ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


