టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మూవీ రివ్యూ ఇచ్చారు. ఫాహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా వీక్షించిన మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ అద్భుతమైన, పరిపూర్ణమైన అనుభవంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. పూర్తిగా వినోదాన్ని అందిస్తూ హృదయాన్ని లోతుగా తాకే కథతో నిర్మించారు. ఈ సినిమా అంతటా ఒక అరుదైన ఆత్మీయత కనిపిస్తోందని ప్రిన్స్ ట్వీట్ చేశారు.
ఫాహద్ సర్ మీరు అద్భుతమైన నటుడని.. ప్రయోగాలు చేయడం, మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం చూడటం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మీతో పాటు చిన్నారి ముద్దుల సారా కలిసి అద్భుతంగా నటించారని కొనియాడారు. అన్ని పాత్రలు ప్రతి క్షణం జీవించేశారని మహేశ్ బాబు ప్రశంసించారు.
మహేశ్‌బాబు తన ట్వీట్‌లో రాస్తూ.. 'కార్త్.. ఇంతకంటే ప్రత్యేకమైన ఆరంభాన్ని నువ్వు కోరుకోలేవు. ఈ సినిమా కోసం మీరు పడిన శ్రమ చూసిన తర్వాత.. మీరు ఇక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు, శోభు కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని సృష్టించారు. మీ ఇద్దరి సక్సెస్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. శశాంక్ మీరు అద్భుతంగా నటించారు. ఈ అందమైన ప్రపంచాన్ని ఒకచోట చేర్చిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. మీ చేతిలో ఒక ఆణిముత్యం ఉంది.. అక్టోబర్ 2వ తేదీ… ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఆనందించాలి' అని పోస్ట్ చేశారు.
Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!!
Fahadh sir - u…— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026


