Photo Credit: Twitter
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 363 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా-ఎ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత బ్యాటర్లలో మిన్నూ మాని (56 బంతుల్లో 88 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించగా, నిక్కీ ప్రసాద్ (76), కెప్టెన్ అనుష్క శర్మ (58), తనీషా సింగ్ (60) అర్థశతకాలతో రెచ్చిపోయారు. జట్టులో నలుగురు బ్యాటర్లు అర్థశతకాలు చేసి తమ విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆసీస్ బౌలర్లలో చార్లీ నాట్, లిల్లీ మిల్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్ చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.
ఇదీ చదవండి: రెండుగా చీలిన భారత్; దంచేసిన కోహ్లి, రోహిత్.. గిల్ ప్లాఫ్ షో!


