శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం | Hyderabad Airport: Vijayawada Bound Flight Makes Emergency Landing After Technical Glitch | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

Sep 30 2026 10:21 AM | Updated on Sep 30 2026 10:37 AM

Hyderabad Airport: Vijayawada Bound Flight Makes Emergency Landing After Technical Glitch

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ వెళ్తున్న ఓ విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం బయటపడింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 591 ఎయిర్‌లైన్స్‌ విమానం బయల్దేరింది. టేకాఫ్‌ అయిన తర్వాత కొద్దిసేపటికే పైలట్‌ సాంకేతిక సమస్యను గుర్తించినట్లు సమాచారం. పరిస్థితిని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కి తెలియజేసిన పైలట్‌.. విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్‌లోనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

విమానంలో 45 మంది ప్రయాణికులు
ఈ విమానంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపానికి సంబంధించిన పూర్తి వివరాలు, విమానం తిరిగి ఎప్పుడు విజయవాడకు బయలుదేరుతుందన్న అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: షాకిచ్చిన టీవీకే.. ఏకంగా దుకాణం బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement