case registered
-
పోలీసు పహారాలో హెచ్‌సీయూ
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్‌లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల రిమాండ్ పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ఎఫ్ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. వీరిపై బీఎన్ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేటి నుంచి తరగతుల బహిష్కరణ హెచ్‌సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్ఏ, ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్‌యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్ఎఫ్, పీ డీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఐఓ, టీఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్ర
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. తాజాగా బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. -
భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. -
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
-
మహాసేన రాజేష్‌పై కేసు నమోదు
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్‌పై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌పై కేసు నమోదుచేశారు పోలీసులు. మహాసేన రాజేష్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు. -
డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడికాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భీమాస్ పారడైజ్ రూం నంబర్ 105,109లో తన ప్రమేయం లేకుండా లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదులో బాధితులు తెలిపింది. భీమాస్ పారడైజ్ హోటల్లో సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు.కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ మరో కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్డ్రైవ్లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఆమె తండ్రిపై కేసు ఫైల్
ముంబై: దేశంలోనే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పూణే కలెక్టరేట్లో ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు దిలీప్ ఖేద్కర్‌పై నమోదైంది.వివరాల ప్రకారం.. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ హంగామా క్రియేట్ చేశారు. పూణేలోకి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. అక్కడి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన కూతరు పూజా ఖేద్కర్‌కు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేసినట్టు కలెక్టరేట్‌కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే తెలిపారు. ఇక, ఈ విషయమై అకాడే పోలీసులకు దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Maharashtra | A case has been registered against Dilip Khedkar - father of former IAS trainee officer Puja Khedkar under IPC sections 186, 504 and 506 at Bundgarden Police station last night: DCP Smarthna Patil, Pune PoliceWhile Puja Khedkar was posted at the Pune Collector's…— ANI (@ANI) August 9, 2024మరోవైపు.. ఇప్పటికే పూజా ఖేద్కర్ పేరెంట్స్ పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని గన్‌తో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెపైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె తండ్రిపై కేసు నమోదైంది.ఇదిలా ఉండగా.. పూణే ఖేద్కర్ ఎపిసోడ్లో తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందినట్టు తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ ఎంపికను రద్దు చేసిన విషయం విధితమే. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియో వైరల్.. కేసు నమోదు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జగన్ పై రఘురామ పెట్టిన కేసు.. ఆధారాలతో పొన్నవోలు కౌంటర్
-
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు. సుప్రీంకోర్టు కాదన్నా.. కక్ష సాధింపు. ఇదీ టీడీపీ కూటమి బరితెగింపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని జెడ్పీ సీఈవో ఎం.శ్రీనివాస్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచి్చన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. జెడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే ఫిర్యాదు హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలపై తాను జెడ్పీ సమావేశంలో ప్రశ్నించేందుకు ప్రయత్నించగా జెడ్పీ సీఈవో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధిగా ప్రశి్నస్తున్న సమయంలో తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా జెడ్పీ సీఈవో ప్రొటోకాల్ ఉల్లంఘించారని కౌశిక్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విచారణ చేసి సీఈవోపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
సుభాష్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.మా భూమిని ఆక్రమించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్‌గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. -
కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. మహిళతో కలిసి అరాచకం!
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్‌హౌస్‌లో ఒకరిని నిర్బంధించడంతో పాటు దాడి చేసి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకానికి పాల్పడ్డారు. న్యాయం కోసం కన్నరావు వద్దకు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్‌రావు వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న నందిని స్కెచ్ వేసింది. కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై కేసును పోలీసులు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కాగా, గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయి. -
కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు
-
కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు
-
టీడీపీ నేత బొండా ఉమాపై కేసు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): తన కుమారుడి మృతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల మరణించిన నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన యువకుడు కైకాల శరణ్ తల్లి అంజలీదేవి శనివారం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వెలంపల్లి శ్రీనివాసరావు ఒత్తిడి చేయటం వల్ల తన కుమారుడు మృతిచెందాడని బొండా ఉమా, ఆయన అనుచరులు స్థానికంగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ స్వార్థం కోసం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. తన కుమారుడి మృతిపై తప్పుడు ప్రచారం చేయడంతోపాటు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన బొండా ఉమా, బేతు రామ్మోహన్రావు, ఆల తారక రామారావు, పైడి శ్రీను, చలమలశెట్టి శ్రీను, హనుమంతరావు, విజయ్‌కుమార్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు
-
నటి సామ్యా జానుపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాప్చెరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304ఏ కింద లాస్య పీఏ ఆకాశ్‌పై కేసు నమోదు చేశారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ ఫోన్ చేశారని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్ఆర్ పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్‌లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సంజయ్ షా (56) ప్రాణాలు కోల్పోయా రు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ రాజు అలియాస్ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై నుంచి అమెరికా దాకా.. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్‌లతో పాటు జర్మనీలోని సాప్ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్ రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా ఎంచుకుంది. లైమ్లైట్ గార్డెన్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్‌ను బుక్ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ.. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీపైన ఉన్న రూఫ్‌కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్‌ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్‌ఫామ్ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్‌ఫామ్ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్‌కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్‌ఫామ్‌ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్‌ఫామ్ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్‌తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు విస్టెక్స్, ఫిల్మ్ సిటీ ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్ సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్‌లో సంజయ్ షాను హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు జానకిరామ్ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ (ఉషా కిరణ్ ఈవెంట్స్), సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి.ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్‌గా ఉన్న ఎస్.సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్.దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 336, 287 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. భార్య కళ్ల ఎదుటే ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ సీఈఓ సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్‌లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. -
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
తిరువనంతపురం: ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులుగా ఫోన్స్ చేస్తూ మోసం చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫ్రెండ్స్ ఫేసులతో వీడియో కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా, కేరళలో తొలి డీప్ ఫేక్ కింద కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి రాధాకృష్ణన్ డీప్ ఫేక్ మోసంలో చిక్కుకొని రూ.30 వేలు పోగొట్టుకున్నారు. ఇక, ఆయన ఫిర్యాదుతో కేరళలో తొలి డీప్‌ఫేక్ మోసం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, రాధాకృష్ణన్ కోల్ఇండియా సంస్థలో పని చేసి రిటైరయ్యారు. కాగా, ఆయన పనిచేస్తున్న సమయంలో వేణుకుమార్ అనే మరో వ్యక్తిగా విధులు నిర్వర్వించారు. ఈ క్రమంలో కేటుగాళ్లు వేణుకుమార్ ఫొటో సాయంలో డీప్ ఫేక్ మోసానికి పాల్పడ్డారు. అయితే, వేణుకుమార్ పేరుతో ఇటీవల రాధాకృష్ణన్‌కు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి.. తాను దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇండియాలో తన సోదరి ఆపరేషన్ కోసం రూ.40 వేలు అత్యవసరంగా కావాలని రిక్వెట్ చేశాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా వీడియోలో వేణుకుమార్ ముఖం కనిపించడంతో రాధాకృష్ణన్ వెంటనే డబ్బులు పంపించారు. Kerala Police has managed to arrest a man involved in #deepfake scam from gujarat (with assistance from Gujarat Police) who defrauded a man in Kozhikode, Kerala. @VishKVarma follow up coming in English?🤭 pic.twitter.com/3qoANpASag — Sapna Singh (@AdvSapna_) November 9, 2023 ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత రాధాకృష్ణన్‌కు వేణుకుమార్‌లాగా మళ్లీ ఫోన్ చేసి మరో రూ.30 వేలు కావాలని కోరారు. దీంతో, రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తేరుకున్న రాధాకృష్ణన్.. తన స్నేహితుల సాయంతో వేణుకుమార్ ఫోన్ నెంబరును తెలుసుకున్నాడు. అనంతరం, అతడికి కాల్ చేసి.. వివరాలు అడిగాడు. ఈ క్రమంలో వేణుకుమార్.. తాను ఏపీలో ఉన్నానని, ఫోన్ చేయలేదని చెప్పటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటనపై రాధాకృష్ణన్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు గుజరాత్‌కు చెందిన షేక్ మర్తుజ్‌మియాగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు సీపీ రాజ్‌పాల్ మీనా తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కుశాల్‌షా పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. -
శ్రీకాళహస్తి టిడిపి ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు నమోదు
-
టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు
హైదరాబాద్ : టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ పై కేసులు. కోకాపేట్ ORR నియో పోలీస్ వద్ద పోలీసులపై దౌర్జన్యం. Orrపై వెళ్లకుండా టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని అడ్డుకున్న పోలీసులు. పోలీస్‌లను తోసేసి అనుచరులతో నానా హంగామా చేసిన మాజీ ఎంపీ మాగుంటబాబు. ఎస్సై, సిఐలను మీ అంతుచూస్తానని బెదిరింపులు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన TDP నేతలు. నార్సింగ్ పిఎస్ లో IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు -
విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
ముదివేడు పీఎస్ లో చంద్రబాబుపై కేసు నమోదు
-
అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులను ఇష్టానుసారం మాట్లాడారు. డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
కృష్ణలంక పీఎస్ లో పవన్ పై కేసు నమోదు
-
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
వీడియో: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు
-
ఏసీబీకి చిక్కిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
కర్నూలు: కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్‌నగర్‌లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1999లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే.. కర్నూలులోని శ్రీరామ్ నగర్లో జి+2 ఇల్లు, అశోక్ నగర్లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు. డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు
-
కుప్పం పోలీస్‌స్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. నిన్న కుప్పం బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా.. జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది. ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. చదవండి: లోకేశ్ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు? -
కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఎన్హెచ్ఆర్సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదుదారుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు. -
మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు
-
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఎస్సై ఐ.వీర్రాజు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభాకర్‌ను ప్రభుత్వాసుపత్రి నుంచి పెదవేగి తరలిస్తుండగా సోమవరప్పాడు బైపాస్ వద్ద జీపు దిగి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి వెళ్లిపోయారన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీపు డ్రైవర్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 2/23తో 341, 24, 506, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్‌పై ఈ నెల 2న కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. చదవండి: (చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్) -
గుంటూరు తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు
-
ఫామ్ హౌస్ డీల్ పై కేసు నమోదు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు
-
విశాఖ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు
-
భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో సీఐ.. అసలేం జరిగింది?
వరంగల్ క్రైం: వరంగల్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయం కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. సుబేదారి సీఐ షుకుర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీఐడీలో పనిచేస్తున్న ఓ మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమకొండ రాంనగర్లో ఉంటోంది. ఆమె భర్త రవికుమార్ మహబూబాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. చదవండి: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని.. సోమవారం మధ్యాహ్నం వరంగల్ సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవి.. రాంనగర్‌లోని మహిళా ఇన్స్పెక్టర్ ఇంటికి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లాడు. ఆమె భర్త రవికుమార్ తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బాల రవిని చూసి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. బాల రవి తిరిగి రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో తాను లేని సమయంలో, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవిపై కేసు నమోదు చేయాలని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాల రవిపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం పోలీస్‌శాఖలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
అయ్యన్న పాత్రుడు ఇంటికి మరోసారి పోలీసులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై ఏయూ జేఏసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జేఏసీ ఫిర్యాదు మేరకు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి త్రీటౌన్ పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంటిదగ్గర అయ్యన్న లేకపోవడంతో అయ్యన్న కుటుంబసభ్యులకు నోటీస్ విషయాన్ని పోలీసులు తెలియపర్చారు. చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న -
ఆబిడ్స్ పీఎస్ లో ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
-
పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు మరికొందరిపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. అయితే రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మల్లికార్జున తదితరులతో కలిసి సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రచార వాహనంపై నుంచి సునీత, శ్రీరామ్, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు కొండప్ప, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రసంగాలు చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. చదవండి: (హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్) -
ఫేస్బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ప్రేమించానని నమ్మించి యువతిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరానికి చెందిన వేము శిరీష (25)కు వన్‌టౌన్‌కు చెందిన రాయన రవితేజ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు చదవండి: టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స్టూడియోలో.. కొంత కాలం తర్వాత రవితేజ శిరీషను ప్రేమిస్తున్నాని చెప్పడంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. తీరా పెళ్లి చేసుకోమని అడిగే సరికి కాదనడమే కాకుండా ఈ విషయం అడిగేందుకు వెళ్లిన శిరీష తల్లి, బంధువులను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రవితేజతో పాటు చెల్లి, బావ, స్నేహితుడైన హేమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అద్భుత కలశం పేరుతో బురిడీ
నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా) : తమ వద్ద అతీత శక్తులున్న అద్భుత కలశం ఉందంటూ చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె, కలికిరి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురి నుంచి రూ.9 లక్షల నగదు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు ఆదివారం నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ ఫాతిమా కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలం, వెంకోజిగారిపల్లెకు చెందిన మల్లేశ్వరరావు, తవళం గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, కలికిరి మండలం, గొల్లపల్లెకి చెందిన చిన్నబ్బ, కలికిరికి చెందిన రమణారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇటీవల తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కేశవరాజు కుప్పంకు చెందిన పలువురిని కలిశారు. తమ వద్ద అతీత శక్తులు కలిగిన, అద్భుత పురాతన కలశం ఉందని, దానికి చాలా మహిమలున్నాయని, గుప్త నిధులు, బియ్యం ఆకర్షించగలదని నమ్మించారు. కలశం ఉన్నవారికి సిరి సంపదలు, అతీత శక్తులు సిద్ధిస్తాయని చెప్పారు. రూ.కోట్లు విలువ చేసే కలశాన్ని రూ.20 లక్షలకే ఇస్తామనడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో శనివారం నిమ్మనపల్లె మండలం, ముష్ఠూరు గ్రామం, బహుదా ప్రాజెక్టు వద్దనున్న అమ్మవారి గుడివద్ద కలశాన్ని అందజేస్తామన్నారు. బాధితులు శనివారం నిందితులను కలిసి, కలశం ఇవ్వాలని అడగ్గా.. గుడిలో కలశానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, పూజల అనంతరం రాత్రికి కలశాన్ని తీసుకెళ్లవచ్చునని చెప్పారు. వారి మాటలు నమ్మి రూ.9 లక్షల నగదును నిందితులకు అందజేశారు. అంతే.. నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు. కలశం కోసం వెళ్లిన బాధితులకు అక్కడ కలశం లేకపోవడం.. నిందితులు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఫాతిమా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
కొండపల్లిలో రచ్చ.. దేవినేని ఉమాపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం (విజయవాడ): కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో పోలీస్‌శాఖ విధించిన 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్ మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేసి జాతీయ రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఈ పరిణామాలతో 143, 341, 269, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలియజేశారు. అలాగే గురువారం మధ్యాహ్నం దేవినేని ఉమ, టీడీపీ కార్యకర్తలు కలిసి గొల్లపూడి వన్ సెంటర్ నుంచి సాయిపురం కాలనీకి వెళ్లే రోడ్డుపై గుంపులు గుంపులుగా చేరి టపాసులు కాలుస్తూ శబ్ద కాలుష్యాన్ని కలిగించారు. దీంతో ఉమాతోపాటుగా పఠాన్ అబ్బాస్, ఎ.చిన్న, బొమ్మసాని సుబ్బారావు, రామినేని రాజా, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వృద్ధుడి పైశాచికం.. కామంతో కళ్లు మూసుకుపోయి..
పెదకాకాని(గుంటూరు జిల్లా): ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు అయింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల ముస్లింపాలెంకు చెందిన షేక్ సుబాని చిల్లరకొట్టు నిర్వహిస్తున్నాడు. స్థానిక ఎస్టీకాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు అప్పుడప్పుడు చిల్లర కొట్టుకు వస్తూ ఉంటుంది. కామంతో కళ్ళు మూసుకు పోయిన 65 ఏళ్ల సుబాని ఈనెల 16వ తేదీన కొట్టుకు వచ్చిన చిన్నారిని కొట్టు వెనుకకు తీసుకు వెళ్లి కుర్చిలో కూర్చుని బాలికపై లైంగిక దాడి చేశాడు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. చిన్నారి ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో స్థానికంగా పంచాయతీ నడిపించారు. పంచాయతీ ద్వారా న్యాయం జరగకపోవడంతో చిన్నారి తల్లి శీలం భవాని శుక్రవారం రాత్రి పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితుడైన సుబాని గత నెల రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనా ప్రదేశాన్ని శనివారం దిశ డీఎస్పీ రవికుమార్, సిబ్బందితో సందర్శించి వివరాలు సేకరించారు. చదవండి: ప్రేమను అంగీకరించలేదు.. కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే.. -
మసాజ్ చేయమని కత్తితో బెదిరించి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు..
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణాలు చేస్తానని చెప్పి వినియోగదారులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై అసహజ లైంగికదాడి కేసు నమోదయ్యింది. శ్రీధర్‌రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సనత్‌నగర్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సీహెచ్ చౌదరి (పూర్తి పేరు రాయడం లేదు).. స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మసాజ్ చేయమని, కత్తితో బెదిరించి.. నందగిరి హిల్స్‌లో ఉంటున్న శ్రీధర్‌రావు దగ్గర చౌదరి జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు, బాడీగార్డుగా పని చేస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీ రాత్రి ఇద్దరూ బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తర్వాత సెకండ్ ఫ్లోర్‌లోని తన బెడ్ రూమ్‌కు రమ్మని చౌదరికి చెప్పిన శ్రీధర్‌రావు.. వెన్నునొప్పిగా ఉందంటూ మసాజ్ చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్‌రావు కొన్ని పిల్స్ వేసుకోవడం గమనించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్‌రావు బలవంతంగా దగ్గరకు లాక్కోవడం ప్రారంభించాడు. చౌదరి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో కత్తితో బెదిరించాడు. చౌదరి నిరాకరించడంతో కత్తితో చొక్కా సహా బట్టలన్నీ చింపేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు..: తాను వద్దంటూ వారిస్తున్నా, ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా శ్రీధర్‌రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. రెండు గంటల పాటు నరకం అనుభవించానని, విపరీతమైన రక్తస్రావం జరిగిందని తెలిపాడు. ఈ విషయం బయటకు చెíపితే చంపేస్తానని శ్రీధర్‌రావు బెదిరించినట్లు పేర్కొన్నాడు. తాను ఇన్నాళ్లూ భయపడ్డానని, ఇప్పుడతని మోసాలు బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చౌదరి పోలీసులకు తెలిపాడు. చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుపై సనత్‌నగర్ పోలీసులు.. అసహజ లైంగిక దాడి, బెదిరింపులకు సంబంధించి ఈ నెల 18న ఎఫ్ఐఆర్ (814/2021) నమోదు చేశారు. కాగా, చీటింగ్ కేసులో గురువారం అరెస్టయిన శ్రీధర్‌రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాయదుర్గం ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. -
నారా లోకేష్‌పై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు నమోదైంది. సీఐ నాయక్‌పై దాడి చేశారని లోకేష్ సహా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. లోకేష్‌పై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏ-1 నారా లోకేష్, ఏ-2 అశోక్‌బాబు, ఏ-3 ఆలపాటి రాజా, ఏ-4గా శ్రవణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ -
నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి. గురువారం విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ..
ఓడీ చెరువు(అనంతపురం జిల్లా): టీవీ రిపోర్టర్‌గా చెప్పుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడిపై ఓడీ చెరువు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ గోపి తెలిపిన మేరకు.. గత నెల 24న మహేంద్రనాయక్ అనే యువకుడు తాను ఓ ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ ఓడీ చెరువు మండలం కొండకమర్ల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు టీ భాస్కర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాడు. ఆ పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న జయలక్ష్మికి సంబంధించిన అనుమతుల పత్రాల నకళ్లు కావాలని అడిగాడు. తప్పుడు విధానంలో ఆమెను ఎంపిక చేశారని, తనకు డబ్బు ఇస్తే ఈ విషయం వెలుగు చూడకుండా ఉంటుందని, లేకపోతే తమ న్యూస్ చానల్లో ప్రసారం చేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంగా ఆ న్యూస్ చానల్ ప్రతినిధులతో భాస్కర్ నేరుగా మాట్లాడి, అతను నకిలీ అని ధ్రువీకరించుకుని, పుట్టపర్తి డివిజన్ న్యూస్ చానల్ ప్రతినిధి కేశవతో కలిసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? -
టీటీడీపై దుష్ప్రచారం చేసిన 18 మందిపై కేసు
తిరుమల: తిరుమల శ్రీవారికి చెందిన 1,500 కిలోల బంగారు నగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ, పండు బుద్దాల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులను పోస్టు చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్ ఖాతాల నుంచి షేర్ చేశారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,500 కిలోల బంగారాన్ని ఎస్బీఐలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. మమ్మల్ని తరువాత కాపాడండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. స్వామీ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద’ అని టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారు. భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో వీరు ఈ దుష్ప్రచారం చేశారని విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోడు పోరులో చంటిబిడ్డల తల్లులు జైలుపాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌కు చెందిన పోడు భూముల సాగుదారుల అరెస్టు వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. మొత్తం 23 మందిపై కేసు నమోదవగా వారిలో గురువారం 12 మందిని, శుక్రవారం మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో 18 మంది మహిళలే ఉండటం గమనార్హం. అయితే పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముగ్గురు మహిళలకు ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డలు ఉండటం, వారిని సైతం పోలీసులు శుక్రవారం ఖమ్మం 3వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి కోర్టు ఆదేశంతో 14 రోజుల రిమాండ్‌కు తరలించడంపై కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తమపై ఫారెస్ట్ అధికారులు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ కేసులో ఆలకుంట రాణి ఏడాది వయసున్న తన కూతురితో గురువారం జైలుకెళ్లగా.. ఎత్తేరు కవిత 8 నెలల పాపతో, ఆలకుంట మౌనిక మూడు నెలల పాపతో శుక్రవారం జైలుకెళ్లింది. అసలేం జరిగిందంటే.. కొణిజర్ల మండలంలోని గుబ్బగుర్తి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న సుమారు 20 హెక్టార్లలోని అటవీ భూమిలో ఎల్లన్ననగర్ వాసులు వేసిన పత్తి, కంది పంటలను తొలగించేందుకు ఇటీవల అటవీ అధికారులు రావడంతో స్థానిక మహిళలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకొని పోడు సాగు దారులను వెళ్లగొట్టారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అందరూ ఖండించాలి... మహిళా రైతులపై అటవీ శాఖ రేంజర్ రాధిక కక్షగట్టి దాడులకు దిగుతోందని, తల్లీపిల్లలపై 307 హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించిన వైనాన్ని అందరూ ఖండించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మహిళలపై దాడి చేసి, దూషించినందుకు రేంజర్ రాధికపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పత్తి తొలగించవద్దన్నందుకు.. 20 ఏళ్లుగా ఎకరం భూమిలో పోడు కొట్టు కుని వ్యవసాయం చేస్తున్నాం. ఈ ఏడాది పత్తి సాగు చేశాం. అటవీ అధికారులు పత్తి పీకేస్తుంటే తొలగించొద్దని అడ్డుకు న్నాం. దాడి చేశామని మాపై కేసు పెట్టారు. నేను, నా భార్య తప్ప మాకెవరూ లేరు. మూడో బిడ్డ వయసు సంవత్సరం ఉంటుంది. ఆ పాపతోనే నా భార్య జైలుకు పోయింది. – ఆలకుంట శ్రీను, ఆలకుంట రాణి భర్త అక్రమంగా కేసులు పెట్టారు... మేము అర ఎకరం పోడుచేస్తున్నాం. పచ్చని పంటను అటవీ అధికారులు నాశనం చేశారు. ఎంత బతిమిలాడినా వినలేదు. మాపై అక్రమంగా కేసులు పెట్టారు. మహిళలు అడ్డొస్తున్నారని, గూడెంలోని ఎక్కువ మంది మహిళలపై కేసులు పెట్టారు. నా బిడ్డ వయసు మూడు నెలలు. పాపతోనే నా భార్య జైలుకెళ్లింది. అటవీ అధికారులు మాపై కక్షకట్టారు. – జమలయ్య, ఆలకుంట మౌనిక భర్త -
ఉన్నత ఉద్యోగం వచ్చిన ఏడాదికే.. ఊడింది!
ముంబై: మహారాష్ట్ర స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్పీసీఏ) ప్యానెల్లో ఉద్యోగం పొందిన ఏడాది తరువాత, క్రిమినల్ నేపథ్యం ఉన్నందుకు రాజ్‌కుమార్ ధాకనే ఉద్యోగాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోంశాఖ నిర్వహించిన విచారణలో 2015 ఏప్రిల్‌లో ఆయన హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా అతనిపై మరో కేసు కూడా నమోదైంది. 2020 జూలై 14న, హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా.. ధాకనేకు సివిల్ సొసైటీ నుంచి ప్యానెల్ ప్రముఖ సభ్యునిగా నియమించింది. దీని తరువాత చాలా మంది ఆయన నియామకాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. హోంశాఖ దర్యాప్తు చేసి డీజీపీ ద్వారా నివేదిక సమర్పించింది. ధాకనేపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయని, దీని ఆధారంగా అతన్ని అధికారం నుంచి తొలగించారని నివేదిక పేర్కొంది. కాగా, 2015 ఏప్రిల్‌లో పూణేలోని కోరెగావ్ పార్క్ పోలీస్ స్టేషన్ వద్ద పార్కింగ్ అటెండెంట్‌ను కొట్టినట్లు ఆరోపణలు రావడంతో.. హత్యాయత్నం ఆరోపణలపై ధాకనేపై కేసు నమోదైంది. పోలీసు అధికారులపై డీజీపీ హోదా నుంచి కానిస్టేబుల్ వరకు పౌరులు ఫిర్యాదు చేయడానికి వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీసీఏ ఏర్పాటు చేశారు. దీని ద్వారా సెషన్స్ కోర్టుకు సమానంగా విచారణ జరుగుతుంది. -
సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి
-
టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి ఫిర్యాదు అనంతరం శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిపై కేసు నమోదు
సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొరఢా ఝులిపిస్తున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. వీటితో పాటు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. అలాగే శనివారం.. ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిపై కూడా కేసు నమోదైంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సను నిరాకరించిన ఆంధ్రా ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. రెమిడెసివిర్ దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. -
రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ
సాక్షి, గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ABNతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని సీఐడీ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఎఫ్ఐఆర్ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, రాప్తాడు టీడీపీ నేత పరిటాల పరిటాల శ్రీరామ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్ఐ నాగస్వామి తెలిపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన పరిటాల శ్రీరామ్‌పై రామగిరి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ మేరకు శ్రీరామ్‌పై 153ఎ సెక్షన్ కింద రెచ్చగొట్టేవిధంగా వాఖ్యలు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: ఆ నలుగురు ఔట్..! ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ -
టీడీపీ నేత ఆలపాటిపై కేసు నమోదు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని చినకాకాని గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి పాలకవర్గంలో వివాదాలు పోలీస్‌స్టేషన్ దాకా చేరాయి. ఈ వివాదాల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో ఎన్ఆర్ఐ పాలకవర్గంలో డైరెక్టర్‌గా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడు రవిని ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. గత టీడీపీ పాలనలో ఆలపాటి ఆసుపత్రి పాలకవర్గాన్ని బెదిరించి తన ఆధిపత్యం కొనసాగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2019లో టీడీపీ ఓటమితో ఆలపాటి ఆధిపత్యానికి గండిపడింది. రవిని పాలకవర్గంలోకి తిరిగి తీసుకోకపోతే చంపుతానని రాజేంద్రప్రసాద్ బెదిరించారని, అక్రమంగా ఆసుపత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ప్రస్తుత వైస్‌ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మంగళగిరి రూరల్ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమరావతి: రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
-
చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ
ఒంగోలు: సివిల్ వ్యవహారం చేటు తెచ్చింది. ఇందుకు కారకులుగా భావిస్తూ విశ్రాంత పోలీసు అధికారి ఒకరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయగా కేసు విచారించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన నరహరి.. దాసరి మాల్యాద్రి అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈనెల 18న మాల్యాద్రి కుమారుడ్ని ఒంగోలు రైల్వేస్టేషన్ వద్దకు పిలిపించారు. అక్కడ నుంచి కారులో రామాయపట్నంకు చేరుకుని ఆయన తండ్రి మాల్యాద్రితో నేరుగా తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నరహరి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ లక్ష్మణ్ ఇరువర్గాలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన మాల్యాద్రి తిరిగి రాలేదు. దీంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఉదయాన్నే మాల్యా ద్రి పెళ్లూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదే హమై కనిపించారు. డబ్బులు చెల్లించాలంటూ మాన సికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఎస్పీకి ఐ క్లిక్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా గురువారం జీఆర్పీ పోలీసులకు శవ పంచనామా సందర్భంగా కూడా నరహరి స్టేషన్‌కు తీసుకువెళ్లి తమను కులం పేరుతో దూషించడం,డబ్బులు ఇవ్వా లంటూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి చేశా రని, ఈ విషయంలో తాలూకా సీఐ లక్ష్మణ్ కూడా తమను బెదిరించారంటూ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శవ పంచనామా అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు జీఆర్పీ పోలీసులు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ప్రాథమికంగా తాలూకా సీఐ లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసి, సస్పెండ్ చేయడంతోబాటు నరహరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఎస్పీ సిఫార్సు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ మీద వచ్చిన ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. -
టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా కార్యకర్తలతో కలిసి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు తొమ్మిది మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లు ఉయ్యూరు పోలీసులు తెలిపారు. -
అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో అర్నాబ్ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఇర్ఫాన్.. అర్నాబ్‌పై ఫిర్యాదు చేశారు. అర్నాబ్, అతని చానెల్.. బాంద్రాలోని ఓ మసీద్ లక్ష్యంగా ముస్లింలపై ద్వేషం సృష్టిస్తున్నారని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏప్రిల్ 14న వలస కూలీలు నిరసనకు బాంద్రాలోని మసీదులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. (చదవండి : అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు) ‘బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన తెలపడానికి.. అక్కడికి సమీపంలోని మసీదుకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వలస కూలీలు పెద్ద ఎత్తున చేరిపోయారు. కానీ అర్నాబ్ మాత్రం ఆ మసీదు.. మత ఘర్షణలకు యత్నిస్తుందని తన షోలో చెప్పారు. బాంద్రాలోని మసీదు వద్ద జనం గుమిగూడెలా చేసింది ఎవరు?. లాక్డౌన్ సమయంలో ప్రతి మసీదు సమీపంలో ఎందుకు జనం కనిపించారు. ఇది ముస్లింలను టార్గెట్ చేసేందుకే జరిగిన ప్రణాళిక’ అని ఇర్ఫాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. అర్నాబ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే ఆధారాల్లో భాగంగా.. ఆ షోకు సంబంధించిన క్లిప్స్ సేకరించే పనిలో ఉన్నామని వెల్లడించారు. -
టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల మైనిగ్ మాఫియా అక్రమాలు బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు. గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులపై కేసుల నమోదయ్యాయి. -
యువకులు, ఆర్టీసీ డ్రవర్ ఇరువర్వాలపై కేసు నమోదు
-
బొండా ఉమా, ఆయన కుమారులపై కేసు నమోదు
-
బొండా ఉమాపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమాపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో బొండా ఉమాతోపాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు రౌడీయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మైకులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన బొండ ఉమా ‘నీ అంతు చూస్తా’ అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో.. అజిత్‌సింగ్ నగర్ పోలీసులు బొండా ఉమతోపాటు ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు. -
పిఠాపురం ఎమ్మెల్యేపై కేసు నమోదు
-
అత్యుత్సాహం అరెస్ట్‌కు దారితీసింది
సాక్షి, హైదరాబాద్: ఓ పోలింగ్ ఏజెంట్ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్‌కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్ ముగిశాక అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్ ఏజెంట్‌గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్ స్ట్రాంగ్ రూమ్‌లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా, వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
‘వక్కలు అమ్మి సున్నం పెట్టేశాడు’..!
నాగపూర్: సనత్ జయసూర్య పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులందరికీ అతని వీర విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు గుర్తుకొస్తాయి. వన్డే క్రికెట్ రాత మార్చిన వారిలో ఒకడిగా అతని స్థానం ప్రత్యేకం. అయితే రిటైర్మెంట్ తర్వాత సెలక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా పలు వివాదాల్లో భాగంగా నిలిచిన జయసూర్య ఇప్పుడు తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నాడు. శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వక్కలను తరలించాడని అతనిపై పోలీసులు స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో జయసూర్యతో పాటు మరో ఇద్దరు లంక క్రికెటర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతున్న నకిలీ, నాసిరకం వక్కల తయారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఇటీవల తనిఖీలు జరిపారు. ఇందులో భారీ ఎత్తున నాసిరకం వక్కలను స్వాధీన పర్చుకోగా, విచారణలో జయసూర్య పేరు బయటకు వచ్చింది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీమ్ అతడిని ఇప్పటికే ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై భారత అధికారుల నుంచి అందిన లేఖ మేరకు శ్రీలంక ప్రభుత్వం తదుపరి విచారణ కూడా జరపనుంది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై జయసూర్య వివరణ ఇచ్చాడు. ‘ఆ వార్త పచ్చి అబద్ధం. వక్కలకు సంబంధించిన ఎలాంటి వ్యాపారమూ నేను చేయలేదు. పత్రికలో వచ్చిన కథనాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పరువుకు నష్టం కలిగించే తప్పుడు వార్తలు ప్రచురించినవారిపై నా న్యాయవాదులు తగిన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు’ అని జయసూర్య ట్వీట్ చేశాడు. -
ఆర్మీ సిబ్బందిపై అత్యాచారం కేసు
పుణె: మూగ, చెవిటి మహిళను 2015లో అత్యాచారం చేశారన్న ఆరోపణలపై నలుగురు ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పుణె శివారుల్లోని ఖడ్కీలో ఉన్న సైనిక ఆసుపత్రిలో సదరు మహిళ ఉద్యోగినిగా ఉండగా నలుగురు సిబ్బంది రేప్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో తనపై జరిగిన దారుణాలను బాధితురాలు సంజ్ఞల భాష నిపుణుడికి వివరించడంతో ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులతోపాటు ఆర్మీ ఈ కేసులో విచారణ జరుపుతోంది. -
తనుశ్రీపై కేసు నమోదు
సాక్షి, ముంబై : నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్త సుమంత్ దాస్ ఫిర్యాదుతో బీడ్ జిల్లాలోని కైజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఎంఎన్ఎస్ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రాజ్‌థాకరే, ఎంఎన్ఎస్ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో వద్దు.. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. -
అక్రమ సంబంధం అంటగట్టారు!
శ్రీకాకుళం రూరల్ : సాక్షిలో ప్రచురితమైన ‘భర్తే...మానవ మృగం’ కథానానికి జిల్లా యం త్రాంగం స్పందించింది. తల్లిదండ్రులు లేని బాధితురాలికి పరామర్శలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కనుగులవానిపేటకు చెందిన జాడ సుజాత ఇటీవల తన భర్త చేసిన అఘాయిత్యానికి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు తమ వంతు సాయం చేసేందుకు ఒక్కొక్కరూ ముందుకు వస్తున్నారు. సుజాత భర్త(నగేష్)పై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ చిన్నంనాయుడు తన సిబ్బందితో కలిసి బాధితురాలిని ఆదివారం పరామర్శించారు. తన భర్త నగేష్, అత్త సరోజిని, ఆడపడుచు మాలతీ చేసిన పైశాచిక పనులను సైతం ఆమె పోలీసులకు వివరించింది. ‘మైనర్‌గా(14 ఏళ్లు) ఉన్నప్పుడే వివాహం చేసుకోవడంతో నరకాన్ని చవిచూశా’నంటూ బోరున విలపించింది. తన భర్త రోజూ హింసిస్తుంటే చెప్పుకునేందుకు కనీసం తల్లిదండ్రుడు కూడా లేరని వాపోయింది. తమ్ముడు పేరిట తన తండ్రికి వచ్చిన ప్రమాద బీమా సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే తన ఆడపడుచుకు టైలరింగ్ షాపు నిమిత్తం ఆ డబ్బులు ఎలాగైనా తీసుకు రావా లంటూ ఏదో ఒక పేరుతో నిత్యం వేధించేదని ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు.. వాతలే తన భర్త నగేష్ ఆటో వేస్తూ వచ్చిన డబ్బులతో నిత్యం పూటుగా మద్యం సేవించేవాడని సుజాత తెలిపింది. ఇంటికి వచ్చే ముందు తన స్నేహితుడి సెల్‌తో ఇంటికి ఫోన్ చేసేవాడని పేర్కొంది. తీరా ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్ తీసుకొని ఫలనా నంబర్ నుంచి ఎవరితో మాట్లాడావంటూ లేని పోని అక్రమ సంబంధం అంటగడుతూ ఇష్టానుసారంగా కొట్టడం, శరీరంపై ఎక్కడపడితే అక్కడు వాతలు పెట్టేవాడని వెలిబుచ్చింది. మద్యం అమ్మాలంటూ ఒత్తిడి ఇదిలా ఉండగా.. సుజాత అత్త సరోజిని బలివాడ జంక్షన్, ఇప్పిలి రోడ్‌కు వెళ్లే రహదారిలో ఓ ప్రభుత్వ స్థలంలో మద్యం విక్రయిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈమె అనాధికారికంగా మద్యం అ మ్ముతోందని సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేయగా.. పలు లిక్కర్ బాటిళ్లతో ఆమె పట్టుబడింది. అప్పట్లో సరోజినిపై ఎక్సైజ్ స్టేషన్లో కేసు కుడా నమోదు చేశారు. దీంతో కొన్ని రోజులుగా వ్యాపారం బంద్ చేసిన బాధితురాలి అత్త.. ఇక లాభం లేదంటూ గ్రామంలోనే అమ్మకాలు మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా తన కోడలైన సుజాతతో కుడా మద్యం అమ్మకాలు చేపట్టించింది. అత్త పెట్టిన ఒత్తిడి భరించలేక రెండు రోజులు మద్యం కుడా అమ్మినట్లు సుజాత వెల్లడించింది. తాగిన వారు సుజా తను చూసి అనరాని మాటలు అనడంతో, ఆ బాధ భరించలేక నేను మద్యం అమ్మలేనంటూ తేల్చి చెప్పింది. దీంతో తన భర్తకు లేనిపోనివి చెప్పి దగ్గరుండి కొట్టించేదని ఆమె పోలీసులకు వివరించింది. -
విద్యార్థి ఉసురు తీసిన ‘కేసు’
సిద్దిపేటటౌన్ : తోటి స్నేహితులతో జరిగిన చిన్నపాటి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసు కావడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకులకు చెందిన మడప రోహిత్‌రెడ్డి అలియాస్ బబ్లూ (18) సిద్దిపేట పట్టణంలోని మాస్టర్స్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం పాత బస్టాండ్ పక్కన ఉన్న గల్లీలో అతడికి, కొందరు స్నేహితులకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పెద్దల సమక్షంలో ఇరు పక్షాల వారిని మందలించి ఉదయం మళ్లీ స్టేషన్‌కు రావాలని పంపించారు. మంగళవారం రాత్రి రోహిత్ ఇంటికి వెళ్లకుండా గ్రామ శివారులోని వారి సంబందీకులకు చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గ్రామంలో వెతికినా ఆచూకీ దొరకలేదు. రోహిత్ తండ్రి యాదిరెడ్డి ఉదయం బావి వద్దకు వెళ్తున్న క్రమంలో దొంగల చంద్రయ్య బావి వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న కానుగు చెట్టుకు ఉరివేసుకుని రోహిత్ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విషయం సిద్దిపేట రూరల్ పోలీసులకు తెలియడంతో పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. దోషుల పేర్లు చెప్పాలని బాధితుల డిమాండ్.. తమ కుమారుడి మృతికి మంగళవారం జరిగిన గొడవే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసినా పోలీసులు గొడవకు పాల్పడిన అతని స్నేహితుల పేర్లు చెప్పకపోవడంతో శవంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే బైటాయించి ఆందోళనకు దిగారు. రోహిత్‌రెడ్డి మృతికి కారణమైన వారి పేర్లు చెప్పి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీపీ జోయల్ డేవిస్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్నే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడంతో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శవాన్ని పోలీసుల వాహనంలో తిరిగి పోస్టు మార్టం రూంకు తీసుకువచ్చారు. కాసేపటికి అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరడంతో గొడవ సద్దుమనిగింది. గొడవకు కారణమైన వారిపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలి... మా కొడుకు మీద ఫిర్యాదు వచ్చింది పోలీస్ స్టేషన్‌కు రావాలని మంగళవారం సాయంత్రం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. స్టేషన్‌కు వస్తే బుధవారం ఉదయం రావాలని చెప్పి పోలీసులు పంపించారు. వెళ్లే సమయంలో కేసు అయింది స్టేషన్‌కు రావాలి, జైలుకు పంపిస్తాం అని చెప్పారు. కేసు నమోదు కావడంతోనే మనస్థాపం చెంది నా కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు పెట్టిన వారు ఎవరో మాకు చెప్పకుండా పోలీసులు దాస్తున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మాకు అన్యాయం చేస్తున్నారు. గొడవ ఎందుకు అయ్యిందో చెప్పడం లేదు. మా అబ్బాయి మీద కేసు పెట్టిన వారి వివరాలు చెప్పాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – యాదిరెడ్డి, మృతుని తండ్రి చట్ట ప్రకారం చర్యలు.. రోహిత్‌రెడ్డి తన స్నేహితునితో కలిసి పాత బస్టాండ్ వద్ద వారు చదువుకునే కాలేజీ స్నేహితులతో గొడవ పెట్టుకుని వారిని కొట్టాడు. వారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి కోర్టుకు పిలిచినపుడు రావాలని చెప్పి పంపించాం. అమ్మాయి విషయంలో స్నేహితుల మద్య గొడవ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. పంపించిన తర్వాత రోహిత్ ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయంలో అతనిపై కేసు నమోదు అవడం వల్లనే మనస్థాపం చెంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రామేశ్వర్, సిద్దిపేట ఏసీపీ -
1705 బెల్ట్ దుకాణాలపై కేసులు
విజయనగరం రూరల్ : ఏడాది కాలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 1705 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేశారని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జూలై 1నుంచి 2018 జూన్ 30 వరకు జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 1705 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేసి 1726 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 6759 లీటర్ల మద్యాన్ని, 995 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలకు మద్యం తరలిస్తున్న 21 లైసెన్స్డ్ మద్యం దుకాణాలను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రాండ్ మిక్సింగ్, చిల్లర అమ్మకాలు చేపడుతున్న 10 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి, ఒక్కో దుకాణదారుడికి రూ. లక్ష అపరాధ రుసుం విధించామన్నారు. ఎంఆర్పీకి మించి అమ్మకాలు చేపడుతున్న రెండు మద్యం దుకాణాల లైసెన్స్ రద్దు చేసి లక్ష రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించామన్నారు. 98 మద్యం దుకాణాల్లో సాంకేతిక పరమైన సమస్యలు గుర్తించి 98 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నవోదయం కార్యాక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు సాగిస్తున్న గ్రామాల్లో469 మందిని అరెస్ట్ చేసి 511 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 12,286 లీటర్ల సారాతో పాటు తయారీకి ఉపయోగించే 58, 095 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. అలాగే నాటుసారా రవాణాకు ఉపయోగించిన 90 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 80 గ్రామాల్లో నవోదయం కార్యక్రమంలో భాగంగా బైండోవర్ కేసులు పెట్టి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే జిల్లాలో గంజాయి సాగులేకున్నా తనిఖీల ద్వారా ఏడు కేసులు నమోదు చేసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు వాహనాలు, 47.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్ట్ దుకాణాల నిర్మూలన, నాటుసారా తయారీ, రవాణా, కేసుల నమోదుపై 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ప్రతి నెలా రెండో శనివారం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
ఉదయ్ హత్యపై అనేక అనుమానాలు.?
జనగామ : జనగామ మండలం చీటకోడూరులో అల్లుడిని మామ హత్య చేసిన ఘటన అనేక అనుమానాలు తావిస్తుంది. ఫోన్ సమాచారంతో అల్లుడిని ప్లాన్ ప్రకారమే పిలిపించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల ఎల్లయ్య కూతురు మౌనికను కొలనుపాకకు చెందిన ఉదయ్ ప్రేమించి వివాహం చేసుకోగా... రెండు రోజుల క్రితం అతను మామ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. చీటకోడూరులో ఎల్లయ్య నివాసం ప్రధాన రహదారిపై ఉండడమే కాకుండా చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. ఉదయ్‌ను హ్యత్య చేసే ముందు ఇరువురి మధ్య పెనుగులాట.. గొడ్డలితో నరికే సమయంలో అరుపులు.. కేకలు వినిపించాలి. గ్రామంలో ఎవరిని అడిగినా.. గొడవ జరిగినట్లు అలజడి లేదంటున్నారు. ఉదయ్ ఇంటికి రాగానే.. బయటకు తీసుకువెళ్లి చంపేసి.. ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎవరూ కూడా సరైన వివరణ ఇవ్వడం లేదు. ఉదయ్ మృతదేహం ఉన్న ప్రదేశంలో కారం పొడి ప్యాకెట్ కూడా ఉన్నట్లు మంగళవారం పలువురు గ్రామస్తులు గుర్తుపట్టినట్లు తెలుస్తుంది. పెనుగులాట సమయంలో ఉదయ్ మామా, బావమర్ధిని ఎదురించడంతో కళ్లలో కారం చల్లి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అర్ధరాత్రి హత్య జరిగినప్పటికీ ఉ దయ్ కుటుంబసభ్యులకు మాత్రం తెల్లవారుజా ము 9గంటల తర్వాతనే సమాచారం అందించారు. ఆలస్యం వెనక అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. అల్లుడిని మామనే హత్య చేసినట్లు పోలీ సులు నిర్ధారించగా బావమర్ధి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరేనా.. ఇంకెవరైనా హత్యలో పాలుపంచుకున్నారనే అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 8 మందిపై కేసు నమోదు.. అల్లుడు గంధమల్ల ఉదయ్‌ను గొడ్డలితో హత్య చేసిన ఘటనలో మామ ఎల్లయ్య, బావమర్ధి పవన్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క శ్రీనివాస్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు, నింధితులను త్వరలోనే రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహిత దారుణ హత్య!
టెక్కలి రూరల్: టెక్కలికి కూతవేటు దూరంలో మహిళ హత్యకు గురైంది. జనసంచారం లేని రహదారికి పక్కగా ఉన్న తోటల్లో వివాహిత మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి చెలరేగింది. మృతురాలు సారవకోట మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధి చరణ్ దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి(39)గా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళతానని.. పోలాకి మండలంలోని ప్రియాగ్రహారానికి చెందిన లక్ష్మణరావుతో సారవకోట మండలంలోని చరణ్‌దాసుపురానికి చెందిన నీలవేణితో వివాహమైంది. వీరికి చిన్నారావు, సోదులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణరావు ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే వీరు బతుకుదెరువు కోసం చరణ్‌దాస్‌పురం వచ్చి జీవిస్తున్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలోని బంధువుల ఇంటికి నీలవేణి ఆదివారం వెళ్లింది. సాయంత్రం చరణ్‌దాస్‌పురం బయలుదేరింది. చీకటి పడిపోవడంతో భర్త లక్ష్మణరావుకి ఫోన్ చేసింది. తాను కొత్తపేటలో ఉన్నానని, కురుడు గ్రామానికి ద్విచక్రవాహనంపై రావాలని సూచించింది. అమె చెప్పినట్లుగా లక్ష్మ ణరావు కురుడు వచ్చి నీలవేణికి ఫోన్ చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రావడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సమీపంలోని కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. సారవకోట మండలం కనుక.. అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. రాత్రంతా లక్ష్మణరావుతో పాటు బంధువులు ఆమె కోసం గాలించారు. సోమవారం ఉదయం సారవకోటలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లబోతున్న సమయంలో.. టెక్కలి జీడితోటలో వివాహిత మృతదేహం ఉందని తెలిసింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న లక్ష్మణరావు.. మృతదేహాన్ని పరిశీలించి తన భార్య నీలవేణిగా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే? కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. టెక్కలి, కాశీబు గ్గ రూరల్ సీఐలు శ్రీనివాసరావు, తాతారావు, ఎస్ఐ–2 రమణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలో రక్తంతో నిండి ఉన్న పెద్ద రాయి, పగిలిన బీరు సీసాలు, కారం పొడి ప్యాకెట్టు, జేబు రూమాల్, సెల్‌ఫోన్ తదితర వస్తువులు పడి ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట జంక్షన్ నుంచి కురుడు వైపు వెళ్లాల్సిన అమె పోలవరం వైపు రావడంతో పాటు మృతదేహంపై కారం చల్లడం చూసిన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వాసన గుర్తుపట్టకుండానే కారం చల్లారని, ప్రణాళిక ప్రకారమే చేశారని భావిస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువు టొంపర యర్రయ్య ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం, లింగాలవలస సమీపంలోని ఈ తోట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గతంలో ఇక్కడ పలు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతుండగా గ్రామస్తులు మందలించిన ఘటనలు ఉన్నాయి. నిత్యం మద్యం తాగుతూ అనేక మంది కనిపిస్తుంటారని తెలిపారు. సారవకోట: మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలోని చరణ్‌దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి టెక్కలి మండలంలో హత్యకు గురైందని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బాలికపై రేప్.. ముగ్గురు మహిళలపై కేసు
సంగ్రూర్(పంజాబ్) : లూథియానాకు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేయించిన ఘటనలో ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 13 ఏళ్ల బాలిక తన తల్లి స్నేహితురాలు సోనా వద్ద ఉండేందుకు సంగ్రూర్‌కు వచ్చారు. సోనా మరో ఇద్దరు మహిళతో కలిసి ఆ బాలికను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని భావించారు. అందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. బాలికపై పలువురి చేత అత్యాచారం చేయించారు. నాలుగు రోజుల పాటు బాలికను ఇలాగే హింసించారు. కాగా, బాలిక జూన్ 24న లూథియానాలోని తన తల్లికి ఫోన్ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లి వెంటనే సంగ్రూర్‌కు వెళ్లి సోనాను కలిశారు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పదంటూ వారిని సోనా బెదిరించారు. దీంతో బాధితురాలి తల్లి సంగ్రూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోనాతో పాటు ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణం చేపట్టారు. అనంతరం బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘మేము ఏడాది క్రితం సంగ్రూర్‌లోనే ఉండేవాళ్లం. అప్పుడే నాకు సోనాతో పరిచయం ఏర్పడింది. వేసవి సెలవులు కావడంతో నా కూతురు 15 రోజుల క్రితం సోనా వాళ్ల ఇంటికి వెళ్లింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పైగా సోనా నాపై బెదిరింపులకు దిగింది. నేను మాత్రం నా కూతురికి న్యాయం జరిగే వరకు పోరాడుతాన’ని తెలిపారు. -
ఒకే రోజు 100 కేసులు నమోదు
తాండూరు : వారం రోజులుగా పోలీసుశాఖ వాహనదారులపై కొరడా జులిపించింది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కేసుల (ఆన్లైన్) నమోదును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని రెండు సర్కిళ్లలో ఉన్న పోలీస్స్టేషన్లలో పోలీసు అధికారులు మంగళవారం ఒకే రోజు 100 ఈ కేసులు నమోదు చేశారు. బుధవారం రోజు తాండూరు మున్సిపల్ కోర్టులో ఈ కేసులు నమోదైన వారికి న్యాయమూర్తి ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన చట్టం ప్రకారం వాహనదారులకు జరిమానాలు విధించారు. తాండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 500లకు పైగా ఈ కేసులు నమోదు చేసి రాష్ట్రంలో మొదటి పోలీస్‌స్టేషన్‌గా రికార్డు సాధించింది. కేసుల నమోదులోపోటీ పడుతున్న సీఐలు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రెండు సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న సీఐల మధ్య ఈ పెట్టి కేసుల పోటీ కొనసాగుతోంది. ఒకరికి మించి ఒకరు తమ సత్తా చాటుకునేందుకు వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. పట్టణ సీఐ ప్రతా పలింగం, రూరల్ సీఐ సైదిరెడ్డిల మధ్య ఇప్పటికే ఉద్యోగరీత్యా విభేదాలున్నాయి. అధికారుల మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధంలో ఈ పెట్టి కేసు నమోదులతో రికార్డు సాధించిన స్థానికంగా అధికారులు వాహనదారులపై అడ్డగోలుగా కేసు లు నమోదు చేయడంతో విమర్శలు వస్తున్నాయి. -
ఠాణాకు చేరిన ఫేస్బుక్ ప్రేమ
వేములవాడ: ఫేస్బుక్ పరిచయం కులాలకు, కన్నకొడుకులకు ఏమాత్రం అడ్డురాలేకపోయింది. కట్టుకున్న మొగున్ని, కన్న కొడుకులను వదిలేసి ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో ఉడాయించి వేములవాడకు చేరుకుని ఏడాదిన్నరగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్న వైనం మంగళవారం వేములవాడలో వెలుగుచూసింది. ఏడాదిన్నరగా మహిళ కోసం వెతుకున్న బంధువులు ఎట్టకేలకు వేములవాడలోని బద్దిపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం అందుకుని మంగళవారం వేకువజామున చేరుకున్నారు. వారిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో తప్పించుకునే యత్నంలో ప్రియుడు బంగ్లా పైనుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే ఆ ప్రాంతంలో కాసుకుని కూర్చున్న బంధువులు, అతడిని పట్టుకుని బంధించారు. విషయం కాలనీలో తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఇరువురిని ఠాణాకు తరలించారు.\ సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన యువతికి, బెల్లంపల్లికి చెందిన నిఖిల్నందాతో ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఆమె ఏడాదిన్నర క్రితం వేములవాడకు చేరుకుని, నందాతో సహజీవనం సాగిస్తోంది. ఆమె కుట్టు మిషన్ పనిచేస్తుండగా, నిఖిల్నందా ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర తరువాత వీరి వ్యవహారం.. ఖమ్మంలో ఉన్న ఆమె బంధువులకు తెలిసింది, వారు మంగళవారం ఇక్కడికి చేరుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఆమె భర్త, ఏడాది క్రితమే.. తన భార్య కనిపించడం లేదంటూ కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్కడి పోలీసులతో మాట్లాడిన అనంతరం మరో కేసు ఇక్కడ నమోదు చేయకుండా తమ కానిస్టేబుల్ ఇచ్చేసి కొణిర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆ ఇద్దరినీ పంపించారు. -
అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో!
నిజామాబాద్ క్రైం: ఇద్దరూ మైనర్లే.. బాలిక పదో తరగతి.. బాలుడు ఇంటర్ చదువుతున్నారు. బాలికతో ఉన్న చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్‌లలో స్నేహితులకు షేర్ చేశాడు. ఇదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (15)తో ఆమె సమీప బంధువైన ఇంటర్ విద్యార్థి (17)కి స్నేహం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలసి నగర శివారులోని నాగారం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో కేక్ కట్ చేయించాడు. ఈ క్రమంలో వారి మధ్య చనువు ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్ప డుతూ సెల్ఫీ వీడి యోలు తీశాడు. అప్పటి నుంచి తన వద్దకు రావాలని, లేకుంటే వీడియోను బయ ట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. బాలిక భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. ఇటీవల బాలిక తండ్రి ఫోన్ రిపేరుకు రావడంతో అమ్మాయి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాలుడి నుంచి ఫోన్‌కాల్స్ రావడం.. అప్పటికే కూతురి ప్రవర్తనపై అనుమానం ఉండటంతో నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. బాలుడిని పిలిపించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిలదీశాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే.. సెల్‌ఫోన్, వీడియోలలో ఉన్న చిత్రాలు తొలగించాలని చెప్పగా అందుకు నిరాకరించాడు. వెంటనే అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని అన్‌లాక్ చేయించగా.. వాటిలో ఉన్న అశ్లీల చిత్రాలు చూసి నివ్వెరపోయారు. ఘోరం జరిగిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేసిన వైద్యులు
షాద్‌నగర్‌టౌన్ : ప్రసవం కోసం ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది... వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఆపరేషన్ సమయంలో ఆమె కడుపుకోసి కాటన్‌తో మూసేసి కుట్టేశారు. ప్రస్తుతం బాధిత మహిళ హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. 2017 అక్టోబర్ 3న కుటుంబ సభ్యులు ఆమెను ప్రసవం కోసం షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో బస్టాండ్ ఎదురుగా ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేశారు. హరిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం హరిత స్వగ్రామానికి వెళ్లింది. ఆపరేషన్ నిర్వహించిన రోజు నుంచి హరిత ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో దిగులు చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు. కాటన్ పేగులకు చుట్టుకుని అస్వస్థత.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు హరితకు స్కానింగ్ నిర్వహించారు. కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించి బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. ప్రసవం కోసం వచ్చినప్పుడు ఆపరేషన్ నిర్వహించి కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేయడమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు. హరిత కడుపులో ఉన్న కాటన్ పేగులకు చుట్టుకొని పోవడంతో ఉస్మానియా వైద్యులు హరితకు మరోసారి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుప్రతిలో చేర్చగా అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతోంది. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరిత ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు హరిత కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి సోదరుడు పి.రవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరితకు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి హరిత కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారిందని రవి తెలిపారు. దీనికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రవి పేర్కొన్నారు. ఆపరేషన్ మా ఆసుపత్రిలో జరగలేదు హరితకు విజయ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయ లేదు. కేవలం ఆమెకు ఓపీని మాత్రమే చూశాం. హరితను పరీక్షించిన అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాలని సూచించాం. పట్టణంలోని సేవాలాల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. హరిత అనారోగ్యం పాలవడానికి మా ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు. – డాక్డర్ చందులాల్‌రాథోడ్, విజయ ఆసుపత్రి వైద్యుడు కేసు నమోదు చేశాం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హరిత అనారోగ్యానికి గురైందని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. హరితకు ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించి ఆమె కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేశారని బాధితురాలి సోదరుడు రవి విజయ ఆసుపత్రి వైద్యులు విజయ, చందూలాల్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం. – అశోక్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్ -
అప్పు చెల్లించాలని ఇంటికి తాళం
కొత్తూరు : తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని దౌర్జన్యం చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన మండలంలోని సిద్ధాపూర్ పంచాయతీ పులిచర్లకుంటతండాలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్సై శ్రీశైలం వివరాల ప్రకారం... సిద్ధాపూర్‌కు చెందిన షరీఫ్ వద్ద పులిచర్లకుంటతండాకు చెందిన లింగ్యానాయక్ రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుండి షరీఫ్ వద్ద కూలీ పనులు చేస్తున్నాడు. ఇటీవల తాను అనారోగ్యానికి గురికావడంతో పనికి వెళ్లడం లేదు. కాగా షరీఫ్ తన వద్దకు పనికి రావాలని లేని పక్షంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించాలని లింగ్యా ఇంటి వద్ద గొడవకు దిగాడు. అంతటితో శాంతించకుండా ఇంట్లో ఉన్న లింగ్యా భార్య లిలీని వారి పిల్లలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. అప్పు త్వరలో తీర్చుతామని వేడుకున్నా కనికరించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో షరీఫ్, అతడి కుమారుడు సలీంలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. కాగా రూ. 80 వేలు అప్పుగా తీసుకొని రెండేళ్ల పాటు కూలీ పనులు చేసినా అప్పు తీరలేదంటూటు షరీఫ్ తన భర్తను భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం చేస్తున్నాడని లింగ్యా భార్య లిలీ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. -
అంగట్లో సెల్‌ఫోన్ చోరీ
భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అంగడీలో సెల్‌ఫోన్ దుండగులు చేతి వాటాన్ని ప్రదర్శించారు. మండల కేంద్రానికి చెందిన చోటు అనే వ్యక్తికి చెందిన సామ్సంగ్ జే7 సెల్‌ఫోన్ చోరీకి గురైంది. చోటు అంగడీలో కూరగాయలు కొనేందుకు వెళ్లగా దుండగులు ఆయన జేబులోని సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. కొద్ది సేపు తర్వాత గ్రహించిన చోటు ఎంత వెతికినా దొరకలేదు. వెంటనే భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా పలువురి సెల్ఫోన్లు చోరీకి గురి కావడంతో పోలీస్‌లు అంగడీలో గస్తీని ఏర్పాటు చేశారు. పోలీసుల గస్తీ ఉన్నప్పుడు దుండగులు సెల్ఫోన్లను అపహరించడం లేదు. పోలీసులు గస్తీ లేని రోజున తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. -
పోలీసులపై దాడికి యత్నం
సూర్యాపేటరూరల్ : భార్యాభర్తల పంచాయితీ విషయంలో పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్‌తో సూర్యాపేట మండలం య ర్కారం ఆవాసం దుబ్బతండాకు చెందిన లీలావతికు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సం తానం. అయితే కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ భర్త బాలు నాయక్‌పై భార్య లీలావతి మూడు రోజుల క్రితం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విషయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను ఎస్ఐ శ్రీనువాస్ ఇరువర్గాలను గురువారం స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వస్తూనే పోలీసులపై ఆగ్రహం..? మిర్యాలగూడ నుంచి బాలునాయక్, అతని తమ్ముడు రమేష్‌తో పాటు మరి కొందరు బంధువులు స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు వస్తూనే బాలునాయక్ తమ్ముడు రమేష్ తాను డీజీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తానని, కేసు విషయంలో నువ్వు ఎంత తీసుకుని మమ్ముల్ని పిలిపించావని ఎస్ఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. స్టేషన్లో ఉన్న పోలీసులు బాలునాయక్, రమేష్‌లను సముదాయించి స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాలునాయక్, రమేష్‌తో పాటు వచ్చిన బంధువులు అందరూ కలిసి పోలీసులపై దాడి చేసే యత్నించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దాడికి యత్నించిన వారు మద్యంతాగి ఉండడంతో పోలీసులు సముదాయించినా వినలేదు. భార్య బంధువుల ప్రతిఘటనతో.. అయితే బాలునాయక్ బంధువులు పోలీసులపై దాడికి యత్నిస్తున్న తీరును చూసి అవాక్కౖన లీలావతి బంధువులు ప్రతిఘటించి వెంబడించా రు. దీంతో బాలునాయక్ బంధువులు పరారీ కావడంతో గొడవ సద్దుమణిగింది. బాలునాయక్, బంధువులను సముదాయించే సమయంలో హోంగార్డు జానకిరాములు కిందపడిపోయాడు. ఆరుగురిపై కేసు నమోదు.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురిపై కేసు న మోదు చేసినట్లు సూర్యాపేట వన్‌టౌన్ ఎస్ఐ క్రాం తికుమార్ తెలిపారు. కేసు నమోదైన వారిలో రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్, రమేష్, రా జేశ్వరి, రమావత్ శాంతి, వినోద, కవిత ఉన్నారు. స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు స్టేషన్‌కు వచ్చారు. ఘర్షణ జరిగిన సంఘటన గురించి సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్‌లపై దాడి చేసే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు. -
మోసగత్తెకు ఏడాది జైలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : ఓమహిళ ఘరానా మోసానికి న్యాయస్థానం సంకెళ్లేసి జైలుకు పంపింది. ఏడాది శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు. గోపాలపట్నంకు చెందిన బర్రి సరోజని ఎల్లపువానిపాలేనికి చెందిన ప్రమీలాదాస్ అనే గృహిణికి పరిచయమైంది. తనకు సర్వే నెంబరు 104లో ప్లాట్ ఉందని, దీన్ని రూ.8.18లక్షలకు అమ్ముతానని చెప్పడంతో ప్రమీలాదాస్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. సరోజని ఆ మొత్తాన్ని తీసుకొని ఆమె ఇంట్లో నెలకు నాలుగువేల చొప్పున ఇస్తానని అద్దెకు దిగింది. ఆ మొత్తం తీసుకున్న మూడు నెలల తర్వాత బండారం బయటపడింది. ఆమె మోసకారి అని తేలింది. ప్రమీలాదాస్ కొన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తావా ... మాడబ్బులు మాకివ్వు...ఇల్లు ఖాళీ చేయ్..అంటే ఇపుడు రెండూ జరగవని మోసకారి మహిళ చెప్పడంతో బాధితురాలు 2012లో గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్పటి సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి సరోజనిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఏపీపీ కె.సుధారాణి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. సోమవారం రెండో మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి సమ్మిపర్విన్‌సుల్తానాబేగం తీర్పునిచ్చారు. ఏడాది జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ ఆదేశించారు. -
ఎవరా మహిళ..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : మంటల్లో కాలి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసు మిస్టరీగా మారింది. ఆమె ఎవరన్నదీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల క్రితం కొత్తపాలెం నుంచి నరవ మార్గంలో ఖాళీ మైదానంలో మహిళ మంటల్లో కాలిపోతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రోజు నుంచీ పెందుర్తి, గోపాలపట్నం పోలీసులతో నగర పోలీసులంతా హైఅలెర్ట్ అయ్యారు. క్లూ సంపాదించే దిశగా శ్రమిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో గాలింపులు చేస్తున్నారు. కళ్ల జోడు ధరించి కాళ్లకు మోడల్ చెప్పులు ధరించి, కాళ్లకు మట్టెలు ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా వివాహితనే నిర్ధారణకు వచ్చినా.. ఆమె ఎవరన్నదీ మిస్టరీగా మారింది. వీడియో చిత్రాల ఆధారంగా సంఘటనను బట్టి ఆమెను కచ్చితంగా హతమార్చి కాల్చి చంపి ఉండొచ్చన్న సందేహాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఎలాగైనా ఛేదించి తీరాలని జాయింట్ పోలీస్‌కమిషనర్ రవికుమార్‌మూర్తి పట్టుదలతో ఉన్నారు. అనేక పోలీసు బృందాలతో శోధింపు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కలకలం రేపిన తప్పుడు సమాచారం మహిళకు సంబంధించి క్లూ దొరికిందంటూ ఓ పత్రికలో కథనం వెలువడడంతో పోలీస్‌కమిషనర్ యోగానంద్‌తో పాటు జాయింట్ సీపీ రవికుమార్‌మూర్తి అప్రమత్తమయ్యారు. అన్ని స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, టాస్క్ఫోర్సు అధికారులు, సిబ్బంది, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సిబ్బందితో గోపాలపట్నాన్ని జల్లెడపట్టారు. ఏసీపీ అర్జున్‌తో పాటు సీఐ పైడియ్య, స్పెషల్‌బ్రాంచి సీఐ వైకుంఠరావు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ తదతర అధికారులు, పోలీసులు య ల్లపువానిపాలెం అంతా గాలించారు. ఎటువంటి ఆధారం దొరక్కపోవడంతో కేసు శోధిస్తున్న తరుణంలో పోలీసులతో ఆటలేంటని మండిపడ్డారు. -
రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై కేసు
మిర్యాలగూడ రూరల్, నల్గొండ : రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదయ్యింది. ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని ఊట్లపల్లి గ్రామంలో చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న అంజిబాబు అలియాస్ స్టిఫెన్ పది సంవత్సరాల క్రితం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన అములమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. నేరేడుచర్ల మండల కేంద్రాన్ని చెందిన రజిత అనారోగ్యాని గురికావడంతో చర్చికి వచ్చి ప్రార్థనలు చేసేంది. ఆమెకు స్టిఫెన్ మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో రెండు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మొదటి భార్య అములమ్మ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్టిఫెన్‌తో పాటు రెండో వివాహానికి సహకరించిన మరో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శశికళ, ఇళవరసిలపై మరో కేసు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పది బోగస్ సంస్థల ద్వారా అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె వదిన ఇళవరసి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. త్వరలో వారిద్దరిపై అధికారులు మరో కేసు నమోదు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మూతపడ్డ బోగస్ సంస్థల్లో శశికళ, ఇళవరసి, వారి బంధువులకు చెందిన పది కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో రూ. 1,012 కోట్ల అవకతవకలు సాగినట్లుగా చెన్నై ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, మిత్రులు బినామీలుగా ఉన్నారు. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా ఇళ్లు, ఒకే చిరునామాతో అనేక సంస్థలు ఉన్నాయి. మరోవైపు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి పేరుతో ఆరు బోగస్ సంస్థల ద్వారా రూ.174 కోట్లు విదేశాలకు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. -
అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు
జడ్చర్ల : జడ్చర్లలో ఓ బాలిక(14)పై అత్యాచారం చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. స్థానిక ఇందిరానగర్ కాలనీలో తల్లితోపాటు ఉంటున్న ఓ బాలికపై ఒంటరిగా ఉన్న సమయంలో జడ్చర్లకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. అయితే వెంటనే బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆదివారం బాలిక తమకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రాజేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై కేసు నమోదు
అప్పు ఇచ్చిన సొమ్ము అడిగినందుకు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు సీతమ్మధార (విశాఖ ఉత్తరం): ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కొట్టాడని ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి (కన్నబాబు)పై ద్వారకాజోన్ పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకానగర్ మొదటిలైన్‌లో ఉంటున్న సరోజిని ఇంజినీరింగ్ వర్క్స్ అధినేత పి.రాజన్నబాబు దగ్గర నుంచి కన్నబాబు స్ధలం కోనుగోలు కోసం 2010 సెప్టెంబర్ 27న రూ. 50 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఆ డబ్బు చెల్లించమని ఇటీవల రాజన్నబాబు కోరగా ఆగస్టు 1న ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఫోన్ చేస్తే 5వ తేదీకి వాయిదా వేశారు. తరువాత 20వ తేదీన ఇస్తానని చెప్పడంతో రాజన్నబాబు సోమవారం ఉదయం 11.30 గంటలకు కన్నబాబు ఇంటికి వెళ్లాడు. ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చావు.. నీకు డబ్బులు తిరిగి ఇవ్వను, నీకు దిక్కున్నవారికి చెప్పకో అంటూ తనపై కన్నబాబు దౌర్జన్యం చేశాడని, కారు డ్రైవరు, సెక్యూరిటీ గార్డుతో బయటకు గెంటి?ంచాడని.. గన్‌తో కాలుస్తానని బెదిరించారని రాజన్నబాబు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు. -
14 కిలోల గంజాయి పట్టివేత
కాజీపేట రూరల్: భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం జీఆర్పీ పోలీసులు 14 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన 50 ఏళ్ల రహమాన్ విశాఖపట్నంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. రహమాన్ సుమారు రూ.లక్ష విలువ గల 14 కిలోల ఎండు గంజాయిని బ్యాగులో పెట్టుకుని రిజర్వేషన్ బోగి స్లీపర్ క్లాస్ ఎస్–4లో ముంబైలోని దాదర్‌లో అమ్మేందుకు వెళ్తున్నాడు. ప్రత్యేక జీఆర్పీ బృందం తనిఖీ చేయగా, రహమాన్ వద్ద ప్యాకింగ్ చేసిన గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకొని రహమాన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
‘కేసు పెట్టినందుకు ధన్యవాదాలు’
సాక్షి, న్యూఢిల్లీ: తనపై నమోదైన కేసును ఎదుర్కొంటానని, కేసు నమోదు చేసినందుకు ధన్యవాదాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ఏడాది కాలంగా ముస్లిం యువతను ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం యువతపై పోలీసులు వల పన్నితే మజ్లిస్ పార్టీ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఈ విషయంలో అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని విమర్శించారు. ముస్లింల సంక్షేమంపై వారికి శ్రద్ధ లేదని, కేవలం వారి వ్యాపారాలు, బ్యాంకులు, విద్యాసంస్థల నిర్వహణపైనే శ్రద్ధ ఉందని ఆరోపించారు. కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్ పెంపు పేరుతో చేస్తున్న ప్రయత్నం కేవలం బీజేపీకి మేలు చేయడానికేనని, హిందూ, ముస్లింల ఓట్లను విభజించడానికేనని వ్యాఖ్యానించారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. -
సామాన్య ప్రజలపై రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
-
ఎమ్మెల్సీపై కేసు నమోదు
గుంటూరు: బాపట్ల సూర్యలంక బీచ్‌లో పర్యాటక శాఖ రిసార్టు డిప్యూటీ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఆయన అనుచరులపై కూడా బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ వై.టి.నాయుడు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. బీచ్ రిసార్టు డిప్యూటీ మేనేజర్, సిబ్బందిని ఆయన విచారించారు. కాగా, ఇలాంటి వ్యవహారాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని సతీష్‌పై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఇటు పాత రూ.కోట్లు అటు నకిలీ నోట్లు
ఎండాడ చెక్‌పోస్టు వద్ద రూ.కోటి పాత నోట్లు పట్టివేత సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు వుడా కాలనీ మురుగునీటిలో నకిలీ నోట్ల బస్తాలు ఏరుకోవడానికి ఎగబడిన జనం రంగంలోకి ఐటీ అధికారులు విశాఖపట్నం/పీఎం పాలెం/మధురవాడ : అర్ధరాత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే పోలీసుల కళ్లు చెదిరిపోయారుు. కోటి రూపాయల నగదు చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే డబ్బు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో డబ్బుల బస్తాలు మురుగు కాలువలో దర్శనమిచ్చారుు. వాటిని గమనించిన స్థానికులు అందినకాడికి పట్టుకుని పరుగుతీశారు. ఇంకా ఏమైనా మిగిలిపోయాయోమోనని కొందరు మురుగుకాలువలో దేవులాడారు. చివరికి కేవలం ఐదు నోట్లు దొరికారుు. అవి కూడా నకిలీవని తెలిసి అవాక్కయ్యారు. నగరంలో బుధవారం జరిగిన ఈ రెండు సంఘటనలు పెద్ద నోట్ల రద్దుతో ’నల్ల’ పాములు బయటకొస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు నగరంలో నకిలీ నోట్ల చెలామణీకి అద్దం పట్టారుు. రాత్రివేళ వాహనంలో తరలింపు ఒడిశాకు చెందిన ప్రీతమ్‌కుమార్ బారిక్, తమిళనాడుకు చెందిన వెంకటపతి ఒ.డి.5 09ఇ-1199 నంబరు గల బొలోరా వాహనంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి మీదుగా రూ. కోటి రూపాయలు పాతనోట్లు తమ వెంట తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆనందపురం ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఎండాడ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న బొలోరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200 బండెల్స్ పాత ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు (వాటి విలువ రూ. కోటి) కనిపించారుు. వెంటనే కారు డ్రైవర్‌ను, అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం నగరమంతా దావానలంలా వ్యాపించింది. కానీ పోలీసులు మాత్రం అత్యంత గోప్యత పాటించారు. రాత్రి వరకూ వివరాలు వెల్లడించలేదు. కాగా పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తాము త్రివేణీ ఎర్త్ అనే ప్రైవేటు సంస్థ ప్రతినిధులమని మెకానికల్, డీజిల్ ఫైర్ పార్టులకు చెల్లింపుల కోసం ఈ సొమ్ము తరలిస్తున్నామని వారిలో ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన విషయంలో ఈ నగదు చెల్లించాల్సి వచ్చిందని మరో వ్యక్తి పోలీసులకు వివరించారు. వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపేణా లావాదేవీలు జరగడం అంటూ ఉండదని, చెక్కు, డీడీ రూపంలో చెల్లింపులు ఉంటాయనే కోణంలో రికార్డులు చూపమని పోలీసులు వారిని అడిగారు. చూపిస్తామంటూ సాయంత్రం వరకూ కాలం గడిపినా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయారు. నగదుకు సంబంధించి వారు సరైన ఆధారాలు చూపలేకపోయారని, దాంతో కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. మరోవైపు ఐటీ ప్రతినిధులు ఈ ఉదంతంపై ఆరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నివేదికను సీఐ వారికి అందజేశారు. మురుగు కాలువలో నకిలీ నోట్లు జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో బుధవారం ఉదయం దొంగనోట్లు కలకలం రేపారుు. ఉదయం 6గంటల సమయంలో మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డులో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద మురుగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు బస్తాలతో రు.500 నోట్లు పడేసి పరారయ్యారు. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏరుకోవడానికి జనం పరుగులు తీశారు. మోకాలు లోతు నీటిలో సైతం నోట్ల కోసం వెతికారు. అవి దొంగనోట్లు అని తెలిసినా వెతుకులాట ఆపలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇవి చెల్లని నోట్లు అని అందరినీ చెదరగొట్టారు. అరుుతే సుమారు కోటి రూపాయలు విలువ చేసే నోట్లు బస్తాలతో పడేశారని, కొందరు వీటిని పట్టుకెళ్లిపోయారని, చాలా నోట్లు ఈ కాలువలో కొట్టుకు పోయాయని పుకార్లు షికారు చేశారుు. ఈ విషయంమై పీఎంపాలెం సీఐ లక్ష్మణమూర్తి వివరణ కోరగా నోట్లు ఎవరు పడేశారో, ఎంత మొత్తం అనే విషయాలు తెలియదన్నారు. అరుుతే అవి దొంగనోట్లు అని భావిస్తున్నామని తెలిపారు. -
ఆర్టీపీపీ ఉద్యోగిపై ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగి దివ్యనాథ్‌ను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్( ఎస్పీఎఫ్ ) ఎస్ఐ శివతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. డబ్బుల కోసం ఆర్టీపీపీలోని ఆంధ్రా బ్యాంక్ వద్ద బుధవారం క్యూలో నిలబడి ఉన్న ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఉద్యోగులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో దివ్యనాథ్ అనే ఉద్యోగిని ఎస్పీఎఫ్ సిబ్బంది లాఠీలతో చితకబాదారు. కాగా, ఎస్పీఎఫ్ ఎస్ఐ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలమల్ల పోలీసులు దివ్యనాథ్ అనే ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వెంటనే ఉద్యోగిని విడుదల చేయాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగి గేటును మూసి వేశారు. ఈ ఆందోళన బుధవారం రాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగి దివ్యనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీఎఫ్ ఎస్ఐ శివపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో ఉద్యోగులు శాంతించారు. -
అక్రమ టపాసుల పట్టివేత
రాయచోటి టౌన్: దీపావళి పండుగ వస్తుండటంతో టపాసుల అక్రమ వ్యాపారాలు జోరందుకున్నాయి. టపాసుల వ్యాపారానికి సంబంధించి లైసెన్స్ కలిగిన వారికి పోలీసులు ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే లైసెన్స్ లేకుండా, అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. వీరి వలలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. పట్టణంలోని గాంధీ బజార్ దగ్గరలోని వీధిలో అక్రమంగా టపాసుల వ్యాపారం చేస్తున్న రఫీవుల్లా బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న టపాసులను వారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగేశ్వరరెడ్డి తెలిపారు. -
అప్పు తీర్చలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అమృతానగర్‌లో షేక్.ఖాజా(30) అనే ఆటో డ్రైవర్ విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఖాజా పట్టణంలోని ఖాసిం డెకరేషన్ దుకాణంలో పని చేయడంతో పాటు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భార్యకు ఆరోగ్యం సరిగా లేదని అతను 7 నెలల క్రితం డెకరేషన్ షాపు యజమాని వద్ద రూ.1 లక్ష బాకీ తీసుకున్నాడు. అయితే షాపు యజమాని గత కొన్ని రోజుల నుంచి డబ్బు ఇవ్వమని బలవంత పెడుతున్నాడు. దీంతో ఖాజా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగగా, స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పరిశీలించిన వైద్యుడు చెప్పారు. మంగళవారం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య ఖాదర్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ జిఎండి బాషా తెలిపారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
కడప అర్బన్ : కడపలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో భాగ్యనగర్‌కు చెందిన లక్ష్మినారాయణరెడ్డి తన ఇంటి పక్కనున్న బాత్రూము పైపులైన్ పగులగొట్టించేందుకు గంగులయ్య అనే తన స్నేహితుని ద్వారా కూలీలను శనివారం ఉదయం పిలిపించాడు. వారు పని చేస్తుండగా సిద్దారెడ్డి, ఇంకా కొంత మంది కలిసి పక్కింటిలో నివసిస్తున్న రేవతి అలియాస్ అనసూయకు అనుకూలంగా లక్ష్మినారాయణరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మినారాయణరెడ్డి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దారెడ్డి, అతని కుమారుడు, రేవతి అలియాస్ అనసూయ, ఆమె కుమార్తె, అల్లుడు ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల చిన్నచౌకు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. -
పరిచయాలతో చీకటి సామ్రాజ్యం
సాక్షి, హైదరాబాద్: అరాచకాలకు, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నయీమ్.. తన స్నేహితులు, పరిచయస్తులకు మాత్రం భారీగా మేలు చేకూర్చాడు. తనకున్న ప్రతీ పరిచయాన్ని నేర కార్యకలాపాల విస్తరణకు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తోంది. పాత పరిచయాలతోనే మహబూబ్‌నగర్ జిల్లాలో.. ముఖ్యంగా ఆమన్‌గల్, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై 163 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో కూడా నయీమ్ ముఠా తలదూర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు కావడంతో సిట్ పోలీసులు దానిపై దృష్టిసారించారు. మావోయిస్టు మాజీ కమాండర్ హత్య వెనుక మహబూబ్‌నగర్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలను అణిచివేయడానికి పోలీసులకు నయీమ్ సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. 2014లో ఒక మాజీ మావోయిస్టు హత్య వెనుక నయీమ్ హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్‌కు చెందిన మావోయిస్టు మాజీ కమాండర్ శ్యాం అలియాస్ యాదయ్య 2014లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన వెంటనే రమాకాంత్ అనే మాజీ మావోయిస్టు మరికొంత మంది లొంగిపోయారు. వీరందరూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత.. మాజీ మావోయిస్టులు ఈశ్వరయ్య, రమాకాంత్ కనిపించకుండా వెళ్లిపోయారని, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాప్ చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి ద్వారా నయీమ్ కుడిభుజం శేషన్న ఆచూకీ కనిపెట్టాలని భావిస్తున్నారు. ముంబై నుంచి బెదిరింపు కాల్స్: గోళి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై తనతో పాటు మరో 20 మంది రైతులకు సంబంధించిన 163 ఎకరాల వ్యవసాయ భూమిపై నయీమ్ ముఠా కన్నేసి వేధింపులకు గురిచేసిందని గోళి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి పేర్కొన్నారు. వెల్దండ మండలంలోని సర్వే నంబర్లు 27, 44, 46, 49, 50, 97, 98, 122, 303/2, 55/1, 55/2 లలో 163 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దీనిపై కన్నేసిన నయీమ్ ముఠా ఏడాదిన్నరగా తనను వేధించిందన్నారు. చంపేస్తామనడంతో ఏడాదికి పైగా అజ్ఞాతంలో ఉంటున్నట్లు చెప్పారు. తన భార్యకు నయీమ్ అనుచరులు 8767913712 నంబర్ నుంచి ఫోన్ చేశారని, దీనిపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేయగా ముంబై అడ్రస్‌తో నంబర్ ఉన్నట్లు తేలిందన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ప్రస్తుతం ఆ భూమి వద్దకు అతడి అనుచరులెవరూ రావడం లేదన్నారు. -
ఆ నలుగురు టాపర్స్పై ఎఫ్ఐఆర్
పట్నా: బీఎస్ఈబీలో టాపర్స్‌గా నిలిచిన రూబీ రాయ్, సౌరభ్ శ్రేష్ఠ, రాహుల్ కుమార్, శాలినీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైశాలిలోని విషుణ్ రే కళాశాల డైరెక్టర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండా 14మంది టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారంటూ రూబీ రాయ్ అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్చల్ సృష్టించింది. పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని ఆమెకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. మరోవైపు సైన్స్ టాపర్ సౌరవ్ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్లు అంటే ఏంటో తెలియదన్నాడు. దీంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో టాపర్ రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. అలాగే తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. అందులో అతడు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
పఠాన్ కోట్ దాడిపై పాక్‌లో ఎఫ్ఐఆర్ నమోదు
ఇస్లామాబాద్ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏడుగురు వ్యక్తులపై గుజ్రాన్వాల కౌంటర్ టెర్రరిజం పోలీస్ స్టేషన్లో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ప్రమేయం ఉన్నప్పటికీ ... దానిపై పాక్ మాత్రం పెదవి విప్పడం లేదు. కాగా ఉగ్రవాదులు దాడి జరిపి సృష్టించిన బీభత్సంపై ఇప్పటికే మన దేశం కీలకమైన సాక్ష్యాధారాలను పాకిస్తాన్‌కు అందించింది. వాటిపై తగిన చర్యలు తీసుకున్నాక ఇరు దేశాలమధ్యా జరగాల్సిన చర్చలు ప్రారంభమవుతాయని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి. ఆ ఉదంతానికి సంబంధించి జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై దాడులు జరిగాయని, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చినా అందుకు సంబంధించిన పురోగతి ఏమిటో పాక్ ఇంతవరకూ చెప్పలేదు. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్టు కథనాలు రావడం, చివరి అతను గృహ నిర్బంధంలో ఉన్నాడని గుప్పుమనడం కూడా అయింది. అయినప్పటికీ పాక్ మాత్రం తాజాగా ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయడం గమనార్హం. -
పఠాన్ కోట్ ఉగ్రదాడిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. ముందుగా పఠాన్ కోట్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ చేసి, దర్యాప్తు బాధ్యత అప్పగించారు. అక్రమాయుధాలు కలిగివుండడం, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 26/11 దాడి తర్వాత ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. పఠాన్ కోట్ దాడి వెనుక పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద జైషే-ఈ-మొహ్మద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. సైనిక ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఎన్ఎస్ జీ అంగీకారంతో తీవ్రవాదుల మృతదేహాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలు పెడుతుంది. ఉగ్రవాదుల చొరబాటు నుంచి అన్ని విషయాలపై దృష్టి సారిస్తుంది. -
కొనసాగుతున్న అరెస్టుల పరంపర
చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను విచారిస్తున్న పోలీసులు పది రోజుల పోలీసు కస్టడీకి యోగ, శశిధర్ టీడీపీ నేతలపై కేసు నమోదుకు రంగం సిద్ధం? చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ దంపతుల హత్య కేసు కొలిక్కి వస్తోంది. ప్రధాన నిందితుడు చింటూను విచారిస్తున్న పోలీసులు కేసులో పురోగతి సాధించా రు. పరారీలో ఉన్న చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి వెంకటేష్ కోసం చిత్తూరు కోర్టు వద్ద పోలీసులు నిఘా ఉంచారు. అతన్ని కోర్టు వద్ద చూసిన మేయర్ అనుచరులు పట్టుకున్నారు. వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరంధామ సోదరుల అరెస్టు టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఐదుగురిలో ముగ్గురు పరంధామకు సోదరులు కావడం విశేషం. చింటూ మేయర్ కుటుంబంపై కసి పెం చుకోవడంలో పరంధామ పాత్ర కీలకం కావడం, అతన్ని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పరంధామ సోదరుల్లో చింటూ విద్యాసంస్థల వ్యవహారా న్ని చూసుకుంటున్న వాసు, ఆర్థిక లావాదేవీలు చూసే గుణశేఖర్, ఇతర వ్యవహారాలు చక్కబెట్టే లక్ష్మీపతితో పాటు అనుచరులుగా ఉన్న అప్సర్, సతీష్‌ను తాజాగా అరెస్టు చేశారు. వీరిపై మారణాయుధాల నిరోధక చట్టం- 1959 కింద కేసులు నమోదు చేశారు. ఇక చింటూ అనుచరులని చెప్పుకోవడానికి బయట ఎవరూ లేకుండా పోలీసు లు అందరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తులో పట్టు సాధించినట్లయ్యింది. కస్టడీకి యోగ, శశిధర్ ఐదురోజుల క్రితం వెంకటాచలం, మంజునాథ్, జయప్రకాష్‌ను పది రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు విషయాలను రాబ ట్టారు. ఈ క్రమంలో రిమాండులో ఉన్న యోగ, శశిధర్‌ను న్యాయస్థానం అనుమతితో వన్‌టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని పది రోజుల పాటు విచారించనున్నారు. తెలుగు తమ్ముళ్లకు సంబంధం..? మేయర్ హత్య కేసులో తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న చింటూతో పాటు బయటి వ్యక్తుల్ని విచారించడంతో ఈ విషయం బయట పడింది. మేయర్ దంపతుల హత్య కుట్ర ఇద్దరు తెలుగు దేశం నాయకులకు తెలిసినా పోలీసులకు విషయం చెప్పకుండా దాచేసినట్లు సమాచారం. దీంతో వీరిపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు జిల్లా పార్టీలో ప్రధాన పదవిలో ఉండగా, మరో వ్యక్తి ఎర్రచందనం కేసుల్లో అరెస్టయిన నిందితుడిగా చెబుతున్నారు. పుంగనూరులో పిస్టోలు స్వాధీనం మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు ఆశ్రయం కల్పించారనే సమాచారంతో గురువారం పుంగనూరులో స్థానిక పోలీసులు పలుచోట్ల సోదాలు నిర్వహించారు. నగరంలోని దండుపాళ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో పిస్టోలును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో పోలీసులు పుంగనూరులో ఇద్దరు న్యాయవాదులు సహా నలుగురిని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. తాజాగా ఓ వ్యక్తిని, పిస్టోలును స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సోదాల్లో పుంగనూరు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు. -
తండ్రి పీక కోసి.. తల్లిపై కత్తితో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ నవోదయ నగర్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తన కన్నతండ్రి పీక కోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తండ్రి ఎల్లయ్య (60) అక్కడికక్కడే మరణించాడు. అడ్డొచ్చిన తల్లి లక్ష్మమ్మపై కొడుకు లక్ష్మణ్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై స్థానికులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మమ్మను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది. ఢిల్లీలోని డబ్లూడబ్లూఎఫ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఓ యువతిని ఆపినందుకు.. సెక్యూరిటీ గార్డ్‌ను ఇలా చెంప చెళ్లుమనిపించింది. ఆ కార్యక్రమానికి రావాల్సిన సమయం కన్నా మన్మోహన్ సింగ్ ముందే రావడంతో ఆడిటోరియంలోకి జర్నలిస్టులను, పుస్తకాభిమానులను మన్మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియంత్రించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఈనెల పదవ తేదీన జరగ్గా బుధవారం ఆ అమ్మాయిని టర్కీ దేశస్థురాలిగా గుర్తించి కేసు పెట్టారు. ఆమె సిక్యూరిటీ గార్డ్‌ను చెంప చెళ్లుమనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. -
సీఎం చంద్రబాబు పై కేసు నమోదు
-
ఎస్సైపై కేసు నమోదు
రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ ఇరగవరం/తణుకు :రెండో వివాహం చేసుకోవడమే కాకుండా భార్యను వేధిస్తున్నాడనే అభియోగంపై ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామానికి చెందిన ఎస్సై జక్కంశెట్టి భానుప్రసాద్, మరో ఏడుగురిపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి సఖినేటిపల్లి ఎస్సైగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జక్కంశెట్టి భానుప్రసాద్ నరసాపురం మండలం పితాని మెరక గ్రామానికి చెం దిన గుబ్బల దుర్గాభవాని అలియాస్ జ్యోతిని 2013లో ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నారు. కట్నకానుకల రూపంలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఆస్తి, నగదు ఇచ్చారు. పెళ్లయిన నాటినుంచి భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ విడాకులు ఇవ్వాలని భానుప్రసాద్ బలవంతం చేసేవాడని, పెద్దల సమక్షంలో రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో భానుప్రసాద్ భార్య దుర్గాభవానిని వదిలి వెళ్లిపోయాడన్నారు. దీంతో ఆమె అత్తారింటి ముందు మూడు రోజులపాటు దీక్ష చేసింది. భానుప్రసాద్‌లో మార్పు రాకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు, మానవహ క్కుల సం ఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భానుప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. ఇదిలావుండగా దుర్గాభవానిని వివాహం చేసుకోకముందే కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం మల్లపరాజుగూడేనికి చెందిన సరోజ అనే మహిళను రిజిస్టర్ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తణుకులో విద్యాభ్యాసం చేసిన భానుప్రసాద్ 2005లో ఎస్సై ఉద్యోగం పొందారు. నూజివీడు, ముదినేపల్లి, సఖినేటిపల్లి, రంపచోడవరం స్టేషన్లలో విధులు నిర్వహించారు. దుర్గాభవాని ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, మోసం అభియోగాలపై 498(ఏ), 352, 307, 417, 420 తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అతని తల్లిదండ్రులు జక్కంశెట్టి లక్ష్మణరావు, జక్కంశెట్టి నాగమణి, సోదరులు దుర్గాప్రసాద్, రామకృష్ణ, సోదరి రాధాకుమారి, కుడుపూడి వెంకటేశ్వరరావు, స్నేహితుడు సుం కవల్లి సతీష్‌పై కేసు నమోదు చేశారు. -
శునకాన్ని ఢీ కొని యువకుడి మృతి
సంతోష్‌నగర్(హైదరాబాద్ క్రైం): బైకుపై వేగంగా వెళ్తూ కుక్క అడ్డురావడంతో దానిని ఢీ కొని కిందపడి వ్యక్తి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కంఛన్బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుభాష్‌నగర్‌కాలనీలో మంగళవారం జరిగింది. వివరాలు.. మీర్‌పేటకు చెందిన ఆడమ్స్(22), బాలు, శివలు బైకుపై వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న బైకుకు కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ఆడమ్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శివ, బాలులను ఒవైసీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఠాణాలో లొంగిపోయిన రమేశ్ రాథోడ్
* బెయిల్‌పై విడుదల * పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆరోపణ ఖానాపూర్/నిర్మల్ అర్బన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గన్‌మన్‌పై దాడి కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రమేశ్ రాథోడ్ సోమవారం నాటకీయ పరిణామాల మధ్య ఖానాపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. ఈ నెల 9న గన్‌మన్‌పై దాడి కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ 353, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8గంట లకు ఎస్సై అజయ్‌బాబు ఎదుట లొంగిపోగా భారీ భద్రత మధ్య నిర్మల్ కోర్టుకు రిమాండ్ చేశారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం నిర్మల్ నుంచి పార్టీ నాయకులతో భారీ కాన్వాయ్ మధ్య ఆయన ఖానాపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జగన్నాథ్చౌక్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్‌తో స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లే క్రమం అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు నిలువరించారు. కొంతమందినే పోలీసుస్టేషన్‌కు అనుమతించారు. తాను గన్‌మన్‌పై పెట్టిన అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీఐ అంగోతు నరేశ్‌కుమార్, ఎస్సై అజయ్‌బాబును కోరారు. దీంతో పోలీసులు తోసి వేశాడనే రశీదును ఇవ్వగా రమేశ్‌రాథోడ్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆ యన నిర్మల్, ఖానాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ అయిన తనకే న్యాయం జరగకపోతే సామాన్యులకు ఎలా జరుగుతుందని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను మరిపిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ కావాలనే తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడేది లేదని అన్నారు. అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లు, కార్యకర్తలు పనిచేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు, నాయకులు గండ్రత్ రమేష్, నాగరాజు, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సూట్ కేసులో మృతదేహం
నిజామాబాద్ క్రైం: నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పారవేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రాంతం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్‌కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో కాలనీవాసులు కొందరు అనుమానం వచ్చి సూట్‌కేసులో ఏం ఉందోనని తెరిచిచూశారు. సూట్‌కేసులో 35 నుంచి 40 ఏళ్లవయసున్న వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, తెల్లగీతాల షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం ఏ మాత్రం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే మహిళపై అత్యాచారయత్నం
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బొల్లారంలో ఓ మహిళపై పట్టపగలే దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దుండగుడు దాడి చేసి అత్యాచారం చేసేందుకు యత్నించటంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో అతడు మహిళను బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచాడు. మహిళ గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమచారం. పోలీసులు ఈ ఘటనపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దిగ్విజయ్౬సింగ్ పై కేసు నమోదు