భారత్‌తో తొలి వన్డే.. విండీస్ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు | Darren Sammy Says-Beat-India-If-You-Want-Win-Major-Icc-Event | Sakshi
Sakshi News home page

భారత్‌తో తొలి వన్డే.. విండీస్ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు

Sep 25 2026 7:02 PM | Updated on Sep 25 2026 7:38 PM

Darren Sammy Says-Beat-India-If-You-Want-Win-Major-Icc-Event

Photo Credit: Twitter

టీమిండియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ట్రోఫీలు సాధించాలంటే ముందు టీమిండియాను చావుదెబ్బ కొట్టాలని పేర్కొన్నాడు. డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచి 24 ఏళ్లవుతుంది. ఈసారి మాకు వారిపై సిరీస్ గెలిచేందుకు మంచి అవకాశముంది. ఇందుకు మమ్మల్ని మేము సవాల్ చేసుకొని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం. 

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే భారత్ వంటి పెద్ద జట్లను అడ్డుకునే రీతిలో మా ఆటతీరు ఉండాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్వాలిఫయర్స్ ఉంటాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో మేం ఆడేందుకు అర్హత సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఈసారి జట్టులో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. 

షెయ్ హోప్‌తో పాటు అమీర్ జంగూ, రూథర్‌ఫోర్డ్‌, అల్జారీ జోసెఫ్ లాంటి క్రికెటర్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియాను ఈసారి వన్డే సిరీస్‌లో నేలమట్టం చేసి ట్రోఫీతో ఇంటికి వెళతాం. ఐపీఎల్ వల్ల మా ప్లేయర్లకు భారత గడ్డపై మంచి అనుభవముంది.’ అని తెలిపాడు. భారత్‌తో తొలి వన్డేకు రోజు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విండీస్ కోచ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి.

2002లో చివరిసారి..
భారత గడ్డపై వెస్టిండీస్ చివరిసారి 2002లో వన్డే సిరీస్ గెలిచింది. ఆ జట్టుకు కార్ల్ హూపర్ కెప్టెన్‌గా ఉండగా, టీమిండియాకు సౌరవ్ గంగూలీ నేతృత్వం వహించాడు. ఆనాడు రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగ్గా వెస్టిండీస్ 4-3 తేడాతో భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత చాలాసార్లు భారత పర్యటనకు వచ్చినప్పటికీ విండీస్ రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది.

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. తొలి వన్డే తిరువ‌నంతపురం వేదికగా జరుగనుండగా, రెండో మ్యాచ్ గౌహతి వేదికగా సెప్టెంబర్ 30న ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన న్యూ ఛండీఘర్ వేదికగా చివరి మ్యాచ్ జర‌గుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఇరుజ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షురూ కానుంది.

ఇదీ చదవండి: 10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement