ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్‌ రిపీట్‌! | Attempt To Trap KGVB Students In Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్‌ రిపీట్‌!

Sep 30 2026 11:40 AM | Updated on Sep 30 2026 12:13 PM

Attempt To Trap KGVB Students In Prakasam District

సాక్షి, ప్రకాశం జిల్లా: రవితేజ–శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనక్కర్లేదు. తండ్రి–కూతుళ్ల అనుబంధం, మరీ ముఖ్యంగా ప్రతీ ఆడకూతురిలో కన్నబిడ్డను చూసుకోవాలని దర్శకుడు ఇచ్చిన సందేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ‘స్పెషల్ క్లాసుల’ పేరుతో విద్యార్థినులను టార్గెట్ చేసే సీన్‌ గుర్తుందా? అదే తరహా ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. 

జిల్లాలోని జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థులను హాస్టల్‌ వంట మనిషి మభ్యపెట్టి ఒంగోలు టౌన్‌కి తీసుకెళ్లింది. పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. సదరు వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో బయటకు పరుగులు పెట్టిన విద్యార్థులు స్థానికులకు విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

నిందితుడి ఇంటిపై విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. ఘటనా స్థలంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డీఆర్‌డీఎలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా గుర్తించారు. కాగా, కేజీవీబీల్లో చదువుకునే బాలికల భద్రత విషయంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? వంట మనిషి విద్యార్థినులను ఎందుకు ఒంగోలు తీసుకెళ్లింది?. నిందితుడి ఇంటికే ఎందుకు తీసుకెళ్లారు?. విద్యార్థినులను అక్కడికి తీసుకెళ్లే ముందు వారికి ఏం చెప్పారు? అసలు ఇదంతా ఎంత కాలంగా నడుస్తోంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వంట మనిషికి, నిందితుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ?. ఈ వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కన్నీళ్లతోనే చంద్రబాబుకు వార్నింగ్‌ ఇచ్చాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement