఎంతో ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించారని అభినందించారు. చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇలా విడుదలకు ముందే ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి అగ్ర కథానాయకులు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ను ప్రశంసించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.కాగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది. ఇదీ చదవండి: ఓటీటీలో కాజల్ అగర్వాల్ కోర్ట్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ #DontTroubleTheTrouble is for every child, every parent and everyone who still carries a little bit of that child within them.Fahadh sir, what a commendable performance as Suri. Absolutely phenomenal. I was inspired by the way you bring so much life into every frame. Truly…— Jr NTR (@tarak9999) September 30, 2026Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!! Fahadh sir - u…— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026 -
ఫాహద్ ఫాజిల్ మూవీ.. మహేశ్ బాబు ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మూవీ రివ్యూ ఇచ్చారు. ఫాహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కు తన సమీక్ష వెల్లడించారు. ఈ సినిమా వీక్షించిన మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ అద్భుతమైన అనుభవంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కొనియాడారు. పూర్తిగా వినోదాన్ని అందిస్తూ హృదయాన్ని లోతుగా తాకే కథతో నిర్మించారని ప్రశంసించారు. ఈ సినిమా అంతటా ఒక అరుదైన ఆత్మీయత కనిపిస్తోందని ప్రిన్స్ ట్వీట్ చేశారు.ఫాహద్ సర్ మీరు అద్భుతమైన నటుడని.. ప్రయోగాలు చేయడం, మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం చూడటం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మీతో పాటు చిన్నారి ముద్దుల సారా కలిసి అద్భుతంగా నటించారని కొనియాడారు. అన్ని పాత్రలు ప్రతి క్షణం జీవించేశారని మహేశ్ బాబు ప్రశంసించారు.మహేశ్‌బాబు తన ట్వీట్లో రాస్తూ.. 'కార్త్.. ఇంతకంటే ప్రత్యేకమైన ఆరంభాన్ని నువ్వు కోరుకోలేవు. ఈ సినిమా కోసం మీరు పడిన శ్రమ చూసిన తర్వాత.. మీరు ఇక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు, శోభు కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని సృష్టించారు. మీ ఇద్దరి సక్సెస్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. శశాంక్ మీరు అద్భుతంగా నటించారు. ఈ అందమైన ప్రపంచాన్ని ఒకచోట చేర్చిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. మీ చేతిలో ఒక ఆణిముత్యం ఉంది.. అక్టోబర్ 2వ తేదీ… ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఆనందించాలి' అని పోస్ట్ చేశారు. Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!! Fahadh sir - u…— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026 -
'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
యాంకర్ సుమతో జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి హిలేరియస్ ఫన్
-
కొడుకు స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి
-
చాలా రోజుల తర్వాత NTR ఎమోషనల్ స్పీచ్
-
పులిలా వచ్చిన ఎన్టీఆర్.. రాజమౌళి ఏర్పాట్లు అదుర్స్
ఫహాద్ ఫాజిల్ హీరోగా రానున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్.రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందించారు. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు ( మంగళవారం)హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత రావడంతో చిత్ర బృంద వినూత్నంగా ఏర్పాట్లు చేసింది. స్ట్రీన్‌పై ‘యమదొంగ’ సీన్‌ని రీక్రియేట్ చేసింది. ఒక్కసారిగా అలా ఎన్టీఆర్ రావడంతో ఈవెంట్లో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ అభిమానులు అంతా మార్మోగేలా అరిచారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..Tiger’s Goosebumps Entry🐯🔥#NTR pic.twitter.com/KCfoRUn2ya— cinee worldd (@Cinee_Worldd) September 29, 2026 -
‘ఓ చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఓపిక ఎక్కువ’
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్లకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు పంచుకోరు. అయితే తాజాగా ఫహాద్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆయన సారా పాలేకర్ గురించి మాట్లాడారు. షూటింగ్ సమయంలో ఆమె చూపించిన ఓపిక, నటన కోసం చేసిన సన్నాహకాలను ఫహాద్ ప్రశంసించారు. ఈ క్రమంలో తన భార్య నజ్రియాను ప్రస్తావిస్తూ సరదాగా మాట్లాడారు.ఇదీ చదవండి: కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..నేను ఓ చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాను‘నేను ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అందుకే పిల్లలను చూసుకోవడంలో మీకు ఇంత ఓపిక వచ్చింది. కొందరు నన్ను అడుగుతుంటారు. ఇంత ఓపిక ఎక్కడిది అని. ఇంట్లోనే ఒకరు ఉన్నారు.. ఆమెను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్తుంటాను.’ అంటూ ఫహాద్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం సారా పాలేకర్ తనతో ఎంతో ఓపికగా వ్యవహరించారని, ఇప్పటివరకు తనకు ఇంత ఓపిక ఉన్న సహనటి మరొకరు ఎదురుకాలేదని చెప్పారు.వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా..ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ‘బెంగళూరు డేస్’ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. 2014లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా బయటకు చెప్పని ఈ జంట.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.సినిమా విషయానికి వస్తేఇక సినిమా విషయానికి వస్తే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్.రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు ( మంగళవారం)హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇదీ చదవండి: నన్ను గోడకేసి కొట్టేసే వారు.. అవతల పడేవాడ్ని: త్రివిక్రమ్ -
‘ది ప్యారడైజ్’కి పోటీగా 6 సినిమాలు.. ఇదీ టాలీవుడ్ పరిస్థితి!
‘ఒకటి పోతే మరొకటి’ అన్నట్టుగా టాలీవుడ్లో ఒక వారం మారగానే కొత్త సినిమాల సందడి మొదలవుతోంది. ఒక వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. మరో వారం చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకుల తీర్పే అంతిమం. గత వారం ‘ది ప్యారడైజ్’ హవాతో థియేటర్లు కళకళలాడగా.. ఈ వారం(అక్టోబర్ 2) మాత్రం ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఎవరి సినిమా ఎంతవరకు నిలబడుతుందనే ఆసక్తి నెలకొంది.గతవారం అంతా టాలీవుడ్లో ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరిగింది. ప్రీమియర్ షోలతో మొదలైన హంగామా ఆదివారం వరకు కొనసాగింది. సినిమా టాక్, కలెక్షన్లు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. ఇలా ట్రేడ్ వర్గాల్లో లెక్కలు జోరుగా సాగాయి. ‘లెక్కలు తేలితే గానీ అసలు సంగతి తెలియదు’ అన్నట్టుగా ఈ సినిమా విషయంలోనూ వసూళ్లపై చర్చ కొనసాగుతూనే ఉంది.(చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)అయితే ఇప్పుడు కొత్త వారం వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ బరిలోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఈ వారం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’, ‘తెల్లకాగితం’, ‘అనకాపల్లి’, ‘ప్రేమ అనే ఊరిలో’ వంటి తెలుగు సినిమాలతో పాటు ‘డొరోతి’ అనే డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఫహాద్ ఫాజిల్ సినిమాపైనే అందరి చూపుఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కానుండటంతో మూవీపై మరింత బజ్ వచ్చే అవకాశం ఉంది. ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు సినిమా కాన్సెప్ట్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.విజయ్ తనయుడి ‘సిగ్మా’పై ఆసక్తిమరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’**పై కూడా ప్రేక్షకుల దృష్టి ఉంది. దర్శకుడిగా సంజయ్ తొలి అడుగు కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. కొత్త దర్శకుడి ఆలోచన ఎలా ఉండబోతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే చర్చ కూడా జరుగుతోంది.‘తెల్లకాగితం’కు పాజిటివ్ బజ్ఈ వారం వస్తున్న మరో సినిమా ‘తెల్లకాగితం’. విడుదలకు ముందే ఈ సినిమాను పలువురు దర్శకులకు చూపించి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌పై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.కంటెంట్ వర్కవుట్ అయితే చిన్న సినిమా కూడా పెద్ద ప్రభావం చూపించగలదనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అందుకే ‘తెల్లకాగితం’పై కూడా ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే మరోసారి ‘కోర్ట్’ తరహా కంటెంట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది.‘డొరోతి’పై వివాదాల ప్రభావం?ఇక ఈ జాబితాలో డబ్బింగ్ సినిమా ‘డొరోతి’ కూడా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తమిళంలో ఇప్పటికే వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చ తెలుగు వెర్షన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.‘పారడైజ్’ రెండో వారం కీలకంకొత్త సినిమాల సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో ఉన్న ‘ది ప్యారడైజ్’కు ఈ వారం చాలా కీలకం. మొదటి వారం హడావుడి పూర్తయిన తర్వాత రెండో వారంలో సినిమా ఎంత నిలబడుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.సోమవారం కూడా సినిమాకు నిలకడైన వసూళ్లు కనిపించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకుని ‘పారడైజ్’ ఎంత వసూళ్లు సాధిస్తుందనేది కీలకంగా మారింది. -
ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. కన్నీరుపెట్టుకున్నా: రాజమౌళి
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫహాద్ ఫాజిల్. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. అయితే తాజాగా తమిళనాడులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ పాల్గొని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.ఇదీ చదవండి: డింపుల్ డెడికేషన్‌కి ఫిదా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..!‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తనను ఒకే ఒక్క లైన్‌తో కట్టిపడేసింది. ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన కథ ఇది అనే ఒక్క లైన్‌లోని మాట వినగానే పూర్తిగా హుక్ అయ్యాను. ఆ లైన్లోనే ఆసక్తి, ఉత్కంఠ, వినోదం ఉన్నాయి. ఆ తర్వాత పూర్తి కథ విన్నప్పుడు ఇది అద్భుతమైన కథ అనిపించింది అని రాజమౌళి తెలిపారు. ఇక సినిమాలో సూరి పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవం పోశారని రాజమౌళి ప్రశంసించారు. డబ్బింగ్, మ్యూజిక్ లేకుండా ఫస్ట్ కాపీ చూసినప్పటికీ సినిమా తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయానని వెల్లడించారు. హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో.. కాగా అల్లావుద్దీన్ స్టైల్లో మాయలు, మంత్రాలు తెలిసిన ఓ చిన్న పాప.. హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అనే విషయాల్ని ట్రైలర్లో కామెడీగా చూపించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మరి మలయాళంలో ఇప్పటికే హిట్స్ అందుకున్న ఫహాద్‌కి తెలుగులో హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి?ఇదీ చదవండి: ‘అన్నా.. అని పిలిచా కదరా.. చిన్న పిల్లాడ్ని చేసి ఇలా..


