చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా చారిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఎనిమిది సూత్రాల ఏకాభిప్రాయం ప్రకారం, 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.87 లక్షల కోట్లు)పరస్పర సుంకాల తగ్గింపు ఒప్పందం, ఏఐ (AI) పై చర్చలు ప్రారంభించడంపై అమెరికాతో ఒప్పందం కుదిరినట్టు చైనా శనివారం తెలిపింది. ఒక వాణిజ్య మండలిని ఏర్పాటుకు, కౌలాలంపూర్‌లో ఇంతకుముందు జరిగిన చర్చల ఫలితాలను పొడిగించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించా యని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
టారిఫ్ తగ్గింపు ఒప్పందం
అమెరికా, చైనా దేశాలు 30 బిలియన్ డాలర్ల పరస్పర టారిఫ్ తగ్గింపు (tariff-reduction) ఒప్పందానికి అంగీకరించినట్లు చైనా శనివారం ప్రకటించింది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కుదిరిన తాత్కాలిక విరామాన్ని (trade truce) మరో రెండు నెలలు పొడిగించినట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
ఏఐ రంగంలో చర్చలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. రాబోయే నవంబర్‌లో తదుపరి విడత చర్చలు జరగనున్నాయి. అలాగే, ఏఐ సంబంధిత ఘటనలపై కమ్యూనికేషన్ ఛానెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏఐకి బదులుగా "సూపర్ ఇంటెలిజెన్స్" అనే పద వాడకాన్ని బీజింగ్ స్వాగతించింది.

వాణిజ్య మండలి ఏర్పాటు
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలపర్చేందుకు ఒక ట్రేడ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నాయకుల సమావేశం మరియు G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడంలో పరస్పర మద్దతుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చే ఈ సమావేశాలకు హాజరుకావాలని యోచిస్తున్నారు.
దీంతోపాటు విదేశాంగ విధానం విషయానికి సంబంధించి ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా చూసేందుకు కట్టుబడి ఉండాలని, అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశం కూడా రవాణా టోల్స్ విధించకూడదని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. అలాగే, ఏపీఈసీ (APEC), జీ-20 (G20) సమావేశాలకు పరస్పరం హాజరయ్యేందుకు షీ జిన్‌పింగ్, డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.
ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలం
కాగా నవంబర్ 10న ముగియనున్న వాణిజ్య సంధిని రెండు నెలల పాటు పొడిగించడానికి ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తీసుకున్న చర్యల కొనసాగింపుగా ఈ ఒప్పందం కుదిరిందని, తద్వారా మరింత పెద్ద వాణిజ్య ఒప్పందంపై పనిచేయడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల ప్రకటించారు.
ఇదీ చదవండి: లవర్‌తో పెళ్లి : పోలీస్‌కానిస్టేబుల్‌ని మట్టుబెట్టిన కొడుకు


