రవితేజ ఇరుముడి.. మరో క్రేజీ రికార్డ్‌ సొంతం..! | Ravi Teja's Irumudi Movie Creates Carzy Record in OTT Also | Sakshi
Sakshi News home page

Irumudi Movie: రవితేజ ఇరుముడి.. అక్కడ కూడా తగ్గేదేలే..!

Sep 30 2026 4:17 PM | Updated on Sep 30 2026 4:51 PM

Ravi Teja's Irumudi Movie Creates Carzy Record in OTT Also

రవితేజ హీరోగా వచ్చిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది.

తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఓటీటీలో క్రేజీ రికార్డ్‌ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో వారం రోజుల పాటు టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఒక్క వీకెండ్‌లోనే ఏకంగా 3.4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రపంచ స్థాయిలో ఇరుముడి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

సెప్టెంబర్ 18న స్ట్రీమింగ్‌‌కు వచ్చిన ఈ చిత్రం, తొలి మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇప్పటివరకు ఓవరాల్‌గా 6.8 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ మెప్పించింది. ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్రలో మెరిశారు.  ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement