వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు | Case Registered Against Veeramachineni Ramakrishna | Sakshi
Sakshi News home page

వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు

Sep 30 2026 10:28 AM | Updated on Sep 30 2026 11:57 AM

Case Registered Against Veeramachineni Ramakrishna

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు నమోదైంది. రామకృష్ణ డైట్‌ పాటించి అస్వస్థతకు గురైనట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. వీరమాచినేని సోషల్‌ మీడియా వీడియోలు చూసి చికిత్స కోసం సాయికృష్ణ వెళ్లారు. టైప్‌-1 డయాబెటిస్‌ తగ్గిస్తానని డైట్‌ చెప్పారన్న బాధితుడు.. ఇన్సులిన్‌ వాడకుండా తన డైట్‌ పాటించాలని సూచించారని.. అయితే, డైట్‌ తీసుకున్న రెండు రోజుల్లోనే తీవ్ర అనార్యోగానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

చికిత్స పేరుతో రూ.26 వేలు తీసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. చికిత్సా సలహాలు, డైట్‌ విధానంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సాయికృష్ణ.. 2018 నుంచి టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. నిర్మల్‌ జిల్లాకు చెందిన లా విద్యార్థి సాయికృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం, మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ కుట్ర తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. తనకు పరిహారం చెల్లించాలంటూ ఫిర్యాదుదారు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: గుండెకు ఆరోగ్యం 'అలవాటు' చేద్దామా?

 


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement