తండ్రి పీక కోసి.. తల్లిపై కత్తితో దాడి | son attacks on parents | Sakshi
Sakshi News home page

తండ్రి పీక కోసి.. తల్లిపై కత్తితో దాడి

Oct 23 2015 2:55 PM | Updated on Sep 2 2018 4:37 PM

హైదరాబాద్ నవోదయ నగర్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తన కన్నతండ్రి పీక కోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

హైదరాబాద్: హైదరాబాద్ నవోదయ నగర్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తన కన్నతండ్రి పీక కోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తండ్రి ఎల్లయ్య (60) అక్కడికక్కడే మరణించాడు.

అడ్డొచ్చిన తల్లి లక్ష్మమ్మపై కొడుకు లక్ష్మణ్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై స్థానికులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మమ్మను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement